Skip to main content

Posts

Showing posts from September 21, 2025

సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ:ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని, కేవలం తాత్కాలికంగానే నిలిపివేశామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ‘సిందూర్‌’ పార్ట్‌ 2.. పాక్‌ తీరుపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. పాక్‌ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే.. ఆ దేశానికి తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. మొరాకో పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

28వ ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం.

సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చు.. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి వచ్చారు. ప్రజలకు మేలు జరిగే నూతన సంస్కరణలు తీసుకొచ్చారు.. సాంకేతికతను అనుగుణంగా మనమూ మారాల్సిన పరిస్థితి. ఇవాళ ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వచ్చాయి.. పోటీ ప్రపంచంలో వినూత్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఐటీ రంగంలో భారతీయులకు ఎంతో నైపుణ్యం ఉంది.. నాలెడ్జ్ ఎకానమీకి ఆనాడు ప్రాధాన్యత ఇవ్వడంవల్లే హైదరాబాద్ కు మేలు జరిగింది. తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రముఖంగా మారిన పరిస్థితి.. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే ఉన్నారు. ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న భారతీయుల్లో దాదాపు 30 శాతం ఏపీవారే.. ప్రపంచంలోని నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారత్ కు చెందినవారు. భారతీయ ఐటీ నిపుణులు ప్రతి నలుగురిలో ఒకరు ఏపీకి చెందినవారే కావడం విశేషం.. సాంకేతికత, మౌలిక సదుపాయాల కల్పతో రూపురేఖలు మారాయి : సీఎం చంద్రబాబు

నిత్యావసర వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే పన్ను .. 12 శాతంలో ఉన్న 99 శాతం వస్తువులు 5 శాతం పన్ను శ్లాబ్‌లోకి వచ్చాయి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ :ఇప్పటికే రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చాం . మధ్య తరగతి వారికి జీఎస్టీ సంస్కరణలతో డబుల్ బోనాంజా లభించింది.. దేశంలో కొత్త మధ్యతరగతి వర్గం పెరుగుతోంది.. వారికి ఇది ప్రోత్సాహకరం. రేపట్నుంచి గృహోపయోగ పరికరాల ధరలు తగ్గనున్నాయి .. జీఎస్టీ తగ్గింపుతో దుకాణాల యజమానులు కూడా సంతోషంగా ఉన్నారు.* నాగరిక్ దేవోభవ.. నినాదంతో మేం ముందుకెళ్తున్నాం.. జీఎస్టీ తగ్గించడంతో కుటీర పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతోంది.* ఎంఎస్ఎంఈలు, కుటీర పరిశ్రమల ఉత్పత్తుల విక్రయం పెరుగుతోంది .. రోజువారీ జీవితంలో మనం అనేక విదేశీ వస్తువులు వాడుతున్నాం .. విదేశీ వస్తువుల వినియోగం తగ్గాలి : ప్రధాని మోదీ

ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా అందేలా చర్యలు – మంత్రి లోకేశ్‌ లక్షలాది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఆశాకిరణం – ఆర్డీటీ

అనంతపురం: రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌ (ఆర్డీటీ) ఒక సాధారణ స్వచ్ఛంద సంస్థ కాదని, లక్షలాది మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపిన ఆశాకిరణమని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఆర్డీటీ సేవలకు తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినా, వాటిని శాశ్వతంగా పరిష్కరించి ప్రజలకు నిరంతరాయంగా సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. “ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సంప్రదించాం. ఆర్డీటీ సేవలు కొనసాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది” అని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలతో ఆత్మీయ బంధం, మానవతా సేవా బంధం కలిగిన ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

భూమన తప్పించుకోలేరు.. విచారణలో అన్నీ బయటపడతాయి: శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు

