Skip to main content

Posts

Showing posts from September 29, 2025

సర్పంచ్ అభ్యర్థులకు ఈటెల హెచ్చరిక.

 హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకూడదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు. “తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి. ఇవి లీగల్‌గా చెల్లుబాటయ్యే ఎన్నికలు కావని జాగ్రత్తగా ఉండాలి. కోర్టు రాజ్యాంగబద్ధంగా లేవని కొట్టేస్తే పరిస్థితి ఏమవుతుంది? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు రద్దు చేసింది. అప్పట్లో పోటీదారులు భారీగా నష్టపోయారు” అని ఈటెల గుర్తుచేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర తరహాలో ఇక్కడా ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు హడావుడిగా ఖర్చు చేయకుండా పరిస్థితి స్పష్టంగా తెలిసే వరకు ఆగాలని ఈటెల పిలుపునిచ్చారు.

ఆర్ డి టి సేవలకు బ్రేకులొద్దు.. ఫెరా పునరుద్ధరణే ముద్దు

 - అసెంబ్లీ లో ఎం ఎల్ ఏల్ లు:పరిటాల సునీత, బండారు శ్రావణి పునరుద్దరణ చర్చలు. -జిల్లా వ్యాప్తంగా పెల్లుబుకిన నిరసన జ్యాలలు  -ట్రూ టైమ్స్ ఇండియా: ప్రభుత్వ0 ఆర్ డి టి సేవలకు బ్రేకు లేయోద్దంటూ అలాగే ఫెరా చట్టాన్ని పునరుద్ధరించాలన్ని అభివృద్ధి కామకులు బిజెపి మాజీ తాలూకా యువ మోర్చా అధ్యక్షులు, జిల్లా భారతీయ మజ్దూర్ సంఘ్ ఉపాధ్యక్షులు, ఆర్ డి టి మాజీ ప్రధానోపాధ్యాయులు మాలపాటి శ్రీనివాసులు, జై కిసాన్ ఫౌండర్ నాగమల్లి ఓబులేశు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.   ఆర్ డి టి సేవా సంస్థప్రభుత్వ సేవలకు ధీటుగా సేవలందిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మంచిని స్వాగతించాలన్నారు. అనంతపురం కరువు జిల్లాలో స్థాపించి జిల్లా ఆమూలాగ్రం ఎస్సీ,ఎస్టీ,బడుగు బలహీన వర్గాలకు విద్యా, వైద్య సేవలు అందించిన ఘనత ఆర్ డి టి కే దక్కుతుందన్నారు.   గ్రామాల్లో పేదరిక నిర్మూలనకు నడుం బిగించిందన్నారు. విద్యా బోధనకు అవసరమైన పాఠశాలలో నిర్మించి, తద్వారా ఎంతోమందిని తీర్చిదిద్దిన ఘన కీర్తి ఆర్డిటిదే అనివారు కొనియాడారు.  వైద్యం కోసం ఆసుపత్రులు నిర్మించి తద్వారా పేదలకు రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు...

హోంవర్క్ చేయలేదని బాలుడిపై క్రూరశిక్ష.

చండీగఢ్‌ పానిపట్‌లోని శ్రీజన్ పబ్లిక్ స్కూల్‌లో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. హోంవర్క్ చేయలేదని ఏడేళ్ల 2వ తరగతి బాలుడిని ప్రిన్సిపాల్‌ అమానుషంగా శిక్షించాడు. చిన్నారిని కిటికీకి తలకిందులుగా వేలాడదీయడమే కాకుండా, స్కూల్ బస్సు డ్రైవర్‌తో విచక్షణారహితంగా కొట్టించాడు. ఈ ఘటనతో విద్యార్థి భయభ్రాంతులకు గురయ్యాడు. చూసిన ఇతర పిల్లలు కూడా వణికిపోయారు. చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే ప్రిన్సిపాల్, డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. చిన్నారిపై ఈ రకమైన శారీరక, మానసిక హింస తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. విద్యావేత్తలు, తల్లిదండ్రులు “ఈ విధమైన మనస్తత్వం ఉన్నవాళ్లు స్కూల్ నడిపే అర్హత ఉన్నారా?” అని ప్రశ్నిస్తున్నారు. విద్య అనేది భయం కాదు, ప్రేరణ కావాలి అని వారు హితవు పలికారు.

