Skip to main content

Posts

Showing posts from September 27, 2025

కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మళ్లీ ఆశలు: ఆందోళన ముగింపు, భవిష్యత్ కార్యాచరణకు సన్నాహాలు

 కర్నూలు, సెప్టెంబర్ 28,  రాయలసీమలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలనే సుదీర్ఘ డిమాండ్‌ మరోసారి చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని విధాన మండలిలో హామీ ఇవ్వడం ఈ అంశానికి తాజా ఊపునిచ్చిందని హై కోర్ట్ సాధన సమితి నేత, సీనియర్ న్యాయ వాది జీ వి కృష్ణ మూర్తి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తో ఈ ప్రకటన తో రాయలసీమ ప్రజల్లో, న్యాయవాదుల్లో మళ్లీ ఆశలు చిగురింపజేసింది. సుదీర్ఘ పోరాటం, తాజా హామీ 2019 నుండి వివిధ ప్రభుత్వాలు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని తీర్మానాలు చేసినా, న్యాయ రాజధానిగా ప్రకటనలు చేసినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చలేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ నెల 27, 2025 శనివారం నాడు ఆంధ్ర విధాన మండలిలో హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో మాట తప్పమని స్పష్టం చేసింది. ఈ హామీ కర్నూలు హైకోర్టు సాధన సమితి లాయర్ల ఆందోళన నేపథ్యంలో రావడం గమనార్హం. సాధన సమితి నిరసన ముగింపు కర్నూలు హైకోర్టు సాధన సమితి లాయర్లు ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాల సందర్భ...

కరూరులో తొక్కిసలాట – మరణాల సంఖ్య 39కి పెరిగింది.

కరూర్ (తమిళనాడు): సినీనటుడు, తమిళగమన పార్టీ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచారసభ సందర్భంగా కరూరులో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విజయ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ – “నా హృదయం ముక్కలైంది. నేను భరించలేని బాధ, దుఃఖంలో ఉన్నాను. ఆ బాధ పదాల్లో వర్ణించలేనిది. కరూర్లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.”

కరూరులో విషాదం – విజయ్ సభలో తొక్కిసలాట.

 కరూర్ (తమిళనాడు): సినీనటుడు, తమిళగమన పార్టీ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ ఘోర విషాదానికి కారణమైంది. కరూరులో శనివారం రాత్రి జరిగిన ఆయన సభలో తొక్కిసలాట చోటుచేసుకోగా, 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 38 మంది దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్, ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. ప్రతి శనివారం రెండు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన, నామక్కల్‌లో ఉదయం ప్రచారం ముగించుకుని సాయంత్రం కరూరుకు చేరుకున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో వేలుసామిపురంలో సభ జరుగుతుండగా, విజయ్‌ను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంలో అనేక మంది ముందుకు దూసుకెళ్లారు. ఆహుతులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు గుంపులో ఇరుక్కుపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో గందరగోళం తలెత్తింది. వెంటనే పోలీసు సిబ్బంది, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను ఆసుపత్రులకు తరలించారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 38 మంది మృతి చెందారని ధృవీకరించింది. క్షతగాత్రులు పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

సభాపతిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు

అమరావతి: శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సభాపతి అయ్యన్నపాత్రుడి కార్యాలయానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. సభాపతికి తాను వెళ్లి నమస్కరించడం మర్యాదేనని సీఎం స్పష్టంచేయడం విశేషం. శాసనసభ ప్రాంగణంలో ఇటీవల తీసుకున్న సభ్యుల గ్రూప్ ఫొటోను సీఎం ఛాంబర్‌కి అందజేయాలని మొదట సభాపతి సిబ్బందికి వర్తమానం పంపించారు. అయితే విషయం తెలిసిన సీఎం, స్పీకర్ వద్దకే స్వయంగా వెళ్లి ఫొటో అందుకున్నారు. ఈ సందర్భంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కూడా అక్కడే ఉండగా, ఇటీవల తిరుపతిలో జరిగిన చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు విజయవంతం కావడంపై వారిద్దరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సదస్సులో పాల్గొనాలని తాను భావించినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హాజరుకాలేకపోయానని, దీనికి విచారం వ్యక్తం చేసినట్లు సీఎం చెప్పారు. భాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కలిసి ముఖ్యమంత్రికి శాసనసభ్యుల గ్రూప్ ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ పని తీరు అద్భుతం పయ్యావుల. మంత్రి పయ్యావుల

 శాసనమండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్  మాట్లాడుతూ, ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను తెలుగుదేశం పార్టీ ఆదుకున్నదని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు  ఆలోచనల మేరకు, నారా భువనేశ్వరి గారి నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. A ఈ పాఠశాలల ద్వారా ఫ్యాక్షన్ రాజకీయాల్లో తమ తండ్రిని కోల్పోయిన వందలాది మంది పిల్లలకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యతో పాటు, ఆ పిల్లల మానసిక స్థితి మెరుగుపరచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆయన తెలిపారు. ఈ విధంగా, ఆ విద్యార్థులు ఇప్పడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో, ప్రభుత్వ సేవల్లో స్థిరపడినారని ఆయన వెల్లడించారు. "ఇది మా తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ హత్యలతో నష్టపోయిన వారికిచ్చిన మద్దతుకు నిలువెత్తు నిదర్శనం," అని పయ్యావుల కేశవ్ గారు పేర్కొన్నారు.

ఉరవకొండలో భారీ పేకాట స్థావరంపై దాడి: 21 మంది అరెస్ట్, నగదు, వాహనాలు స్వాధీనం

ఉరవకొండ/మైలారంపల్లి: (సెప్టెంబర్ 27, 2025): అనంతపురం జిల్లాలో అక్రమ పేకాట స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఈరోజు ఉరవకొండ మండలం, మైలారంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో నిర్వహించిన దాడుల్లో 21 మంది పేకాటా రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 77 వేల నగదుతో పాటు 17 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఉరవకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఇచ్చిన వివరాల ప్రకారం, విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు (27.09.2025) తమ సిబ్బందితో కలిసి మైలారంపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 21 మందిని పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న నగదు, మోటారు సైకిళ్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు సీఐమహానంది తెలిపారు.

రెవిన్యూ ఉద్యోగులకు క్రీడా సామాగ్రి కోసం రూ 1.50 లక్షల

  చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్ నంద్యాల, సెప్టెంబరు 26: అనంతపురం జిల్లాలో నవంబర్ 7, 8, 9 తేదీలలో జరగనున్న 7వ రాష్ట్ర రెవెన్యూ క్రీడా సాంస్కృతికోత్సవాలలో పాల్గొనబోయే నంద్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల కోసం జిల్లా కలెక్టర్ రూ.1,50,000/- ల చెక్కును ఏపిఆర్ఎస్ఏ నంద్యాల జిల్లా కార్యవర్గానికి అందజేశారు. *రెవెన్యూ సిబ్బంది క్రీడలకు అవసరమైన మెటీరియల్, స్పోర్ట్స్ కిట్స్ కొనుగోలు మరియు ఇతర ఏర్పాట్ల కోసం ఈ ఆర్థిక సహాయం అందజేయడం పట్ల జిల్లా రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుభాకర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, ముఖ్యంగా అశక్తి కలిగిన సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకుని ఈ క్రీడల్లో పాల్గొనడానికి సమాయత్తం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపిఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు కామేశ్వర రెడ్డి, ఏపిజేఏసీ జిల్లా చైర్మన్ & ఏపిఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి రామచంద్ర రావు, ఏపిఆర్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి శూలం విజయ శేఖర్, జిల్లా సహా...

జల జీవన్ మెషిన్ పాలన అనుమతులు. సీ యం. చంద్రబాబు నాయుడు

 శింగనమల నియోజకవర్గ పరిధిలోని మిడ్ పెన్నారు ఆధునికీకరణ, జల్ జీవన్ మెషీన్ ని పునరుద్ధరించి నీటి ప్రాజెక్టులకు, నియోజకవర్గంలో ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడి ని కలిసి, వినతిపత్రం అందజేయడం జరిగింది. అలాగే నియోజకవర్గ పరిధిలోని యల్లనూరు, పుట్లూరు మండలాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. గండికోట - పుట్లూరు - సుబ్బరాయ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, జల్ జీవన్ మెషీన్ కింద పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ, నిధులు విడుదల చేస్తే నీటి సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వివరించాను. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరగా.. చంద్రబాబు గారు సమస్యలు పై సానుకూలంగా స్పందించారు.

