Skip to main content

Posts

Showing posts from November 21, 2025

ఏపీలో 9 పట్టాణాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింపు

  అమరావతి :  (నవంబర్ 22) ఏపీ రాష్ట్రంలో 9 అర్బన్ లోకల్ బాడీలకు స్పెషల్ ఆఫీసర్ల పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ఈ ప్రత్యేక పాలన 2026 మే 5 వరకు లేదా స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఇందులో రాజాం, రాజమండ్రి, భీమవరం వంటి పట్టణాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ ఆలస్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పొడిగించబడిన 9 అర్బన్ లోకల్ బాడీలు  1)రాజమండ్రి  2)రాజాం  3)భీమవరం  4)నరసరావుపేట  5)చీరాల  6)మార్కాపురం  7)కావలి  8)గుడివాడ  9)జగ్గయ్యపేట

అన్నదాత ఆక్రందన! పట్టించుకోని ప్రభుత్వం!

  -- వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవి రమణ.   ‌‌ అన్నదాతల ఆక్రందన పట్ల రాష్ట్ర ప్రభుత్వం చెవిటి,మూగ, గుడ్డి దానిలా ప్రవర్తిస్తూ, అన్నదాత సుఖీభవ కింద ఒక సంవత్సరం ఎగ్గొట్టి,ప్రస్తుతం 20,000 ఇస్తామనిచెప్పి, 17000కు కుదించి ఇస్తూ ఇదే రైతుల అన్ని సమస్యలకు పరిష్కారం అని అరచేయిని చూపించి మోచేతిని నాకిస్తున్నది.   2025-26 ఖరీఫ్ లో అతివృష్టి,అనావృష్టితో రైతులు ఆర్ధిక సంక్షోభంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు.     పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కు తున్నారు, పొలం లోనే పంటను వదిలేస్తున్నారు. అన్న దాతల కష్టాలను తీర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం ఏ మాత్రం చేయడం లేదు.       ఖరీఫ్ లో రాయలసీమ లో ప్రధాన పంట వేరుశనగ సాగు సంక్షోభం, ఉల్లి,సజ్జ,మొక్కజొన్న,పత్తి, అమ్మకాలు సంక్షోభం.    రాయల సీమ హార్టికల్చర్ హబ్.పండ్లు,కూరగాయలు,పూల ఉత్పత్తిలో అగ్రస్తానం.    రాష్ట్రం మొత్తం అన్ని రకాల పండ్ల ఉత్పత్తి 213 లక్షల టన్నులు అయితే,ఇందులో అరటి ఒక్కటే 74లక్షల టన్నులు.ఇందులో ప్రధాన ఉత్పత్తి రాయల సీమ జిల్లాలలోనే.ప్రత్యేకంగా G 9 అరటి ఉత్పత...

