Skip to main content

Posts

Showing posts from November 12, 2025

బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలికి అపూర్వ సన్మానం: తిరుపతిలో ఘనంగా అభినందన సభ:దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్:

   భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర మహిళా మోర్చా నూతన అధ్యక్షురాలిగా శ్రీమతి నిషిద రాజు నియమితులైన సందర్భంగా, ఆమెకు అభినందనలు తెలిపేందుకు తిరుపతిలోని శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో 12-11-2025 తేదీన ఆత్మీయ సభను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వేలాది మంది మహిళా కార్యకర్తలు ఈ సభకు భారీగా తరలివచ్చారు.  ముఖ్య అతిథులుగా రాష్ట్ర, కేంద్ర నాయకులు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు హాజరై శ్రీమతి నిషిద రాజు కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ , కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ భూపతి రాజా శ్రీనివాస వర్మ , శ్రీ సోమువీర్రాజు , శ్రీ పాకా సత్యనారాయణ పాల్గొన్నారు. మహిళా మోర్చా నాయకులలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి బొల్లిన నిర్మల , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి సాలగ్రామం లక్ష్మీ ప్రసన్న , శ్రీమతి ముళ్ళపూడి రేణుక శ్రీమతి గీత కూడా సభకు హాజరై నూతన అధ్యక్షురాలికి అభినందనలు తెలిపారు.  మహిళా రిజర్వేషన్లు, సంస్థాగత ఎన్నికలపై ప్రసంగం ఈ సందర్భంగా, మహిళా నాయకులు మాట్లాడుతూ... చట్టసభల్లో మహిళలకు 33% రి...

మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు – వెండి కూడా ఎగబాకింది.

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,100 పెరిగి రూ.1,17,150కు చేరింది. బంగారంతో పాటు వెండి ధరల్లో కూడా పెద్ద ఎత్తున పెరుగుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.9,000 పెరిగి రూ.1,82,000కు చేరింది. ఈ ధరల పెరుగుదలతో ఆభరణాల కొనుగోలు దారులు తాత్కాలికంగా వెనుకడుగు వేస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం బంగారంపై దృష్టి సారిస్తున్నారు.

ట్రంప్‌ సంతకంతో అమెరికాలో ముగిసిన చారిత్రాత్మక షట్‌డౌన్‌

అమెరికా చరిత్రలో అత్యంత కాలం కొనసాగిన ఆర్థిక షట్‌డౌన్‌కు చివరపడింది. ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం రాత్రి సంతకం చేయడంతో 43 రోజులుగా కొనసాగిన షట్‌డౌన్‌ అధికారికంగా ముగిసింది. ఈ బిల్లు అంతకుముందు ప్రతినిధుల సభలో 222-209 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఫలితంగా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. దీర్ఘకాలంగా జీతాలు నిలిచిపోయిన సర్కారీ ఉద్యోగులకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్‌ సంకేతంగా పేర్కొంటున్నారు. 

అనంతపురం రాంనగర్ హెచ్డీఎఫ్‌సీ బ్యాంకులో బంగారం మాయం కలకలం

  అనంతపురం రాంనగర్‌లోని హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున బంగారం మాయం ఘటన చోటు చేసుకుంది. మొత్తం 37 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు 2 కిలోల బంగారం అదృశ్యమైనట్లు సమాచారం. బ్యాంకులో పనిచేసే ఒక ఉద్యోగి ఈ బంగారాన్ని అక్రమంగా కాజేసి, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు బుధవారం బ్యాంకు ముందు ధర్నా చేపట్టారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రజల సొమ్మును రక్షించాల్సిన బ్యాంక్‌లోనే ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

లక్ష్యం మేరకే అనుకున్న టైంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం – రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు , మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి , గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుమల అశోక్ రెడ్డి , ఎర్రగొండపాలెం టిడిపి ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు కలిసి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. మంత్రివర్యులు దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ , జంట సొరంగాల డివాటరింగ్ పనులు , అలాగే ప్రాజెక్టు వద్ద జరుగుతున్న ఇతర నిర్మాణ కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులు , కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ – “వెలిగొండ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం. మార్కాపురం జిల్లాను త్వరిగా ప్రకటిస్తాం. మెడికల్ కాలేజీని కూడా పీపీపీ మోడ్‌లో పూర్తి చేస్తాం. కానీ వైసీపీ నాయకులకు పనీపాట లేక రోడ్లపై కోటి సంతకాల సేకరణ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు,” అని అన్నారు. జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు – ముఖ్యాంశాలు: వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. మొంథా తుఫాన్ కారణంగా ...