ఎన్టీఆర్ బేబీ కిట్‌లో కొత్తగా రెండు వస్తువులు

  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఉచితంగా అందించే ఎన్టీఆర్ బేబీ కిట్లో రెండు కొత్త వస్తువులు చేర్చారు. ఇటీవల కిట్‌ను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అందులో ఫోల్డబుల్ బెడ్ మరియు కిట్ బ్యాగ్ చేర్చాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ చర్యలు ప్రారంభించింది. ఇప్పటివరకు బేబీ కిట్‌లో దోమతెరతో కూడిన పరుపు, వాటర్ ప్రూఫ్ షీటు, దుస్తులు, న్యాప్‌కిన్లు, తువాలు, సబ్బు, సబ్బు పెట్టె, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మ ఇలా మొత్తం 11 వస్తువులు ఉండేవి. తాజాగా కొత్త రెండు వస్తువులు చేరడంతో సంఖ్య 13కి పెరిగింది. గతంలో ఒక్కో కిట్ ఖర్చు సుమారు రూ.1,504 కాగా, ఇప్పుడు అదనంగా రూ.450 వ్యయం కానుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి: అసాంఘిక జీవులుగా మారిన కోతులు! రోగులు బెంబేలు,

  ఉరవకొండ (అనంతపురం జిల్లా): ట్రూ టైమ్స్ ఇండియా: పేద ప్రజలకు వైద్యం అందించే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం ప్రస్తుతం కోతుల దండయాత్రతో దడ పుట్టిస్తోంది. ఆసుపత్రికి వచ్చే రోగులు మరియు వారి బంధువులు కోతుల వీరంగంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇవి కేవలం ఆహారాన్ని లాక్కోవడమే కాకుండా, రోగుల ఆరోగ్యానికి, భద్రతకు పెద్ద ముప్పుగా పరిణమించాయి. వార్డుల్లోకి చొరబాటు, ఆహార లూఠీ మీరు పంపిన చిత్రాలు ఆసుపత్రి లోపల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కారిడార్లలో, ముఖ్యంగా రోగులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలకు సమీపంలో కోతులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కిటికీల గ్రిల్స్‌ లోపల మరికొన్ని కోతులు మాటు వేసి ఉండగా, ఒక కోతి కింద కూర్చుని, ఒక నల్లటి వస్తువుతో పాటు పండ్లను లాక్కొని తింటున్న దృశ్యం ఆసుపత్రిలో భద్రత ఎంత లోపించిందో తెలుపుతోంది. "మా పిల్లాడి కోసం తెచ్చిన పండ్ల పొట్లం, బ్రెడ్ అంతా లాక్కెళ్లిపోయాయి. కోతులు ఒక్కసారిగా వస్తే భయమేసి మా మంచాల కింద దూరాం. రాత్రయితే నిద్ర కూడా పట్టడం లేదు" అని ఓ రోగి సహాయకురాలు కన్నీటిపర్యంతమయ్యారు. ఆరోగ్య, భద్రతా ప్రమాదాలు ప్రభుత్వ ఆసుపత్రిలో కోతుల సంచారం కేవలం ఆహా...

ఆఖరికి సినిమాలనూ వదలని అమెరికా అధ్యక్షుడు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100 శాతం టారీఫ్ విధించారు. అయితే, అమెరికాలో నిర్మించిన చిత్రాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.              ఇక, సినిమా రంగంపై టారీఫ్‌లకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘మన సినిమా బిజినెస్‌ను అమెరికా నుంచి దొంగిలిస్తున్నారు’ అని రాసుకొచ్చారు. కాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమాలపై పెద్దఎత్తున ప్రభావం పడనుంది. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలూ అమెరికాలో రిలీజ్ అయి కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఓవర్‌సీస్ సినిమా బిజినెస్‌తో మరీ ముఖ్యంగా అమెరికా బిజినెస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా లాభపడుతోంది. ట్రంప్ నిర్ణయంతో ఈ లాభాలకు గండిపడినట్లు అవుతుంది..

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు మృతి పై విచారణ

  -ఓ వైద్యుడు, నర్సు పై వేటు కు రంగం సిద్ధం. -కొట్టాలపల్లి పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీ, అందుబాటు లో లేని సిబ్బంది గురించి ఆరా.   ట్రూ టైమ్స్ ఇండియా :ఓ డాక్టర్, నర్స్ నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి ఘటన, మరియు కొట్టాలపల్లి పీ హెచ్ సీ సిబ్బంది అందుబాటులో లేరని వచ్చిన ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు( త్రి సభ్యులతో కూడిన బృంద )విచారణ చేపట్టారు.  ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఈనెల 26వ తేదీన వజ్ర కరూర మండలం చాబాల గ్రామానికి చెందిన ఆహారన్ అనే ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. అందులో భాగంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భ్రమరాంబికాదేవి, డిసిహెచ్ఎస్ డేవిడ్ సెల్వ రాజు, మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పీడియాట్రికల్ డాక్టర్ ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి గతంలో ఆ బాలుడు ఎక్కడ వైద్య చికిత్స చేయించుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స అందించారు విధుల్లో ఉన్న డాక్టర్లు ...