జనగణనలో కుల గణన చేపట్టాలి

  అనంతపురం:   జన గణనలో కుల గణన చేపట్టాలని బీసీ కులాల జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించాలని సిపిఐ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షతన ఎన్జీవో హోంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాజకీయ పార్టీలు కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సలహాలు సూచనలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ఐదు నుండి 15% మధ్యలో ఉన్న అగ్రకులాల నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కానీ 50 నుంచి 70 శాతం మధ్యలో ఉన్న బీసీ కులాల నాయకులు చిన్నచిన్న పోస్టులకు అగ్రకులాల వారిని అడుక్కున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయన్నారు గత స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బీసీలు కోల్పోయారని పేర్కొన్నారు. ...

ఉరవకొండలో చట్టవిరుద్ధ బార్‌ కలకలం: అధికారుల 'లంచాల'పై తీవ్ర ఆరోపణలు

 లై సెన్స్ కళ్యాణ దుర్గంమున్సిపాలిటీలో లో.. నిర్వహణ ఉరవకొండ గ్రామ పంచాయితీ లో  - ఊరురా బెల్ట్ షాపులు, నిర్వాహకులదే రాజ్యమా? నో డాకుమెంట్స్, నో నోటిఫికేషన్స్ ఉరవకొండ : అనంతపురం జిల్లా పరిధిలోని  ఉరవకొండ లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఎటువంటి చట్టపరమైన అనుమతులు (జీఓ) లేకుండా, కేవలం ఎక్సైజ్ అధికారుల అండదండలతో, భారీ లంచాలతో ఈ బార్ నడుస్తోందని స్థానిక వ్యాపారులు, పౌరులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామంతో తమ వ్యాపారాలు దెబ్బతిని, తమ జీవనం ప్రమాదంలో పడిందని స్థానిక మద్యం షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్‌ నిబంధనలకు విరుద్ధంగా బార్‌ నిర్వహణ ఎక్సైజ్ చట్టాల ప్రకారం, గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా బార్‌ను ఏర్పాటు చేయాలంటే మంత్రివర్గ స్థాయి ఆమోదంతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) తప్పనిసరి. అయితే, ఉరుకొండలో గత నాలుగు రోజులుగా నడుస్తున్న ఈ కొత్త బార్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక పత్రాలు గానీ, నోటిఫికేషన్లు గానీ లేవని స్థానిక వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. వ్యాపారులు ప్రశ్నించగా,...

భాగ్యనగరంలో మూసీ వరద: డ్రోన్ విజువల్స్ ద్వారా సమీక్ష

హైదరాబాద్: ఉగ్రంగా ప్రవహిస్తున్న మూసీ నది మరియు మద్యపునిట్లలో పడుతున్న వరద పరిస్థితిని డ్రోన్ల ద్వారా తీసుకున్న విజువల్స్ అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. భాగ్యనగరంలో మూసీ నది ఉగ్ర ప్రవాహంతో విస్తరిస్తోంది, జలాలు నివాస ప్రాంతాల వద్దకు చేరుతూ ప్రమాద పరిస్థితులను సృష్టిస్తున్నాయి. హిమాయత్ సాగర్ గేట్లు ఒకేసారి ఎత్తిన దృశ్యం, భారీగా ప్రవహిస్తున్న నీటిని చూపుతూ, నగరంలోని ప్రధాన వరద నియంత్రణ విధానాలను వెల్లడిస్తుంది. రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు DRF, GHMC, RTC మరియు పోలీస్ బృందాలు కలిసి, సురక్షిత ప్రాంతాలకి వందల మంది ప్రజలను తరలిస్తున్న దృశ్యాలను డ్రోన్లు ద్వారా లైవ్‌గా నమోదుచేస్తున్నాయి. ఈ డ్రోన్ విజువల్స్, ప్రజలకు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ సహాయక చర్యలను గమనించడానికి ఒక కీలక సాధనంగా మారాయి.

మూసీ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్: నగరాన్ని అతలాకుతలం చేస్తున్న మూసీ వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కమిషనర్ చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. ముఖ్యంగా చాదర్‌ఘాట్ పరిసరాల్లో నది నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలో ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించే చర్యలను కమిషనర్ ప్రత్యక్షంగా గమనించారు. ఎంజీబీఎస్ సమీపంలో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో నీరు లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను కూడా పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా DRF బృందాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చొరబడినప్పుడు DRF, పోలీసులు, RTC, GHMC సిబ్బంది కలసి వందలాది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఆయన అభినందించారు. మూసీ వరదల దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూ...

