Skip to main content

Posts

Showing posts from September 24, 2025

సౌభాగ్య లక్ష్మీ గాఅవతరించిన ఉద్భవ లక్ష్మీ

   నేడు ధన లక్ష్మీగాఅమ్మోరు అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, గురు వారం ఉద్భవ లక్ష్మీ అమ్మవారు 4వ రోజు గురు వారం సౌభాగ్య లక్ష్మీ గా భక్తుల నీరాజనాలు అందుకొన్నారు.  ఉదయం దేవస్థానం లో అమ్మ వారికి సుప్రభాత, మేలుకొలుపు సేవలో భక్తులు తరించారు.అమ్మ వారికి కుంకుమ అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అమ్మ వారిని పట్టు వస్రాల తో విశేష పుష్పాలంకరణ చేశారు.  ఉద్భవ లక్ష్మీ, ధాన్య లక్ష్మిఅవతారం లోభక్తల, పూజలు, సేవలతో తరించారు. ఈ కార్యక్రమంలో ద్వారక నాథ ఆచార్యులు, మయూరం బాలాజీ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు  నేడు ధన లక్ష్మీగా ఉద్భవలక్ష్మీ అమ్మవారు. సెప్టెంబర్ 25,తేదీ గురు వారం: సౌభాగ్య లక్ష్మిరూపం లో భక్తులకు దర్శన మిస్తారని ఈఓ తిరుమల రెడ్డి తెలిపారు.

మాజీ ఉప సర్పంచు జిలకర మోహన్ అనారోగ్యం తో మృతి

 ఉరవకొండ గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ జిలకర మోహన్ అనారోగ్యంతో బాధ పడుతూ అనంతపురం లోని ఓ ప్రయివేటు హాస్పిటల్ నందు రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. ఆయన స్వగ్రామం కసాపురం లో రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఎలాంటి అరమరికలు సేవలు అందించిన ఆయన మృతి పట్ల ఉరవకొండ వార్డు సభ్యులు నిరంజన్ గౌడ్, సోమా శేఖర్, లెనిన్ సీనియర్ రిపోర్టర్ మాలపాటి శ్రీనివాసులు, ఫోటో స్థాట్ వెంకటేష్ ఒక సంయుక్త ప్రకటన లో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారు కోరారు.

కర్నూలులో హైకోర్టు సాధనకై 4వ రోజుకు చేరిన న్యాయవాదుల నిరసన

  కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. 1937 నాటి శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18వ తేదీ నుంచి వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ బాగ్ ఒప్పందం - న్యాయవాదుల ప్రధాన డిమాండ్ న్యాయవాదులు హైకోర్టు బెంచ్ కాకుండా ప్రధాన హైకోర్టు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం 1937 నవంబర్ 16న కుదిరిన శ్రీ బాగ్ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిని అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ హామీలు - నెరవేరని వాగ్దానాలు న్యాయవాదుల ఆందోళన ప్రధానంగా రాజకీయ నాయకుల గత హామీల చుట్టూ తిరుగుతోంది.  * 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు: రాయలసీమలోని కర్నూలులో ఆంధ్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.  * 2019లో ...

కమ్యూనిస్టుల నిరాడంబర జీవితం: కేరళ మంత్రి ప్రసాద్

  విజయవాడ: కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పి. ప్రసాద్ సీపీఐ (CPI) జాతీయ మహాసభలకు ఒక సాధారణ కార్యకర్తలా హాజరయ్యారు. ఒక సాధారణ జీవితం, నిరాడంబరత, ఆర్భాటాలు లేని జీవనం కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పార్టీ మహాసభలకు వచ్చిన ఆయన, ఒక సాధారణ కార్యకర్తలాగా నిరాడంబరంగా వ్యవహరించారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలే తమను నిరాడంబరంగా జీవించేలా ప్రోత్సహిస్తాయని, ప్రజాసేవపై దృష్టి పెట్టేలా చేస్తాయని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు పదవిలో ఉన్నా, లేకపోయినా తమ ఆదర్శాలకు కట్టుబడి ఉంటారని ఆయన పేర్కొన్నారు.

నరసాపురంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన

  పెరుపాలెం (నరసాపురం): రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం మండలంలో పర్యటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న పెరుపాలెం గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేశవ్ గ్రామంలోని శ్రీ శివాలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పెరుపాలెం చేరుకున్న మంత్రికి కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో స్థానిక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఎస్సీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన కార్మిక పరిషత్ ప్రతినిధులు

  విజయవాడ: కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.ఎస్. రావు, శేషగిరి రావు బుధవారం విజయవాడలో ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్మిక పరిషత్ ఈడీ ఆంజనేయులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సమస్యలు, వాటి పరిష్కారంపై వారు చైర్మన్‌తో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో వివిధ కార్మిక వర్గాల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.

న్యాయవాదుల దీక్షలకు ప్రజా సంఘాల మద్దతు

  కర్నూలు: న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఆసిఫ్, టి.వెంకటేష్, రాము ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి, డేవిడ్, పీవోపీ నాయకుడు శ్రీనివాస రావు న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తామంతా న్యాయవాదులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు .

కూడేరు మండల విద్యాశాఖ అధికారులు అదృశ్యం -ఏ ఐ యఫ్ డీ యస్ విద్యార్థి సంఘం

  మండల విద్యాశాఖ అధికారులు తమకు తామే దసరా సెలవులు ప్రకటించుకున్న వైనం అనంతపురం నగరానికి అనుకుని ఉన్న కూడేరు మండలంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో మండల విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలం. తమకు తామే సెలవు ప్రకటించుకుని విధులకు డుమ్మా కొట్టిన వైనం. రెండు నెలల క్రితం సమాచార హక్కు చట్టం కింద సమాచారం కావాలని దరఖాస్తు చేసుకున్న ఇప్పటివరకు స్పందించని వైనం. విషయం కనుక్కోవడానికి వెళ్తే అయ్యవారు గదికి తాళాలు. సిబ్బందిని అడిగితే దసరా సెలవులు ఉన్నాయి కదా సెలవులు అయ్యాక మరోసారి రండి అంటూ విద్యార్థి సంఘం నేతకు సమాచారం ఇచ్చారు. అంటే దాదాపు రెండు మూడు రోజుల నుంచి విధులకు డుమ్మా కొడుతున్నారని స్థానికుల సమాచారం. వీరిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకునేనా...? లేక వ్యవహరిస్తారా..? ప్రజల పన్నుల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా పక్కదారి పట్టిన విద్యాశాఖ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎఫ్డిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్..చేశారు 

వై సీ పీ పాలన లో 15,500 సచివాలయాలు నిర్మాణం

  రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో 15,500 సచివాలయాలు నిర్మించి, సుమారు 1.5 లక్షల సచివాలయ ఉద్యోగులను నియమించిందని వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు వై. రాజశేఖర రెడ్డి అన్నారు. ఈ సచివాలయాల ద్వారా దాదాపు రూ. 4 లక్షల కోట్లను అర్హులైన లబ్ధిదారులకు అవినీతి లేకుండా అందించారని ఆయన తెలిపారు. పి. ఎర్రగుడి సచివాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కష్టకాలం ఉన్నప్పటికీ ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో సచివాలయాలను నిర్మించిందని, ప్రపంచంలో మరెక్కడా ఇంత తక్కువ సమయంలో ఇంతటి అభివృద్ధి జరగలేదని అన్నారు. సచివాలయ వ్యవస్థ ప్రత్యేకతలు:   లక్ష్యం: ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, గ్రామ స్థాయిలో అందించడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం.  నిర్మాణం: ప్రతి గ్రామం మరియు వార్డులో ఒక సచివాలయం ఏర్పాటు చేయబడింది.  సిబ్బంది: ప్రతి సచివాలయంలో రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం వంటి వివిధ శాఖలకు చెందిన 10 నుంచి 12 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.  సేవలు: సచివాలయాల ద్వార...

పెన్నహోబిలం సేవకుడుగా ఉంటా, పాలకుడిని కాను: రేగటి నాగరాజు

ఉరవకొండ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధికారి, సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలను రాయంపల్లికి చెందిన రేగటి నాగరాజు తీవ్రంగా ఖండించారు. తాను ఎప్పటికీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవకుడిని మాత్రమేనని, పాలకుడిని కానని ఆయన స్పష్టం చేశారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవకు భగవంతుడు తనకు అవకాశం ప్రసాదిస్తే, భక్తులు, అధికారులు, సిబ్బంది మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తానని నాగరాజు చెప్పారు. తమ కుటుంబం పయ్యావుల సోదరులకు అండగా ఉంటుందని, అవసరమైతే వారి కోసం ప్రాణాలైనా ఇస్తామని తెలిపారు. తన సోదరులు లక్ష్మన్న, భీమన్నలతో కలిసి తాను ఎల్లప్పుడూ వారి పక్షానే ఉంటామని పేర్కొన్నారు. పాలకమండలి చైర్మన్‌గా అవకాశం లభిస్తే, దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని నాగరాజు తెలిపారు. తాము ఎప్పటికీ స్వామివారికి, భక్తులకు, ప్రజలకు సేవకుడిగానే ఉంటామని పునరుద్ఘాటించారు. సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నామని, తమ చివరి రక్తపు బొట్టు వరకు సీఎం చంద్రబాబు నాయుడు, పయ్యావుల సోదరుల నాయకత్వాన్ని సమర్థిస్తామని రేగటి నాగరాజు వివరించారు.

నిమ్మల రామానాయుడు కుమార్తె పెళ్లి వేడుకలో సీఎం చంద్రబాబు

వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి, రాష్ట్ర నాయకులు పాలకొల్లు:రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుక ఈరోజు పాలకొల్లు పట్టణంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్యాహ్నం 1.30 గంటలకు పాలకొల్లు చేరుకున్నారు. వివాహ వేడుక ప్రాంగణానికి విచ్చేసిన ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు ఆహ్వానించి, ఆశీర్వదించిన కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి భవిష్యత్తు సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకున్నారు. ఈ వేడుకలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, ఎర్రగొం...

ఓటుకు నోటు కేసులో ఎపి సీఎం చంద్రబాబు కు భారీ షాక్

ఓటుకు నోటు కేసులో మాజీ సీఎం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు పరిధిలో మరోసారి చిక్కులు పెరిగేలా మారింది. ఈ కేసు కీలక వ్యక్తి మత్తయ్య తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆ లేఖలో తాను ఓటుకు నోటు ఘటనలో తప్పు చేసినట్టు అంగీకరించిన మత్తయ్య, ఆ చర్య వెనుక చంద్రబాబు ప్రోత్సాహమే ప్రధాన కారణమని స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ అంశం వెలుగులోకి రావడంతో కేసు దర్యాప్తు దిశ మారే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో, మత్తయ్య పాత్రపై దర్యాప్తు జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ పూర్తిచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ముందు మత్తయ్య లేఖ బయటకు రావడంతో కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మత్తయ్య లేఖలో పేర్కొన్న అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకునేలా పిటిషన్ రూపంలో దాఖలు చేయనున్నట్లు ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో ఇప్పటికే సంవత్సరాలుగా కొనసాగుతున్న ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ...

డ్రాగన్‌ ఫ్రూట్ వైపు రైతుల దృష్టి

సంప్రదాయ పంటలతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు కొత్త మార్గాల కోసం వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ అధికారులు రైతులకు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే ఈ పంటతో రైతులు స్థిరమైన ఆదాయం పొందగలరని చెబుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, డ్రాగన్‌ ఫ్రూట్ సాగుతో ఎకరానికి ఏటా రూ.3 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దేశీయంగానే కాకుండా ఎగుమతుల మార్కెట్లో కూడా ఈ పంటకు మంచి డిమాండ్ ఉందని వారు వివరించారు. అంతేకాకుండా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ఆధారంగా పరికరాలు, సాంకేతిక సహాయం అందిస్తోంది. ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు కలిగించే ఔషధ గుణాలు డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండటంతో మార్కెట్లో దీని విలువ రోజురోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మధుమేహం, హృద్రోగ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రైతులు సాంప్రదాయ పంటల కంటే డ్రాగన్‌ ఫ్రూట్ సాగుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తే, తక్కువ కాలంలోనే అధిక లాభాలు సాధించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ పంట భవిష్యత్తు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుందని అంచన...