Skip to main content

Posts

Showing posts from November 7, 2025

కళ్యాణదుర్గంలో 9 అడుగుల కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్

  కళ్యాణదుర్గం నవంబర్ 8: గొప్ప సాధువు, సామాజిక సంస్కర్త, వాగ్గేయకారుడు అయిన భక్త కనకదాస గారి 538వ జయంతి ఉత్సవాలను అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో రాష్ట్ర పండుగగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై, శ్రీ కనకదాస గారి 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. ఈ ఉత్సవానికి వేలాది మంది ప్రజలు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు.     విగ్రహావిష్కరణ: మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ టీడీపీ నాయకులతో కలిసి, పూలమాలతో అలంకరించబడిన కాంస్య విగ్రహాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆవిష్కరించారు.   భారీ జనసందోహం: ఈ కార్యక్రమానికి పదివేల మందికి పైగా ప్రజలు హాజరై, సాధువుకు నివాళులు అర్పించడానికి మరియు రాష్ట్ర స్థాయి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చారు. పార్టీ జెండాలు, పసుపు టోపీలు ధరించిన జనసమూహం నాయకుల ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు.   సామాజిక సంస్కర్తకు నివాళి: ఈ సందర్భంగా నాయకులు మాట్లాడ...

నారా లోకేష్ కు సిపిఐ బహిరంగ విన్నపం: భూమిని నమ్ముకున్న రైతులను కాపాడండి.

సిపిఐ రాష్ట్ర నాయకుడు జగదీష్  నారా లోకేష్ ని కోరారు — 💧 “హద్రినీవా నీటిని మళ్లించండి... రైతుల జీవితాలు మార్చండి! ” రాయలసీమ రైతుల కేక వినిపిస్తుందా? రాయదుర్గం : రాయలసీమ ప్రాంతంలో బీడు భూములను సాగు భూములుగా మార్చాలని, భూమిని నమ్ముకున్న రైతులను కాపాడాలని సిపిఐ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ నారా లోకేష్ కి బహిరంగ విన్నపం చేశారు. రాయదుర్గం పట్టణంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, గత 15 సంవత్సరాలుగా హద్రినీవా ప్రాజెక్టు ద్వారా వస్తున్న నీటిని సక్రమంగా వినియోగించుకునే స్థితి రాలేదని తెలిపారు. కాలువలను వెడల్పు చేసినందున ఇప్పుడు నీటి సామర్థ్యం పెరిగిందని, ఈ నీటిని బీడు భూములకు మళ్లించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 లక్షల 50 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందిస్తే ఈ ప్రాంత ప్రజల జీవన విధానం మారిపోతుంది,” అని జగదీష్  పేర్కొన్నారు. వర్షాభావం, కరువు తీవ్రంగా ప్రభావితమైన రాయలసీమ జిల్లాలకు హద్రినీవా నీటిని మళ్లించే దిశగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతుల పంట ఉత్పత్తులను ఎగుమ...

ఆమిద్యాలలో ఘనంగా కడ్లే గౌరమ్మ వేడుకలు.

ఉరవకొండ మండల ఆమిద్యాల గ్రామంలో శుక్రవారం విద్యుత్ కాంతుల వెలుగులో కడ్లే గౌరమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు వీధుల నుంచి మేళ తాళాలతో కడ్లే గౌరమ్మకు హారతులు ఇచ్చి మొక్కబడును తీర్చుకున్నారు. సాయంత్రం పలు వీధుల్లో మహిళలు హారతులతో గ్రామం కిటకిటలాడింది. ఈ సందర్భంగా కడ్లే గౌరమ్మ విగ్రహానికి వివిధ పుష్పాలతో, వివిధ చీరలతో ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు తరలివచ్చి పూజల అభిషేకాలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు.

చిత్తూరు జిల్లా కలెక్టర్ పై క్రమ శిక్షణా చర్యలకు డిమాండ్

చిత్తూరు కలెక్టర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ ఫిర్యాదు: మీడియా పట్ల దురుసు ప్రవర్తనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మొర అమరావతి/చిత్తూరు, : చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (విశాలాంధ్ర విలేకరుల పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ, సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు కే రామకృష్ణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. విజయానంద్ గారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ప్రధానాంశాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ విశాలాంధ్ర విలేకరులతో మాట్లాడే సమయంలో వారి పట్ల అసభ్యకరంగా, దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో కలెక్టర్ వంటి ఉన్నత స్థానంలో ఉన్న అధికారి మీడియా ప్రతినిధులతో బాధ్యతారాహిత్యంగా, అధికార దర్పంతో మాట్లాడటం తగదని కే రామకృష్ణ పేర్కొన్నారు.   మీడియా స్వేచ్ఛకు భంగం: కలెక్టర్ తీరు పత్రికా స్వేచ్ఛను అణచివేసే విధంగా ఉందని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కలెక్టర్ అగౌరవపరచారని ఫిర్యాదులో తెలిపారు.   క్రమశిక్షణా చర్యలు డిమా...

ఘనంగా గజ గౌరీ అమ్మవారి నిమజ్జనం

  బొమ్మనహల్ మండలం, : బొమ్మనహల్ మండలంలోని ఉద్దేహాల్, ఉంతకల్లు, శ్రీధరఘట్టతో పాటు పలు గ్రామాలలో శుక్రవారం శ్రీ గజ గౌరీ అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఊరేగింపులో ఉత్సాహం:  అమ్మవారి నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై, జాజిపూలు, కొబ్బరికాయలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. డప్పుల మోగింపు, సాంస్కృతిక వాతావరణంతో గ్రామాలు జాతరను తలపించాయి, సందడిగా మారాయి. పురుషులు, యువతులు, బాలబాలికలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ వీధుల గుండా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్లి, అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు. శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థన: గజ గౌరీ అమ్మవారి పూజలతో గ్రామంలో శాంతి, సౌభాగ్యం కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. పూజల అనంతరం మహిళలు పరస్పరం తాంబూలాలు పంచుకున్నారు. ఈ వేడుకతో గ్రామమంతా పండుగ శోభతో కళకళలాడింది.

రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మాణం.

ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన ఆన్ లైన్ లో అంగప్రదక్షిణం టోకెన్లు కేటాయింపు. శ్రీవారి దర్శనానికి దళారులను నమ్మి మోసపోవద్దు  ఈ నెల 27వ తేదీన అమరావతిలోని ఎస్వీ ఆలయం విస్తరణ పనులు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు*  డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్యక్రమంలో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్* తిరుమల, 2025 నవంబరు 07: శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీ కొరకు గతంలో ఉన్న డిప్‌ విధానం కాకుండా ఆన్‌లైన్‌ లో ముందు వచ్చిన వారికి ముందు అను పద్ధతిలో వచ్చే ఫిబ్రవరి నుండి ఆన్‌లైన్‌ కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి….  తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం.  భక్తుల సౌకర్యార్థం దాదాపు రూ.25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్‌ ట్యాంక్‌ గెస్ట్‌ హ...

రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్‌ల భేటీ: కళ్యాణదుర్గం పర్యటన

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కళ్యాణదుర్గం పట్టణంలో జరగనున్న భక్త కనకదాసు జయంతి మహోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేయగా, ఉరవకొండ ఎమ్మెల్యే, ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుట్టపర్తి ఎయిర్‌పోర్టులో స్వాగతం నారా లోకేష్ రాక సందర్భంగా పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మంత్రి పయ్యావుల కేశవ్, ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. మంత్రి నారా లోకేష్ ఈ నెల 8వ తేదీ సోమవారం నాడు కళ్యాణదుర్గంలో జరిగే భక్త కనకదాసు జయంతోత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల మంత్రులు కొద్దిసేపు చర్చించుకున్నట్లు సమాచారం.

క్యాన్సర్ పై విజయం - స్క్రీనింగ్ తో సాధ్యం :

   ఉరవకొండ :  వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శుక్రవారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం మండల వైద్యాధికారి డాక్టర్ తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్య అధికారులు మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరునికి ఉచితంగా నోటి, రొమ్ము మరియు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పిస్తుంది ఈ పరీక్షలు చేయించుకోవడానికి మీ ఇంటి వద్దకు వచ్చే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి ప్రజలు సహకరించాలన్నారు. మీ సమీపంలోని ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఈ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయబడతాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసమే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ వ్యాధి అంటే భయపడాల్సిన అవసరం లేదు ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయగల వ్యాధి ఇది ఈ వ...

ఏపీలో కొత్త (ప్రతిపాదిత) జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు

  ఉరవకొండ నవంబర్ 7: 1. *పలాస:* ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం 2. *శ్రీకాకుళం:* శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం 3. *మన్యం పార్వతీపురం:* పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ 4. *విజయనగరం:* విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి 5. *విశాఖపట్నం:* భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి 6. *అల్లూరి సీతారామరాజు అరకు:* అరకు, పాడేరు, మాడుగుల 7. *అనకాపల్లి:* అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని 8. *కాకినాడ:* కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం 9. *తూర్పు గోదావరి రాజమహేంద్రవరం:* రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం 10. *బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అమలాపురం:* అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట 11. *పశ్చిమ గోదావరి నరసాపురం:* తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం 12. *ఏలూరు:* ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం 13. *కృష్ణా మ...

ఘనంగా 150వ వందేమాతరం వార్షికోత్సవ వేడుకలు

 ' ఉరవకొండ నవంబర్ 7:ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ లో 150వ వందేమాతరం వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం పంచాయతీ పాలక మండలి ఘనంగా జరుపుకొన్నారు.వేడుకల్లో భాగంగా సీనియర్ ,  ఎలక్ట్రీషియన్క్ ఉక్కీసుల గోపాల్ సభ్యులతో సామూహికంగా ఆలపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూనేటితో వందేమాతరం' గీతానికి 150 ఏళ్లునిండాయని తెలిపారు. గీత ప్రాముఖ్య తను వివరించారు. ఈ అమర గీతాన్ని బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ రచించారుని వార్డు సభ్యులు నిరంజన్ తెలిపారు.    ఈ గీతాన్ని నవంబర్ 7, 1875 న కూర్చారు. అందుకే, 2025 నవంబర్ 7 నాటికి ఈ గీతానికి సరిగ్గా 150 సంవత్సరాలు నిండాయని వేడుకలు జరుపుకోవడం సంతోషం అన్నారు..   లెనిన్ బాబు మాట్లాడు తూ  స్వాతంత్య్ర పోరాటంలో పాత్ర 'వందేమాతరం' గీతం స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మంది సమరయోధులకు మనోబలాన్ని, స్ఫూర్తిని ఇచ్చే  ఒక రణన్నినాదంగా మారిందని పేర్కొన్నారు.  వక్తలు గోపాల్, నిరంజన్ గౌడ్, లెనిన్ బాబు లు మాట్లాడు తూ ముఖ్యంగా 1905లో జరిగిన బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం (స్వదేశీ ఉద్యమం) సమయంలో, ఈ గీతం యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, దేశభక్తికి చిహ్నం...