హరేసముద్రంలో చట్టాలపై అవగాహన

  బాల్య వివాహాలు, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయాలి: తహసీల్దార్, ఎస్‌ఐ పిలుపు ట్రూ టైమ్స్ ఇండియా, సెప్టెంబర్ 29: మండల పరిధిలోని హరేసముద్రం గ్రామంలో సోమవారం చట్టాలు, పౌరుల హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ మునివేలు, సబ్-ఇన్‌స్పెక్టర్ నబిరసూల్, మండల సర్వేయర్ రవితేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మరియు ఎస్‌ఐ మాట్లాడుతూ... మండలంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అదేవిధంగా, పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోక్సో చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. భద్రతకు ప్రాధాన్యత: ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని వారు ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఏదైనా సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు దృష్టికి వస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో తహసీల్దార్ మునివేలు, సబ్-ఇన్‌స్పెక్టర్ నభిరసుల్, మండల సర్వేయర్ రవితేజతో పాటు ఆర్.ఐ. రామాంజనేయులు, వీఆర్వో, గ్రామ పెద్దలు, ...

పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్: ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సబ్సిడీ గైడ్‌లైన్స్ విడుదల

 ట్రూ టైమ్స్ ఇండియా:సెప్టెంబర్ 29 దేశవ్యాప్తంగా 72,300 స్టేషన్ల లక్ష్యం, రూ.2000 కోట్లతో కేంద్రం బృహత్‌ ప్రణాళిక న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్' కింద దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం సబ్సిడీ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఈ బృహత్‌ ప్రణాళిక కోసం ప్రభుత్వం సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేయనుంది. సబ్సిడీ వివరాలు ఇవే: ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నిర్దేశించిన సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయి:  * 100% సబ్సిడీ: ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, విద్యా సంస్థల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే సంస్థలకు 100 శాతం సబ్సిడీ లభిస్తుంది.  * 80% సబ్సిడీ: రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు (ఎయిర్‌పోర్ట్స్), బస్ డిపోలు, టోల్ ప్లాజాలు, ఇతర ముఖ్యమైన పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే స్టేషన్లకు 80 శాతం సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఈ స్కీమ్ కింద ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి కలిగిన ప్రభుత్వ ఏజెన్సీలు మరియు పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (PSU) వెంటనే...

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుండె జబ్బుల చికిత్సకు రూ. 1004 కోట్లు ఖర్చు

 పేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: మంత్రి సత్యకుమార్ యాదవ్ అనంతపురం, సెప్టెంబర్ 29: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం & వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుండె జబ్బులతో బాధపడుతున్న 1 లక్ష 42 వేల మందికి చికిత్స అందించామని, ఇందుకోసం రూ. 1,004 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సోమవారం అనంతపురం నగరంలోని శారదా నగర్‌లో ఉన్న **సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (SSH)**లో ప్రపంచ హృదయ దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే - 2025) మరియు కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో **100 ఇమేజ్ గైడెడ్ పీసీఐ (IVUS)**లు, 500 యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుండె జబ్బుల నివారణకు అవగాహన అవసరం ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... "గుండెచప్పుడు ఆగకుండా విశేషమైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల సమాజానికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు," అని తెలిపారు. ఈ సంవత్సరం ...

కూటమి ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం – మంత్రి సత్యకుమార్ యాదవ్

  ధర్మవరం నియోజకవర్గ లబ్ధిదారులకు ₹67 లక్షల సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్. రూ.6.31 కోట్లు ఆరోగ్య సహాయం – మంత్రి సత్యకుమార్ ధర్మవరం, ట్రూ టైమ్స్  ఇండియా సెప్టెంబర్ 29: — ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్య కుమార్ యాదవ్ సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... ధర్మవరం నియోజకవర్గానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు రూ.67 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటును గుర్తు చేస్తూ, పేదలు మరియు మధ్య తరగతి ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారిపై భారంగా మారుతున్న వైద్య ఖర్చులు ప్రభుత్వ దృష్టికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) మరియు ఎల్ఓసిల ద్వారా ₹5.63 కోట్లు లబ్ధిదారులకు అందించామని, ఇవాళ్టి పంపిణీ అయిన ₹67 లక్షలతో కలిపి మొత్తం ₹6.31 కోట్లు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం, శ్...

