Skip to main content

Posts

Showing posts from November 22, 2025

ఉరవకొండ లో వైభవంగా శ్రీ దుర్గాభవాని ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలు

  - 24, 25 తేదీలలో విశేష పూజలు, చండీ హోమం - మంగళవారం మధ్యాహ్నం అన్నసంతర్పణ, సాయంత్రం గ్రామోత్సవం - భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపు ఉరవకొండ, నవంబర్ 23 (న్యూస్): ఉరవకొండ పట్టణంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో వెలసిన శ్రీ చక్ర సహిత శ్రీశ్రీశ్రీ దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో అష్టమ (8వ) వార్షికోత్సవాలు మరియు చండీ హోమ మహోత్సవాలు సోమ, మంగళవారాల్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ మరియు భవాని భక్త మండలి సభ్యులు వివరాలను వెల్లడించారు. కార్యక్రమ వివరాలు:  * సోమవారం (24-11-2025): సాయంత్రం 5:00 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహారాధన, కలశస్థాపనతో పాటు గణపతి, నవగ్రహ, రుద్ర మరియు లలితా హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. రాత్రి 8:30 గంటలకు అల్పాహార విందు ఉంటుంది.  * మంగళవారం (25-11-2025): తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్వమే అమ్మవారికి సుప్రభాత సేవ, విశేష ద్రవ్యాలతో మరియు ఫల పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 9:00 గంటలకు అమ్మవారికి విశేష అలంకారంతో పాటు 'శ్రీ మహా చండీయాగం' (చండీ హోమం), పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. అన్నదానం మరియు గ్రామోత్సవం: ...

మానవ సేవే మాధవ సేవ'.. సత్యసాయి బాట అనుసరణీయం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 ' పుట్టపర్తిలో వైభవంగా సత్యసాయి శత జయంతి వేడుకలు హాజరైన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు పుట్టపర్తి/అనంతపురం: శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'సత్యసాయి మహాసమాధి'ని దర్శించుకున్న రాష్ట్రపతి, సీఎం.. బాబాకు ఘన నివాళులు అర్పించారు. లోక కల్యాణమే బాబా లక్ష్యం: రాష్ట్రపతి సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ, సత్యసాయి బాబా బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. "మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన మహానుభావుల్లో బాబా అగ్రగణ్యులు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ వంటి మార్గాల ద్వారా ఆయన లోక కల్యాణానికి కృషి చేశారు. 1969 నుంచే మహిళా సంక్షేమానికి బాబా ప్రాధాన్యతనిచ్చారు. ప్రస్తుతం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో చేస్తున్న కృషి, జాతి నిర్మాణంలో వారి పాత్ర అభినందనీయం," అని రాష్ట్రపతి కొనియాడారు. ఈ సందర్భంగా 'సత్యసాయి ట్రైబల్...

బొమ్మనహల్ లో విషాదం: మాజీ ఎంపీ వాహనం ఢీకొని 9 గొర్రెలు మృతి, 15 గొర్రెలకు తీవ్ర గాయాలు

బొమ్మనహల్: మండల పరిధిలోని నేమకల్లు గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారీగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల మందపైకి వాహనం దూసుకెళ్లడంతో 9 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే: ప్రమాదం జరిగిన తీరు: నేమకల్లు గ్రామ శివారులో గొర్రెల కాపరి గోవిందప్ప తన జీవాలను మేపుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అకస్మాత్తుగా వచ్చిన ఓ వాహనం అదుపుతప్పి గొర్రెల మందను ఢీకొట్టింది. కాపరి ఆవేదన: కళ్ల ముందే తాను బిడ్డల్లా సాకుతున్న జీవాలు ప్రాణాలు కోల్పోవడంతో గొర్రెల కాపరిగోవిందప్ప కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ప్రమాదం వల్ల తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పరామర్శ: ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు మరియు గ్రామ పెద్దలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడిగోవిందప్ప కి న్యాయం జరిగేలా చూస్తామని, ప్రభుత్వ పరంగా తగిన సాయం అందేలా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్త...

29 పార్కులకు కబ్జా నుంచి విముక్తి

శ్రీధర్‌రెడ్డిని చాలాకాలం గుర్తుంచుకొంటారు నెల్లూరు:నగరమనే కాంక్రీట్‌ అరణ్యానికి ఊపిరితిత్తులు పార్కులే. అగ్గిపెట్టెల వంటి అపార్టుమెంట్లలో నివసించడం తప్పనిసరి అయిన రోజులలో, కాసింత గాలి పీల్చుకొనే వసతి, నాలుగడుగులు నడిచే వనరు పార్కులు మాత్రమే. అందువల్లే ఇళ్లకు లేఅవుట్‌ చేసిన ప్రతి చోటా 10 శాతం భూమి పార్కు కోసం వదలి పెట్టాలని నియమం. కానీ అదే జరగడం లేదు. ప్లాట్లు అమ్మే వరకు ఖాళీ స్థలం వుంటుంది; ఆ వెంటనే అది కూడా ప్లాట్లుగా మారిపోతుంది. గత ఇరవై ఏళ్లలో నెల్లూరు నగరంలో వేసిన రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్లు కనీసం రెండు మూడు వందలుంటాయి. అంటే నగరంలో అన్ని పార్కులు కూడా వుండాలి. కానీ అక్కడొకటి, ఇక్కడొకటి తప్ప, వాటి ఆచూకే లేదు. కారణం - కబ్జా. కొన్ని ప్లాట్లు అమ్మిన వారే స్వంతం చేసుకొంటే, మరికొన్ని స్థానికంగా భుజబలం వున్న వారు కైవసం చేసుకొన్నారు. ఈ దుర్మార్గక్రమానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టడానికి రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చిత్తశుద్ధితో కూడా ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలో దాదాపు 29 పార్కులు గుర్తించి, కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించి, చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు...