ఈ నెల సదరం ధ్రువీకరణ పత్రాలకు స్లాట్ బుకింగ్ ప్రారంభం

రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతుల కోసం వైకల్య నిర్ధారణ (సదరం) ధ్రువీకరణ పత్రాల స్లాట్ బుకింగ్ ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమవుతుందని సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రదర్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్, డిసెంబర్ 2025 నెలల కోసం సదరం ధ్రువీకరణ పత్రాల స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి ప్రజలు తమ సమీపంలోని గ్రామ లేదా వార్డ్ సచివాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో శారీరక, మానసిక, బధిరులు, దృష్టి వైకల్యం ఉన్నవారికి, ఎరియా ఆసుపత్రుల్లో శారీరక మరియు దృష్టి వైకల్యం ఉన్నవారికి, మరియు సి.హెచ్.సి. (CHC) లలో శారీరక వైకల్యం ఉన్నవారికి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేయబడతాయని ఆయన వివరించారు. వైకల్య ధ్రువీకరణ కోసం తగిన పత్రాలతో సదరం స్లాట్ బుక్ చేసుకోవాలని, తద్వారా సులభంగా ధ్రువీకరణ పొందవచ్చని చక్రదర్ ఐఏఎస్ సూచించారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ

రాయదుర్గం:  ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గ సమన్వయకర్త గౌ. శ్రీ మెట్టు గోవిందరెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ & యువ నాయకుడు శ్రీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారు తహసీల్దార్‌ (MRO) గారికి వినతిపత్రం సమర్పించారు. యువ నాయకుడు వ్యాఖ్యలు: “ రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచే బదులు, PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా ఖండనీయమైనది. దేశంలో ఎక్కడా ఇలాంటి పద్ధతి అమలు చేయబడడం లేదు. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రజా వ్యతిరేకతతో ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నాయి,” అన్నారు. “ఒక ప్రాంతంలో మెడికల్ కాలేజీ స్థాపన వల్ల మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ప్రభుత్వం ప్రతి ఏ...

ఏపీ సీఎం చంద్రబాబు నుంచి ముస్లింలకు శుభవార్త – ప్రతి మసీదుకు నెలకు రూ.5 వేల సాయం

ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మతస్తులకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి మసీదుకు నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మైనారిటీ ఆడపిల్లల కోసం ఇంటర్మీడియట్‌ వరకు ఉచిత విద్యా సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఇమామ్‌లు, మౌజమ్‌లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అదేవిధంగా, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరిపినా, ఆస్తుల సంరక్షణను మైనారిటీల ద్వారానే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి, ప్రజలు వీటిని ఆన్‌లైన్‌లో పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నకిలీ మద్యం కేసులో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్‌

 క‌ల్తీ మ‌ద్యం కేసుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ జోగి రమేష్ వేసిన పిటిషన్ పై విచారణఈనెల 26వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వం, హోం శాఖ, డీజీపీకి హైకోర్టు ఆదేశాలుకలీ మద్యం కేసులో రాష్ట్ర ప్ర‌భుత్వ సిట్‌తో విచార‌ణ‌.. ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిసీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తిని నిందితుడిగా అరెస్ట్ చేశారని ప్రస్తావించిన పొన్నవోలు సిట్ విచారణ ఏం జరుగుతుంది..? సీబీఐకి నకిలీ మద్యం కేసు ఇవ్వాలా అనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

గుత్తి నేమతాబాద్‌లో మూడు లక్షల ఇళ్ల ప్రారంభోత్సవం

నూతన ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ బుధవారం గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం, పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకటశివుడు యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీ ఓ. ఆనంద్ గుత్తి సమీపంలోని నేమతాబాద్ గ్రామంలో నూతన మూడు లక్షల ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, “2014–2019 మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుపేదల కోసం ఎన్టీఆర్ గృహాలను నిర్మించారని” తెలిపారు.

ఉరవకొండను ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చి దిద్దాలి.-రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు మొలక రామాంజనేయులు.

అనంతపురం జిల్లా, ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ రాష్ట్ర మాల మహానాడు ఉపాధ్యక్షులు శ్రీ మొలక బాల రామాంజనేయులు పంచాయతీ కార్యదర్శికి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా రామాంజనేయులు మాట్లాడు తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. తద్వారా ఉరవకొండను ప్లాస్టిక్ రహిత పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు.ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం అమలులో ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ పరిధిలో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయని శ్రీ మొలక బాల రామాంజనేయులు ఆరోపించారు. ముఖ్యంగా ఈ : సాధారణ దుకాణాలు.  హోటళ్లు : ఆహార విక్రయ సంస్థలు. కిరాణా షాపులు: నిత్యావసర వస్తువుల దుకాణాలుమాంసం అమ్మే దుకాణాలు నిషేధాన్ని ఉల్లంఘిస్తూ విక్రయాలు సాగిస్తున్నాయని ఆయన ఫిర్యాదులో స్పష్టం చేశారు నిబంధనల ఉల్లంఘనపై మాత్రమే కాకుండా, ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలన్నారు ప్లాస్టిక్ రహిత పంచాయతీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా స్థానిక పర్యావరణ కాలుష్యాన్ని, ముఖ్యంగా మురుగునీటి వ్యవస్థలో ప్ల...
 రాష్ట్ర ఖజానా, రుణ నిర్వహణపై సమీక్ష--మంత్రి పయ్యావుల రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొని రాష్ట్ర ఆర్థిక పాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై లోతుగా చర్చించారు. ప్రధాన ఆర్థిక అంశాల చర్చ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ముఖ్యమైన విషయాలపై దృష్టి సారించారు:   రాష్ట్ర ఖజానా మరియు రుణ నిర్వహణ:     రాష్ట్ర ఖజానా ప్రస్తుత స్థితిని కూలంకషంగా సమీక్షించారు.ఆదాయ వసూళ్లు, వ్యయ విధానాలు మరియు రుణ నిర్వహణతో సహా ముఖ్యమైన ఆర్థిక అంశాలపై చర్చ జరిగింది.   బడ్జెట్ అమలు మరియు నిధుల విడుదల:     ప్రస్తుత సంవత్సర బడ్జెట్ అమలు పురోగతిని సమీక్షించారు.ముఖ్యమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధులు సకాలంలో విడుదల అవుతున్నాయో లేదో నిర్ధారించారు.   రెవెన్యూ వృద్ధి మరియు ప్రణాళికా వ్యూహాలు రాష్ట్ర ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి మరియు వ్యయాన్ని సమర్థవంతంగా వినియోగించడానికి ఈ క్రింది అంశాలపై ద...

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతలో 'ప్రజా ఉద్యమం' – మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

  అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ నియోజకర్గం: ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలో బుధవారం 'ప్రజా ఉద్యమం' హోరెత్తింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు గళమెత్తాయి. ర్యాలీ వివరాలు మరియు డిమాండ్లు భారీగా తరలివచ్చిన శ్రేణులు ఈ నిరసన ర్యాలీలో ప్రజలు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా తరలివచ్చారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ, టవర్‌క్లాక్‌ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు ఉధృతంగా కొనసాగింది. ప్రధాన నినాదాలు ర్యాలీ పొడవునా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యంగా:  ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు పేదల భవిష్యత్తు"  ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు"  "ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్‌ కళాశాలలు నిర్వహించాలి" అంటూ ముఖ్యమంత్రి నిర్ణయ...

మంత్రి పయ్యావుల స్ఫూర్తి... విడపనకల్లు – గడేకల్లు బీటీ రోడ్డు పూర్తి..

4 నెలల్లోనే 8.6 కి.మీ మార్గం నిర్మాణం విడపనకల్లు:  గ్రామీణ రహదారుల అభివృద్ధి స్ఫూర్తి తో రాష్ట్ర ఆర్థిక మంత్రి  పయ్యావుల కేశవ్  విడపనకల్లు మండలంలో  విడపనకల్లు – గడేకల్లు నూతన బీటీ రోడ్డు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తి చేశారు. 12 అడుగుల వెడల్పుతో, మొత్తం 8.600 కిలోమీటర్ల ఈ రహదారి కేవలం నాలుగు నెలల్లోనే అందుబాటులోకి తెచ్చి మండల ప్రజలు మెప్పు పొందారు. ఆయన దారి రహదారి అన్న చందంగా, పయ్యావుల సోదరులు రూటే సపరేటు అని నిరూపించారు. సకాలంలో పూర్తి చేసిన పనులు ఈ రహదారి పనులను స్వయంగా మంత్రి పయ్యావుల కేశవ్ గారు పర్యవేక్షించారు. జూలై 5న గడేకల్లు గ్రామంలో భూమిపూజ చేసి పనులను ప్రారంభించిన ఆయన, కాంట్రాక్టర్‌కు నాలుగు నెలల్లోనే నాణ్యతతో కూడిన రహదారిని పూర్తి చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మంత్రి వ్యక్తిగత పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు సమీక్షల కారణంగా పనులు వేగవంతమై, అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయబడ్డాయి. మండల కేంద్రానికి మెరుగైన అనుసంధానం ఈ నూతన రహదారి పూర్తికావడంతో విడపనకల్లు మండలంలోని అనేక గ్రామాలకు మండల కేంద్రానికి చేరుకోవడం సులభమైంది. ప్రధానంగా విడపనకల్లు, ఆర్. కొట్టాల, గడేకల్...

ర్యాగింగ్‌పై ఉక్కుపాదం: నేరానికి పాల్పడితే కఠిన చర్యలు – తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు

  తిరుపతి: ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరమని, తోటి విద్యార్థులను భయపెట్టడం, అవమానించడం లేదా హింసాత్మకంగా ప్రవర్తించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబడేది కాదని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు స్పష్టం చేశారు. విద్యార్థులు మానవతా విలువలతో మెలిగి, తోటివారికి సహాయం చేయాలని ఆయన సూచించారు. ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నరసింహారావు, రిజిస్ట్రార్ డాక్టర్ భూపతి నాయుడు కూడా పాల్గొన్నారు. భద్రతతో కూడిన న్యాయం ర్యాగింగ్ కేసుల్లో విద్యార్థులకు పూర్తి భద్రత ఉంటుందని ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు హామీ ఇచ్చారు. ర్యాగింగ్ ఘటనలు ఎదురైనప్పుడు బాధితులు ధైర్యంగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వారికి భద్రతతో కూడిన న్యాయం చేయబడుతుందని తెలిపారు. ర్యాగింగ్ చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు కీలక సూచనలు విద్యార్థులు తమ తోటివారితో స్నేహపూర్వకంగా మెలగాలని, చదువులో ఒకరికి ఒ...