కదిరిలో ఆర్.సి.పి.ఐ. ఆధ్వర్యంలో ధర్నా: ఎర్రకోట కాలనీలో మౌలిక వసతుల కల్పనకై డిమాండ్‌

 కదిరి: కదిరి: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆర్.సి.పి.ఐ. (RCPI) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ... 2023 సంవత్సరంలో RCPI ఆధ్వర్యంలో 1778-1 లేఖ ద్వారా నిరుపేదలు గుడిసెలు నిర్మించుకున్నారని తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభుత్వ అధికారులు వారికి మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. "రాత్రిపూట కరెంటు లేకపోవడం వల్ల విషపూరితమైన సర్పాలు, పురుగుల బెడదతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది అక్కడ నివసిస్తున్నారు," అని నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇకనైనా 'మోద్దు నిద్ర' మానేసి, 34వ వార్డుకు సంబంధించిన ఎర్రకోట కాలనీలో నివసిస్తున్న నిరుపేదలందరికీ తక్షణమే త్రాగునీరు, విద్యుత్తు, వీధిలైట్లు, సిమెంట్ రోడ్లు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించా...

ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయాలు ఉండేలా చంద్రబాబు చర్యలు

అమరావతి  అమరావతి పనులు 24/7 అమరావతిలో ప్రతి కేంద్ర ప్రభుత్వ విభాగ కార్యాలయం ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పుడో కాదు.. ఇప్పుడే ఉన్న పళంగా నిర్మాణాలు ప్రారంభించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఆయన రంగంలోకి దించుతున్నారు. పన్నెండు బ్యాంకులు ఇప్పుడు అమరావతిలో రాష్ట్ర స్థాయి కార్యాలయాల నిర్మాణాన్ని ఒకే సారి ప్రారంభించబోతున్నాయి. ఆర్థిక నగరంలో వీటికి కేటాయించిన స్థలాలను చదును చేసి ఇచ్చేశారు. ఇప్పుడు బ్యాంకులు నిర్మాణాలు ప్రారంభించబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే రోజు అన్ని కార్యాలయాలకు శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన స్థలాల్లోనూ నిర్మాణాలు ప్రారంభించేలా చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారు. కేవలం ప్రభుత్వం చేపట్టిన పనుకలకే ప్రస్తుతం పదమూడు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు . ఇతర ప్రైవేటు సంస్థలు.. కేంద్ర ప్రభుత్వం సంస్థలు, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు చేపట్టిన నిర్మాణాల కోసం రోజుకు కొన్ని వందల మంది అమరావతికి వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా అమరావతిలో పనులు జరుగుతూ ...

_వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఆవిష్కరణ

ఉరవకొండ:విడపనకల్ మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురిఅవుతున్న వైసీపీ కార్యకర్తల కోసం ఆవిష్కరించిన డిజిటల్ బుక్,క్యూఆర్ కోడ్ కార్యక్రమాన్ని ఉరవకొండ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి,రాష్ట్ర యువనేత వై.ప్రణయ్ రెడ్డి ఆదేశాలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు ఆధ్వర్యంలో డిజిటల్ బుక్ కరపత్రాలను,క్యూఆర్ కోడ్ లను ప్రారంభించడం జరిగింది.     ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు,దాడులు జరిగితే వాటి ఫొటోలు,దాడి జరిగిన సంఘటనలు డిజిటల్‌ బుక్‌లో అప్‌లోడ్‌ చేసి లోకేషన్‌ షేర్‌ చేయాలని సూచించారు.అనంతరం డిజిటల్‌ బుక్‌ యాప్‌ పోస్టరును విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు పాల్గొన్నారు._

నల్లరేగడి నేలల్లో పప్పుశనగ విత్తనాల పంపిణీలో జాప్యం, ఈ-క్రాప్ నమోదు గడువు పెంపు కోసం సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా

  ఉరవకొండ:ఉరవకొండ డివిజన్ ప్రాంతంలో పప్పుశనగ విత్తనాల పంపిణీలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ, తక్షణమే రాయితీపై విత్తనాలను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఉరవకొండ డివిజన్‌లో నల్లరేగడి పొలాలు అధికంగా ఉన్నాయని, పప్పుశనగ (శనగ) విత్తే సమయం ఆసన్నమైనప్పటికీ ప్రభుత్వం పంపిణీకి సిద్ధం చేయకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతు సంఘం డిమాండ్లు:  * 90% రాయితీతో విత్తనాలు: రైతులకు సరిపడా పప్పుశనగ విత్తనాన్ని 90 శాతం రాయితీతో తక్షణమే పంపిణీ చేసి ఆదుకోవాలి.  * ఎరువులు, పురుగుమందుల లభ్యత: రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులను రైతు సేవా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలి.  * కౌలు రైతులకు విత్తనాలు: నల్లరేగడి పొలాలను సాగు చేస్తున్న కౌలు రైతులకు కూడా పప్పుశనగ విత్తనాలు సరఫరా చేయాలి.  * ఈ-క్రాప్ గడువు పెంపు: సర్వర్ సమస్యల కారణంగా ఇప్పటికీ అధిక శాతం మంది రైతులు ఈ-క్రాప్ (E-Crop) నమోదు పూర్తి చేయలేదు. కావున, ఈ-క్రాప్ నమోదు గడువును పెంచాలి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్...