ఆపరేషన్ కగర్' పేరిట బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలి

అనంతపురంలో వామపక్షాల ఆగ్రహం అనంతపురం: మావోయిస్టుల ఏరివేత పేరుతో ప్రభుత్వాలు సాగిస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలో వామపక్ష పార్టీలు కదంతొక్కాయి. ఈరోజు సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ మరియు ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలు చేబూనిన కార్యకర్తలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన ప్రసంగం - జిల్లా కార్యదర్శి వేమన: ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి వేమన గారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:    ఆపరేషన్ కగర్ ( Operation Kagar) పై వ్యతిరేకత: కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ కగర్' పేరుతో ఆదివాసీ ప్రాంతాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. మావోయిస్టుల ఏరివేత సాకుతో అమాయక ఆదివాసీలను, పౌర హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.   బూటకపు ఎన్‌కౌంటర్లు: చట్టబద్ధమైన పాలనలో ఎన్‌కౌంటర్లకు తావులేదని, కానీ పోలీసులు పట్టుకున్న వారిని కూడా ఎన్‌కౌంటర్ల పేరుతో కాల్చి చంపడం హేయమైన చర్య అన...

దర్తి ఆబా జన జాగృతి గ్రామీణ ఉత్కర్ష అభియాన్ పనులను త్వరలో పరిశీలిస్తా

  కేంద్ర ప్రభుత్వం గిరిజన గ్రామాల సంక్షేమం అభివృద్ధి కి ధర్తీ ఆభా జన జాగృతి గ్రామీణ ఉత్కర్ష అభియాన్ ద్వారా వేలకోట్లు మంజూరు చేశారని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా లో త్వరలో పర్యటించి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాట్రోత్ హుస్సేన్ నాయక్ తెలియజేసినట్లు బంజారా గిరిజన సమైక్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్ కె మహేష్ నాయక్ తెలిపారు శనివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి నట్లు తెలిపారు  ఈ సందర్భంగా ఆయన స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లా లో నీ గిరిజన గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు ముఖ్యంగా దర్తి అబ జన జాగృతి ఉత్కర్ష అభియాన్ పనులను శాఖల వారీగా పరిశీలించడం జరుగుతుందని అలాగే గిరిజన గురుకులాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా స్వయానా పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలిపారు

ఏ ఐ యఫ్రా డీ య స్ రాష్ట్ర ప్రథమ మహాసభ జయప్రదం చేయండి

  జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందు సిద్దు ఏ ఐ ఢీ యఫ్రా  యస్ష్ట్ర vv ప్రథమ మహాసభలు డిసెంబర్ 5,6 తేదీల్లో జరిగే అసెంబ్లీ టైగర్ ఓంకార్ నగర్- కర్నూల్ జరిగే కరుపత్రాలను ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విడుదల చేయడం జరిగింది*   వారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం మూడోసారి వచ్చిన ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం 2020 తీసుకు వచ్చింది. ఇది రాష్ట్రాల ఫెడరల్ హక్కులను కాలరాస్తుందని, రిజర్వేషన్లకు పాతర వేస్తుందని అనేక మంది విద్యావేత్తలు, మేధావులు, చెపుతున్న వారి మాట వినడం లేదు. దీని ద్వారా అశాస్త్రీయమైన పాఠ్యాంశాలను, ఇతిహాసాలను విద్యార్థుల మెదళ్ల లోకి ఎక్కించబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను సంక్షోభం లోకి నెట్టాడం, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. రాష్ట్రంలో 472 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉంటే 210 కాలేజీలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేరు. 26 జిల్లాలకు ఒక్క చోట కూడా రెగ్యులర్ డి. వి.ఇ.ఓ.లు లేరు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13 మంది రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్లు (ఆర్.ఐ.ఓ)లు ఉండాల్సిన చోట ఒక్క రెగ్యులర్ అధికారి కూడా లేరు. ...

త్వరలో స్థానిక ఎన్నికలు

  175 నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు సేకరించిన ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లు చేస్తోంది.  SEC, 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను తీసుకొని, వాటి నుంచి మున్సిపల్, పంచాయతీల వారీగా జాబితాలు సిద్ధం చేస్తోంది. ఇందుకోసం మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చారు.  ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయగానే ఎనగ్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది.