కర్నూలు: శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులోనే ప్రధాన హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, కర్నూలు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. ఈ రోజు (అక్టోబర్ 16, 2025) సహా, గత రెండు రోజులుగా (అక్టోబర్ 13 నుండి 16 వరకు) న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులకు దూరంగా ఉంటున్నారు. కర్నూలుకు భారత ప్రధాని వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నిరసనను చేపట్టారు. 16-11-1937 నాటి శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలోని కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలనేది ఈ డిమాండ్ ప్రధాన ఉద్దేశం. కర్నూలు బార్ అసోసియేషన్ పిలుపు మేరకు దాదాపు 90% మంది అడ్వకేట్‌లు గత రెండు రోజులుగా కోర్టు విధులకు హాజరు కాలేదు. హైకోర్టు సాధన లక్ష్యాన్ని నెరవేర్చుకునే దిశగా ఈ రోజు కూడా న్యాయవాదులందరూ స్వచ్ఛందంగా కోర్టుకు పోవద్దని కర్నూలు బార్ అడ్వకేట్‌లకు విజ్ఞప్తి చేశారు. కర్నూలు హైకోర్టు సాధన సమితి ఈ సందర్భంగా, నిరసనలో పాల్గొంటున్న ప్రతి లాయరుకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసింది.
Local to international