తిరుపతి :తిరుమల శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనంపై వివాదం రోజు రోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర బయటపడుతుందని శాప్‌ (SHAP) ఛైర్మన్‌ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రవినాయుడు మాట్లాడుతూ – “దొంగతనం చేసిన రవికుమార్‌ నుంచి చాలా మందికి ముడుపులు వెళ్లాయి. ముఖ్యంగా, భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని స్థలాలు తన పేరు మీద రాయించుకున్నాడు. విజిలెన్స్‌ విచారణలో అన్నీ బయటపడతాయి.. భూమన ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఆయన మాట్లాడే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి” అని మండిపడ్డారు. “స్వామి వారి సొమ్ము కాజేసి.. బయటకు వెళ్లి మాట్లాడుకొని సెటిల్‌మెంట్ చేసుకుంటే ప్రాయశ్చిత్తం అవుతుందా?” అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా యాదవ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌ కూడా స్పందిస్తూ – “భూమన చెప్పేవన్నీ అబద్దాలే. పరకామణి దొంగతనంపై రవికుమార్‌ నుంచి భూమన ఎంత వసూలు చేశాడో భక్తుల ముందే చెప్పాలి. వైసీపీ హయాంలో ఈ కేసును సిట్టింగ్‌ జడ్జితో ఎందుకు విచారణ చేయించలేదు? చంద్రబాబు, లోకేశ్‌లను విమర్శించే నైతిక హక్కు భూమనకు లేదు” అని...

స్పెషల్ సాంగ్ ట్రెండ్‌ మార్చనున్న మెగాస్టార్ చిరంజీవి

యంగ్ హీరోయిన్ల స్థానంలో సీనియర్ బ్యూటీ.. టాలీవుడ్‌లో కొత్త చర్చ టాలీవుడ్: మెగాస్టార్ చిరంజీవి ఐదు దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న క్రేజ్‌తోపాటు, ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్‌ను సెట్ చేయడం ద్వారా అభిమానుల మన్ననలు అందుకుంటున్నాడు. ఈసారి అతను మరొక సరికొత్త ప్రయత్నానికి సిద్ధమవుతున్నాడు – స్పెషల్ సాంగ్‌లో యంగ్ హీరోయిన్‌ల స్థానంలో ఓ సీనియర్ బ్యూటీని తీసుకోవడం. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించనున్నది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో మెగాస్టార్ ప్రత్యేకంగా ఒక సీనియర్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ రికార్డు చేయాలనుకున్నాడు. మొదట అనీల్ డైరెక్టర్ పూజ హెగ్డే, తమన్నా వంటి యంగ్ హీరోయిన్లను ఆ పాటకు సెలెక్ట్ చేయాలని భావించినప్పటికీ, చిరంజీవి “ఈ స్పెషల్ సాంగ్ ట్రెండ్ సెట్ అవ్వాలి” అనే కారణంతో సీనియర్ బ్యూటీని తీసుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. డైరెక్టర్ కూడా ఈ వైవిధ్యమైన కాన్సెప్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు మేకర్స్ వివిధ సీనియర్ హీరోయిన్ల పేర్లను పరి...

పరకామణి కరెన్సీ చోరీ: నిరూపిస్తే తల నరుక్కుంటా – భూమన

“ తిరుమల: ఎపీలో తిరుమల శ్రీవారి పరకామణి వ్యవహారం రాజకీయ దృశ్యాన్ని వేడెక్కిస్తోంది. గతంలో పింక్ డైమండ్, ఇప్పుడు పరకామణి అనే రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారిన ఈ వ్యవహారంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. భూమన్ పక్కా గట్టి పదజాలంలో, “ఫారిన్ కరెన్సీ దోపిడీ ఘటన నా హాయంలో జరిగిందని నిరూపిస్తే, అలిపిరి దగ్గర నా తల నరుక్కుంటుంది” అని చెప్పారు. అంతేకాక, ఈ కేసును సీఐడీ ద్వారా కాక, సీబీఐ ద్వారా విచారణ జరపాలనే ఛాలెంజ్ విసిరారు. ఈ ఘటనలో తిరుమల పరకామణిలోని రవికుమార్ ఓ మఠం తరపున ఉన్నారని, ఏళ్ల తరబడి గుమస్తాగా పని చేసి, శ్రీవారికి వచ్చిన విదేశీ కరెన్సీని లెక్కించేవారని తెలుస్తోంది. అయితే 2023 ఏప్రిల్ 29న వైసీపీ హయాంలో ఆయన కొంత విదేశీ నోట్లను పంచెలో దాచాడని ఆరోపణలు ఉన్నాయని భాను ప్రకాష్‌రెడ్డి ప్రస్తావించారు. ఈ వ్యవహారం అధికారులు, రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధంకు దారి తీస్తోంది. ఘటన హైకోర్టు దృష్టికి వచ్చింది. శనివారం న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేస్తూ దర్యాప్తు బాధ్యతను సీఐడీకి అప్పగించింది. శ్రీవారి కానుకల చోరీ కేసు రికార్డులను వెంటనే సీజ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇ...

