కర్ణాటక రాష్ట్రం బంజారా సంఘం నేత ధార్మిక ఆధ్యాత్మిక వేత్త శ్రీ మహారాజ్ ద్వారా భారత దేశ ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోడీ కి దేశస్థాయిలో సేవలు అందిస్తున్న ఆర్ టి టి ని కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు శుక్రవారం కర్ణాటక కు వెళ్లి రూపా నాయక్ నానుసాద్ కుటుంబీకుడు శ్రీ మహారాజును సేవా గడ్ ట్రస్టు ఉపాధ్యక్షులు ఎస్ కేశవ నాయక్ కలిశారు. ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ సుదీర్ఘకాలం బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు శుక్రవారం శ్రీ మహారాజ్ దేశ ప్రధానికి కలవడానికి వెళుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానికి ఆర్డిటి పై సమగ్రంగా తయారుచేసిన వినతి పత్రం అందజేయాలని కోరారు. ఈ విషయమై ప్రధాని హోం శాఖ మంత్రి తో చర్చించి తప్పకుండా న్యాయం జరిగేలాగా శ్రద్ధ తీసుకుంటానని శ్రీ మహారాజ్ కేశవ నాయక్ కు హామీ ఇచ్చారు శ్రీ మహారాజును కలిసిన వారిలో బంజారా సంఘం నేత లాల్ సింగ్ కర్ణాటక ప్రసిద్ధ గాయకుడు కుబేర్ నాయక్ ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్ కమల్ సింగ్ రాథోడ్ బంగి దుర్గ తదితరులు ఉన్నారు
Local to international