మంచిర్యాల జిల్లాలో టెక్నికల్ అసిస్టెంట్ ACB వలలో

మంచిర్యాల, సెప్టెంబర్ 27: ప్రభుత్వ పనులను అడ్డుపెట్టి లంచం తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ టెక్నికల్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కాడు. కన్నెపల్లి మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో అవుట్‌సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బానోత్ దుర్గాప్రసాద్, అధికారిక సహాయం పేరుతో రూ.10,000 లంచం తీసుకుంటూ రంగేహస్తంగా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే– లింగాపూర్ గ్రామ శివార్లలో మజ్దూర్ గారంటీ పథకం (MGNREGS) కింద ఫిర్యాదుదారుడు కొత్తగా నిర్మించిన పశువుల కొట్టానికి సంబంధించిన పెండింగ్ MB ఎంట్రీలను నమోదు చేయడం, బిల్లు మంజూరు చేయడం కోసం లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడి ఇంటిలో నగదు స్వీకరిస్తుండగా ACB అధికారులు ఆకస్మికంగా దాడి చేసి అతన్ని పట్టుకున్నారు. అధికారుల సమాచారం మేరకు, రూ.10,000/- కళంకిత లంచం మొత్తం దుర్గాప్రసాద్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. విధులను నిజాయితీగా నిర్వర్తించకుండా వ్యక్తిగత ప్రయోజనాన్ని పొందేందుకు లంచం స్వీకరించాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేసి, కరీంనగర్ SPE & ACB ప్రత్యేక కోర్టు గౌరవనీయ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. కే...

ఆరోగ్యానికి వరంగా నిలిచే బొప్పాయి

మన ఆహారపు అలవాట్లలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. వాటిలో బొప్పాయి (Papaya) ఒక అద్భుతమైన సహజ ఔషధం అని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో లభించే ఈ పండు ఆరోగ్యానికి ఎన్నో మేలులు చేస్తుంది. బొప్పాయిలో అధికంగా పీచుపదార్థం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి వైరల్‌ జబ్బులు దూరం అవుతాయి. మధుమేహ రోగులు కూడా భయపడకుండా ఈ పండును తినవచ్చు. దీనిలో సహజ చక్కెర తక్కువగా ఉండటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే గుణం కలదు. మోకాళ్ల నొప్పులు, వయో సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి ప్రత్యేకంగా మహిళలకు ఉపయోగకరమని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. నెలసరి క్రమబద్ధంగా రావడంలో, పాలు పెరగడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా విటమిన్ A, E, C, బీటా కెరోటిన్ అధికంగా ఉండటంతో చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న క్యాన్సర్, డెంగ్యూ వంటి వ్యాధులను నివారించడంలో కూడా బొప్పాయి పాత్ర విశేషమని వైద్య నిపుణులు అభిప్రా...

ప్రభుత్వ ఉద్యోగ సాధనలో స్ఫూర్తిగా విడపనకల్ ఇందిర: తెలుగు పండిట్‌గా జిల్లాలో 6వ ర్యాంక్

  విడపనక ల్ ఎన్. తిమ్మాపురం గ్రామం: పట్టుదల, కుటుంబ సహకారం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించింది విడపనకల్ మండలం, ఎన్. తిమ్మాపురం గ్రామానికి చెందిన ప్యాట్లో ఇందిర. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ (ఉపాధ్యాయ నియామకాలు) విజేతలకు ఇటీవల విద్యాశాఖ నియామక పత్రాలను అందించగా, ఈ జాబితాలో ఇందిర తన ప్రతిభను చాటుకున్నారు. చిదానంద రెడ్డి కుమార్తె అయిన ఇందిర, తెలుగు పండిట్ విభాగంలో జిల్లా స్థాయిలోనే ఆరో ర్యాంకును సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా, ఇందిర గతంలో **పీహెచ్‌డీ (తెలుగు విభాగం)**లో గోల్డ్ మెడల్ సాధించిన ఘనత కూడా ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఇందిర, "నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమే అయినా, కృషి చేస్తే అసాధ్యమైతే ఏమీ ఉండదు. మనం ఎంచుకున్న లక్ష్యంపై ఆసక్తి, ఇష్టంతో పాటు కుటుంబ సభ్యుల పూర్తి సహకారం ఉంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు" అని యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాన్ని అందించారు. ఉన్నత విద్యలో స్వర్ణ పతకం సాధించిన ఇందిర, ఇప్పుడు ఉపాధ్యాయురాలిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