బగ్రాం ఎయిర్‌బేస్ పై ట్రంప్ హెచ్చరిక, ఆఫ్ఘన్ ప్రభుత్వ స్పందన

అమెరికా:ఆఫ్ఘనిస్థాన్‌లోని కీలకమైన బగ్రాం ఎయిర్‌బేస్ను తిరిగి అప్పగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లేనిపక్షంలో “తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి” అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తన **సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’**లో పేర్కొన్నారు, "బగ్రాం ఎయిర్‌బేస్‌ను అమెరికాకు నిర్మించిన వారికి ఆఫ్ఘనిస్థాన్ తిరిగి అప్పగించకపోతే, తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి." ఇప్పటికే ఈ స్థావరాన్ని తిరిగి పొందేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన శుక్రవారం విలేకరులకు తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తాలిబన్ పాలనలోని ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ సీనియర్ దౌత్యవేత్త జలాలీ శనివారం మీడియాకు వివరించగా, “తమ భూమిపై విదేశీ సైనిక ఉనికిని ఎప్పటికీ అంగీకరించబోము. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా మాత్రమే అమెరికాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలు కొనసాగించాలి” అని వెల్లడించారు.

12oవ మహాభారత యజ్ఞ మహోత్సవం ధ్వజారోహణ

తవణంపల్లి:- తవణంపల్లి మండల కేంద్రంలో ద్రౌపతి ధర్మరాజుల ఆలయంలో 120వ మహాభారత మహోత్సవ ధ్వజారోహణ అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా గుడిసె మునస్వామి శెట్టి మాట్లాడుతూ 21 ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ నక్షత్రం యోగంతో కూడిన శుభ వృశ్చిక లగ్నమందు తవణంపల్లి కేంద్రంలోని శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో మహాభారత యజ్ఞం ధ్వజారోహణ జరిగింది ఈ సందర్భంగా గుడిసె మునస్వామి మాట్లాడుతూ 21వ తేదీ నుండి 13 10 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు మహాభారత హరికథ గాన కోకిల నాట్య మయూరి టిటిడి అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆర్టిస్ట్ హరికథ కాలక్షేపం జరుగుతుందని ఆలయ ధర్మకర్త తెలిపారు ఈ సందర్భంగా ప్రతిరోజు 2 గంటల నుండి6 గంటల వరకు ఏ. శారద భాగవతలని గారిచే హరికథ కాలక్షేపం29 వ తేదీ నుండి 13 10 2025 వరకు ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం 5. 30 గంటల వరకు మహాభారత హరికథ కాలక్షేపం జరుగుతుందని 29 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బక్కసుర బలి బండి అదే రోజు నుండి 12. 10. 20వ తేదీ వరకు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 14 రోజులు ప్రతిరోజు రాత్రి వీధి నాటకంలో తమిళంలో అతి వైభవంగా జరుగును న...

ఉచిత వైద్య శిబిరం స్పందన

పుత్తూరు:- ఉషోదయ వాకర్స్ అసోసియేషన్, పుత్తూరు వారి చే పాలమంగళం, సచివాలయం నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ తిరుపతి వారి సహకారంతో దినకర్ గాండ్ల ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహించడమైనది. 150మంది రోగులకు కంటి పరిక్షలు, బ్లడ్, షుగర్, ఎముకలు,ఈసీజీ పరీక్షలు చేసి 45000/-విలువ గల మందులు ఉచితంగా ఇవ్వడమైనది.కంటి పరీక్షలు చేయించు కొన్న వారిలో 27 మందికి శుక్లలు వల్ల కంటి ఆపరేషన్ కి సెలెక్ట్ చేయడమైనది. ఉషోదయ వాకర్స్ అసోసియేయిన్ వ్యవస్థాపక అధ్యక్షులు కోనేటి రవిరాజు, కార్యదర్శి రామ్ మోహన్ వర్మ, పాల్గొని క్యాంపు నిర్వహించినారు. ఆస్టర్ నారాయణ ద్రి హాస్పిటల్ డాక్టర్ అర్జున్, పి. ఆర్. ఓ. మౌళి మరియు సిబ్బంది పాల్గొన్నారు.వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్ బాలకృష్ణ, పి. ఆర్. ఓ వెంకటేష్, సంధ్యా పాల్గొన్నారు. ఈ క్యాంపు కు భాస్కర్ నాయుడు, ఉపసర్పంచ్, నరసింహాశెట్టి,రవి నాయుడు, జనార్దన్ రెడ్డి, సెందిల్, లీలావతి మరియు గ్రామ సభ్యులు పాల్గొని మెడికల్ క్యాంపు దిగ్విజయముగా జరిపించిన్నారు.