గజ లక్ష్మీ వాహన సేవలో అమ్మవారు.. కరణం వెంకటేశ్వర ప్రసాద్ తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత తిరుమల శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతటి వైభవోపేతమైనవో, తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి జరిగే ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు కూడా అంతే సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. 1. అమ్మవారి అవతరణోత్సవం: పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో శుక్ల పక్ష పంచమి తిథినాడు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పద్మావతి అమ్మవారు తిరుచానూరులోని "పద్మ సరోవరం"లో బంగారు తామర పువ్వు (Golden Lotus) నుండి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 2. ధ్వజారోహణంతో ప్రారంభం: ఉత్సవాలు "ధ్వజారోహణం"తో మొదలవుతాయి. అమ్మవారి వాహనమైన ఏనుగు బొమ్మతో కూడిన జెండాను (Gaja Dhwajam) ఎగురవేసి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. ఫోటోలలోని విశేషం: గజ వాహన సేవ (Gaja Vahanam) బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి జరిగే గజవాహన సేవ ఇది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాహన సేవ. * గజలక్ష్మి స్వరూపం: ఏనుగు ఐశ్వర్యానికి, రాజసానికి ప్రతీక. పాలసముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దిగ్గజాలు (ఏనుగులు) ఆమెను అభిషేకించాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అమ్మవారు ఈ వాహనంపై "గజలక్ష్మి" అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. * విశేష అలంకరణ: అమ్మవారు బంగారు ఆభరణాలు, భారీ పుష్పమాలికలు, ముఖ్యంగా కాసుల పేరు వంటి విశేష ఆభరణాలతో అలంకరించబడి ఉన్నారు. * బంగారు ఏనుగు: అమ్మవారు అధిరోహించిన ఏనుగు వాహనం పూర్తిగా బంగారు తొడుగుతో (Gold Plated) చేయబడి ఉంటుంది. ఇది భక్తుల జీవితాల్లో సిరిసంపదలను అనుగ్రహించే అమ్మవారి తత్వాన్ని సూచిస్తుంది. బ్రహ్మోత్సవాలలోని ఇతర ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజుల ఉత్సవాల్లో ఒక్కో రోజు అమ్మవారు ఒక్కో వాహనంపై విహరిస్తారు: * చిన్న శేష వాహనం & పెద్ద శేష వాహనం: ఆదిశేషునిపై విహారం. * హంస వాహనం: అమ్మవారు జ్ఞానానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి రూపంలో దర్శనమిస్తారు. * ముత్యపు పందిరి వాహనం: చల్లని వెన్నెల కురిపించే ముత్యాల పందిరిలో విహారం. * సింహ వాహనం: దుష్ట శిక్షణ కోసం అమ్మవారు శక్తి స్వరూపిణిగా సింహంపై వస్తారు. * గరుడ వాహనం: ఇది చాలా విశేషం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడిపై లక్ష్మీదేవి ఊరేగడం, ఆమె సర్వస్వతంత్రురాలు అని చాటిచెప్పే అద్భుత ఘట్టం. * రథోత్సవం: ఎనిమిదవ రోజు అమ్మవారు రథంపై ఊరేగుతారు. పంచమి తీర్థం (ఉత్సవాల ముగింపు) ఈ బ్రహ్మోత్సవాలన్నింటిలోనూ అత్యంత పవిత్రమైనది చివరి రోజైన "పంచమి తీర్థం". * ఈ రోజున తిరుమల నుండి శ్రీవారు పంపిన పసుపు, కుంకుమ, చీర, సారెలను గజవాహనంపై తీసుకువస్తారు. * ఆ సమయంలో పద్మ సరోవరంలో చక్రస్నానం (Holy Bath) ఆచరిస్తారు. * ఈ ముహూర్తంలో పద్మ సరోవరంలో మునిగితే సాక్షాత్తు ఆ అమ్మవారి కటాక్షం లభిస్తుందని కోట్లాది భక్తుల నమ్మకం. దీనిని "దక్షిణ కుంభమేళా" అని కూడా పిలుస్తారని తిరుపతి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రధాన పూజారి కరణం వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు.

  తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యత తిరుమల శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతటి వైభవోపేతమైనవో, తిరుచానూరులో పద్మావతి అమ్మవారికి జరిగే ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు కూడా అంతే సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. 1 . అమ్మవారి అవతరణోత్సవం: పురాణాల ప్రకారం, కార్తీక మాసంలో శుక్ల పక్ష పంచమి తిథినాడు, ఉత్తరాషాఢ నక్షత్రంలో పద్మావతి అమ్మవారు తిరుచానూరులోని "పద్మ సరోవరం"లో బంగారు తామర పువ్వు (Golden Lotus) నుండి అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 2. ధ్వజారోహణంతో ప్రారంభం: ఉత్సవాలు "ధ్వజారోహణం"తో మొదలవుతాయి. అమ్మవారి వాహనమైన ఏనుగు బొమ్మతో కూడిన జెండాను (Gaja Dhwajam) ఎగురవేసి సకల దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తారు. ఫోటోలలోని విశేషం: గజ వాహన సేవ (Gaja Vahanam)  బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి జరిగే గజవాహన సేవ ఇది అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వాహన సేవ.   గజలక్ష్మి స్వరూపం: ఏనుగు ఐశ్వర్యానికి, రాజసానికి ప్రతీక. పాలసముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు దిగ్గజాలు (ఏనుగులు) ఆమెను అభిషేకించాయని పురాణాలు చ...