ఉద్భవలక్ష్మి అమ్మవారికి 'సంతానలక్ష్మి' అలంకరణ: దసరా శోభతో పెన్నహోబిలం

  పెన్నహోబిలం: సంతానలక్ష్మీ అనంతపురం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరో రోజు శనివారం (సెప్టెంబర్ 27) అమ్మవారు భక్తులకు సంతానలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) తిరుమల రెడ్డి పర్యవేక్షణలో, అర్చకులు ద్వారకనాథాచార్యులు, మయూరం బాలాజీ సిబ్బంది నవరాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల అలంకరణల వివరాలు:  * సెప్టెంబర్ 22 (సోమవారం): ఆదిలక్ష్మి  * సెప్టెంబర్ 23 (మంగళవారం): గజలక్ష్మి  * సెప్టెంబర్ 24 (బుధవారం): ధాన్యలక్ష్మి  * సెప్టెంబర్ 25 (గురువారం): సౌభాగ్యలక్ష్మి  * సెప్టెంబర్ 26 (శుక్రవారం): ధనలక్ష్మి సంతానలక్ష్మిగా ప్రత్యేక పూజలు: ఆరో రోజు సంతానలక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం అమ్మవారికి పసుపు, కుంకుమలతో విశేష అర్చనలు నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పూలమాలలతో అమ్మవారిని అత్యంత శోభాయమానంగా అలంకరించారు. అమ్మవా...

వైద్య సిబ్బంది తీరుపై సిపిఎం ధర్నా: రోగుల పట్ల నిర్లక్ష్యంపై ఆగ్రహం

 ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట భారీ ధర్నా జరిగింది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ వైద్యం కోసం ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, వైద్యులు రోగుల పట్ల అనుసరిస్తున్న తీరుపై సిపిఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "వైద్యుల దగ్గరికి వస్తే సగం జబ్బు నయం కావాలని అంటారు. కానీ ఇక్కడి వైద్య సిబ్బంది తీరు చూస్తే ఉన్న జబ్బు మాట దేవుడెరుగు, లేని జబ్బు తగిలించుకొని పోయే విధంగా ఉంది" అని సిపిఎం నాయకులు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల జ్వరంతో బాధపడుతున్న ఐదు సంవత్సరాల చిన్నారి మరణించిన ఘటనను వారు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రైవేట్ క్లినిక్ లపై శ్రద్ధ: ప్రభుత్వ వైద్యంపై నిర్లక్ష్యం ప్రభుత్వ వైద్యులు తమ సొంత ప్రైవేట్ క్లినిక్ లపై చూపే శ్రద్ధ ప్రభుత్వ వైద్యం అందించే దానిపై లేదని సిపిఎం ఆరోపించింది. ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే వెంటనే అనంతపురం జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసే అధికారులు, చిన్నారి మరణం విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇక్కడి వైద్యులు రోగులను చేయి పట్టుకుని స్టెతస్కోపుతో పరీక్షించిన సందర్భ...

కర్నూలు హైకోర్టు సాధన సమితి రిలే నిరాహారదీక్షల ముగింపు: శ్రీ బాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్‌

 కర్నూల్: కర్నూలు: ప్రధాన హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 'కర్నూలు హైకోర్టు సాధన సమితి' ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన వారం రోజుల రిలే నిరాహారదీక్షలు శనివారం (సెప్టెంబర్ 27) నాడు ముగిశాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో, సెప్టెంబర్ 21 నుండి కర్నూలు ధర్నా చౌక్ వద్ద టెంట్ వేసుకొని జరిగిన ఈ దీక్షా కార్యక్రమాన్ని నేటి సాయంత్రం లాంఛనంగా ఉపసంహరించుకుంటున్నారు. కర్నూలు జిల్లా అడ్వకేట్ జి.వి. కృష్ణమూర్తి నేతృత్వంలో ఈ నిరసనను చేపట్టారు. సమస్య యొక్క తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని నిర్వహించినట్లు న్యాయవాదులు తెలిపారు. శ్రీ బాగ్ ఒప్పందంపై గళమెత్తిన న్యాయవాదులు 1937 నవంబర్ 16న కుదిరిన చారిత్రక శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం, రాయలసీమ ప్రాంతానికి రాష్ట్ర రాజధాని లేదా ప్రధాన హైకోర్టులో ఏదో ఒకటి తప్పనిసరిగా దక్కాల్సి ఉంది. ఈ ఒప్పందంలోని హక్కులను నేటికీ విస్మరించడంపై న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం కోస్తాంధ్ర ప్రాంతమైన అమరావతిలోనే ఏకపక్షంగా అభివృద్ధిని కేంద్రీకరించడం అన్యాయమని వారు ఆరోపించారు. ఉ...