మంత్రి తీరుపై సాలూరు గిరిజన నాయకులు మండిపాటు బాధలు చెప్పేందుకు వస్తే అరెస్టులు చేయిస్తారా అంటూ ప్రశ్న

సాలూరు :-రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తీరు అన్యాయంగా ఉందని, తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన గిరిజన నిరుద్యోగులను అరెస్టులు చేయించటం దారుణమని ఆదివాసీ గిరిజన నాయకులన్నారు. జిల్లా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొండగొర్రె ఉదయ్ తో పాటు సాలూరు మండల ఏజేఏసీ ప్రెసిడెంట్ నిమ్మక అన్నారావు, మండల జనరల్ సెక్రటరీ సుర్ల ప్రవీణ్, ఆదివాసీ వికాస పరిషత్ ట్రెజరర్ మచ్చ భీమారావు తదితరులు ఆదివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. శనివారం సాలూరు జరిగిన గిరిజన నిరుద్యోగుల అరెస్టులు అన్యాయమన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శనివారం ఉదయం పాడేరు, అరకు ప్రాంతాల నుండి కొంతమంది గిరిజన నిరుద్యోగులు మంత్రి సంధ్యారాణిని కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు రాగా వారిని తన ఇంటికి రానివ్వ కుండా చుట్టూ పోలీసులను కాపలా పెట్టారని, అంతేకాకుండా అరెస్టులు చేయించారన్నారు. సంధ్యారాణి గారు ఎన్నికల ముందు నేను మీ గిరిజన ఆడపడుచుని నాకు ఓటు వేసి గెలిపించండి అని కోరారని, అధికారంలోకి వచ్చాక పట్టించు కోవడం లేదన్నారు. తమ బాధలు, అన్యాయాన్ని వివరించే వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వస్తే అరెస్టులు చే...

డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు

  డిసెంబర్ నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేయు వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అంగ ప్రదక్షిణ టోకెన్లను కూడా ఈ నెల నుండి ఆన్ లైన్ లో ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా జారీ చేయనున్నారు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయ‌నుంది. 22న వర్చువల్ సేవల కోటా విడుదల వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి దర్శన కోటా డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం...

ఆర్ధికంగా దోపిడీ చేయరాదు

 సుప్రీంకోర్టు సంచలన తీర్పు  సుప్రీంకోర్టు నుంచి (కాంట్రాక్ట్ / డైలీవేజ్ / తాత్కాలిక / థర్డ్ పార్టీ అవుట్‌సోర్సింగ్) ఉద్యోగుల పక్షాన ఇచ్చిన అతి పెద్ద తీర్పు.  *భారత సుప్రీంకోర్టు*    సివిల్ అప్పీల్ నెం.: 8558/2018 ధరమ్ సింగ్ & ఇతరులు వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం & ఇతరులు తీర్పు తేదీ: 19 ఆగస్టు 2025  కాంట్రాక్ట్ / డైలీవేజ్ / థర్డ్ పార్టీ / ఆధ్యాత్మిక (Ad-hoc) / తాత్కాలిక ఉద్యోగులు — ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలు అందిస్తూ, శాశ్వత ఉద్యోగుల మాదిరిగా పని చేయించుకుంటూ, తక్కువ వేతనం చెల్లించడం మరియు రెగ్యులరైజ్ చేయకపోవడం — ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16, 21 ఉల్లంఘన.  కాంట్రాక్ట్ / డైలీవేజ్ / థర్డ్ పార్టీ / ఆధ్యాత్మిక / తాత్కాలిక ఉద్యోగులు — 3 సంవత్సరాలకు పైగా సేవలు పూర్తి చేసినవారికి శాశ్వత ఉద్యోగుల మాదిరిగా పే స్కేలు మరియు ఇతర లాభాలు ఇవ్వాలి. అలాంటి ఉద్యోగులను ఆర్థికంగా దోపిడీ చేయరాదు.  కాంట్రాక్ట్ / డైలీవేజ్ / థర్డ్ పార్టీ / ఆధ్యాత్మిక / తాత్కాలిక ఉద్యోగులు — 3 సంవత్సరాలకు పైగా (పథకం / స్కీమ్‌లో) సేవలు పూర్తి చేసి ప్రభుత్వ సేవల్లో...

