గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామం సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పొనుగుపాడు గ్రామానికి చెందిన కమ్మల రత్న సాగర్ (40) తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం, రత్న సాగర్ కుటుంబం పిడుగురాళ్ల నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు వేగంగా దూసుకువచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రత కారణంగా రత్న సాగర్ బైక్ నుండి దూరంగా పడిపోగా, ఆయన శరీరానికి తీవ్రమైన గాయాలు తగిలాయి. కాళ్లు, చేతులు, తల భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అక్కడికి చేరుకున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
Local to international