రైతులకు 90% సబ్సిడీ తో పప్పు శనగ పంపిణీ చేయాలి

 రైతులకు 90 శాతం సబ్సిడీతో పప్పు శనగను పంపిణీ చే యాలి రబీ సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా నియోజకవర్గంలో రైతులందరికీ 90 శాతం సబ్సిడీతో పప్పు సెనగ, పెసర, అలసందులు విత్తనాలు మరియు ఎరువులు, పురుగుల మందులను అందించాలని సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు బి. చెన్నారాయుడు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సకాలంలో వర్షాలు వస్తున్నందున రైతులందరూ కూడా రబీ సీజన్లో విత్తన సాగకు సిద్ధమవుతున్నారని ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు సబ్సిడీ విత్తనాలు సరఫరా పై ఏలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని    ఏమాత్రం జాప్యం చేయకుండా విత్తనాలను సరఫరా చేయాలన్నారు. అలాగే ఉరవకొండ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలను, పురుగుమందులను విక్రయిస్తున్న షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు.

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు: కడప డిఈఓ

  కడప జిల్లా... దసరా సెలవుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని కడప డిఈఓ శంషుద్దీన్ హెచ్చరించారు. ప్రైవేట్ యాజమాన్యాలు ప్రత్యేక తరగతులు, ట్యూషన్ల పేరుతో క్లాస్లు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిందేనన్నారు.

ఏటీఎంలో డబ్బు ఇరుక్కుంటే ఏం చేయాలి?

మీ డబ్బు ఏటీఎంలో ఇరుక్కుపోయి, అది మీకు చేతికి రాకుండా మళ్లీ మెషిన్‌లోకి వెళ్లిపోయి. మీ అకౌంట్‌లో డబ్బులు కట్‌ అయితే.. మీరు ఏటీఎం నుంచి ట్రాన్సాక్షన్ రిపిష్ట్‌ను తీసుకోండి. ఒక వేళ మీ దగ్గర రిపిప్ట్‌ లేకపోయినా, మీకు వచ్చిన SMS లేదా బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌ను ఉపయోగించి బ్యాంక్‌లో ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు తర్వాత 24 గంటల్లోపు డబ్బు తిరిగి ఇవ్వకపోతే, మీరు వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయండి. ఫిర్యాదుకు అవసరమైన వివరాలు ➡️మీ డబ్బు ఏ ATMలో ఇరుక్కుపోయిందో దాని లోకేషన్ ➡️మీరు డబ్బు విత్‌డ్రా చేసిన తేదీ, సమయం మీరు ATM నుంచి తీసుకున్న ట్రాన్సాక్షన్ రిసిప్ట్, లేదా SMS వివరాలు ఫిర్యాదు ఎలా చేయాలి? ➡️మీరు ATM వద్ద ఏదైనా ఎర్రర్ సందేశాన్ని చూసినట్లయితే, దానిని ఫోటో తీయండి. దాన్ని మీరు ఫిర్యాదు చేసే ఫామ్‌తో జోడించండి. మీరు కస్టమర్ కేర్ ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే మీరు మీపంలోని బ్యాంకు శాఖలో లిఖితపూర్వక ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. అలా కాకుండా మీరు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవొచ్చు.

రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలు ప్రారంభం

 ఉరవకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సెంట్రల్ హైస్కూల్ క్రీడా ప్రాంగణమునందు రాష్ట్రస్థాయి 28వ సబ్ జూనియర్ సెపక్తక్రా క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి అధ్యక్షత వహించారు జిల్లా క్రీడా శాఖ అధికారి అయినటువంటి మంజుల గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డైట్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ఎంఈఓ ఈశ్వరప్ప జిల్లా సంఘం సప్తగిరి మల్లి ప్రెసిడెంట్ షాహిన్గారు,ఎస్ కె ఆర్ క్లబ్ కార్యదర్శి రవీంద్ర గారు లైన్స్ క్లబ్ లక్ష్మీనారాయణ నాగేశ్వరావు గణేష్ అనంతపురం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు నాగరాజు , సత్య సాయి జిల్లా స్కూల్ గేమ్స్ మాజీ కార్యదర్శి డి మొరార్జీ యాదవ్ క్రీడాకారులు నిర్వహించినటువంటి మార్చి ఫాస్ట్ గౌరవ వందనాన్ని స్వీకరించారు తర్వాత క్రీడాజ్యోతిని వెలిగించారు ఈ టోర్నమెంట్ నందు 17 జిల్లాలకు చెందినటువంటి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి బాల బాలికలకు వసిటి ఏర్పాట్లను ఆర్డిటి చేసినది అని నిర్వాహకులు తెలిపారు ఈ టోర్నమెంట్ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు మారుతి ప్రసాద్ పుల్లా రాఘవ...

సాంఘిక దురాచారాలపై వేమన పదునైన సాహిత్యం

ఉప్పు కర్పూరంబు నొక్క పోలికనుండు  చూడచూడ రుచుల జాడ వేరయా  పురుషులందు పుణ్యపురుషులు వేరయా  విశ్వదాభిరామ వినురవేమ  కుక్క గోవు కాదు  కుందేలు పులి కాదు  దోమ గజము కాదు  దొడ్డదైనా లోబీ దాత గాడు  విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరిగినేని  ఇనుమారు ముమ్మారు కాచి  యతక నేర్చు గమ్మరీడు   మరి అంత నేర్చునా  విశ్వదాభిరామ వినురవేమ నాటి సాంఘిక దురాచారాలపై కత్తిగట్టి తన కవిత్వంతో సమాజంలో నవయుగ చైతన్యం తెచ్చిన ప్రజా కవి యోగివేమన. తెలుగు సాహిత్యపు వెలుగు రేఖ. సమాజంలోని మంచి చెడుల్ని జీవిత సత్యాలను తెలియజేసినమహాయోగి.మట్టిలో పుట్టిమహోన్నత శిఖరాలను అందుకున్న మానవతామూర్తి.మనుషుల మధ్య తిరుగుతూనే మానవ జీవిత సత్యాలను నిత్యాన్వేషణతో దర్శించి విమర్శించిన వివేకి వేమన. తన పద్యాలను ఆటవెలది చందస్సులో అలవోకగా లోకానికి అందించారు. మాలవాని నేల నిందిక నేల మొదటి కావాలని నాటి కులతత్వంపై ఈటెల్లాంటి పదాలను వేమన రాశారు.  వేమన పుట్టుపూర్వోత్తరాలు చరిత్రకారుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. కొందరు సర్కారీ ప్రాంతం వాడని మరికొందరు రాయలసీమ వాసి అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నార...

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ఏపీలో.. జొన్నగిరి గోల్డ్ మైన్ త్వరలో ఉత్పత్తి ప్రారంభం

దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని.. ఏపీలో త్వరలో ఉత్పత్తి ప్రారంభం జొన్నగిరి బంగారు గని ప్రత్యేకతలు భారత్‌లో బంగారం పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గని ప్రారంభం కానుంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (DGML) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా త్వరలోనే బంగారం ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు సంస్థ ప్రకటించింది. మొదటి దశలో ఏటా సుమారు 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నారు. రానున్న 2–3 ఏళ్లలో ఈ ఉత్పత్తిని 1 టన్ను వరకూ పెంచే లక్ష్యంతో సంస్థ ముందుకు వెళ్తోంది. జొన్నగిరి బంగారు గని ప్రత్యేకతలు స్థానం: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిదిరాయి గ్రామాలు నిర్వహణ: డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ & జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ తొలి దశ ఉత్పత్తి: ఏటా 750 కిలోలు రాబోయే లక్ష్యం: 1,000 కిలోలు (1 టన్ను) వరకు పెంపు భారత్‌లో బంగారం పరిస్థితి ప్రస్తుతం భారత్‌లో దేశీయ బంగారు ఉత్పత్తి కేవలం 1.5 టన్నులు మాత్రమే. అయితే, ఏటా సుమారు 1,000 టన్నుల బంగారాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. చమురు తర్వాత బంగారం...