సిఐ . శంకరయ్య డిస్మిస్

  కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్  కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్   కర్నూల్. కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వుల మేరకు కర్నూలు వి ఆర్ లో ఉన్న సిఐ జె. శంకరయ్యను క్రమశిక్షణ చర్యల నిమిత్తం పోలీస్ శాఖ సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు.

సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల మాయం?

  • విచారణ స్టేట్‌మెంట్ కనిపించడం లేదని సమాధానం • ఆర్టీఐ ద్వారా అడిగితే అంతుచిక్కని వ్యవహారం • అధికారుల తీరుపై బాధితురాలు కోమటిరెడ్డి కోటేశ్వరి ఆవేదన • ఎంరో, వీఆర్వోలపై కుట్ర ఆరోపణలు.. ఉన్నతాధికారులు విచారణ జరపాలని విజ్ఞప్తి ( సింగరాయకొండ - ప్రతినిధి): సామాన్యులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లోనే కీలక పత్రాలు మాయమవుతున్నాయా? విచారణలో వాస్తవాలు వెలుగుచూసినా, ఆ పత్రాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారా? అంటే అవుననే ఆరోపిస్తున్నారు బాధితురాలు కోమటిరెడ్డి కోటేశ్వరి (స్వాతి). సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అసలేం జరిగిందంటే.. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయకొండ పరిధిలోని సర్వే నెంబర్ 338/3 లోని 14 సెంట్ల భూమికి సంబంధించి గతంలో వివాదం నెలకొంది. దీనిపై 03/07/2023 నాడు అప్పటి ఎమ్మార్వో ఉష గారి సమక్షంలో విచారణ జరిగింది. ఈ విచారణకు కోమటిరెడ్డి కోటేశ్వరి మరియు ప్రతివాది మన్నం రంగారావు హాజరయ్యారు. ఆ రోజు జరిగిన విచారణలో తమ వాంగ్మూలాలను (Statements) రికార్డు చేశారని, ఆ భూమి కోటేశ్వరి వాళ్ళ నాన్నగారిదే అని స్పష్టమైందని, ఇదే ...

జెమ్మి చెట్టు ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారడం బాధాకరం

  ఉరవకొండ దసరా పండుగ నాడు భక్తిశ్రద్ధలతో పూజించే పవిత్రమైన జమ్మి చెట్టు ప్రాంతం, ఇలా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడం నిజంగా బాధాకరం. మన సంస్కృతిలో జమ్మి చెట్టుకు ఉన్న విశిష్టతను మరిచిపోయి ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం.  పవిత్రతకు భంగం: విజయదశమి నాడు సకల విజయాలు కలగాలని పూజించే దివ్యమైన స్థలం అది. అటువంటి చోట మందు సీసాలు, చెత్తాచెదారం వేయడం ఆ ప్రాంత పవిత్రతను దెబ్బతీస్తోంది.  సామాన్యులకు ఇబ్బంది: తాగుబోతుల సంచారం వల్ల సాయంత్రం వేళల్లో ఆ ప్రాంతానికి వెళ్లాలంటేనే సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది.   నిఘా లోపం: ఇది బహిరంగ ప్రదేశం అయినప్పటికీ, సరైన పోలీసు నిఘా లేకపోవడం వల్లనే వారు ఇలా రెచ్చిపోతున్నారు. సివిల్ పోలీసులు మరియు స్థానిక యంత్రాంగం ఈ క్రింది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది:   నిరంతర గస్తీ ముఖ్యంగా సాయంత్రం మరియు రాత్రి వేళల్లో జమ్మి చెట్టు ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాలు తిరగాలి.  హెచ్చరిక బోర్డులు: "ఇది పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ మద్యం సేవించడం నేరం" అని స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలి.  కఠిన చర్యలు: బహ...

డీ హెచ్ 256 వేరుశనగ సాగు తో అధిక దిగుబడి.

  ఉరవకొండ   డిహెచ్ 256 వేరుశనగ నూతరకాన్ని ఉరవకొండ నియోజకవర్గం లో యువ రైతు దంపతులు (రఘు అంబిక) ఖరీఫ్ సీజన్లో ఒకటి 1.5 ఎకరాలలో నల్లరేగిడి పొలంలో డిహెచ్256 వేరుశనగ విత్తనాలను ప్రయోగపూర్వకంగా సాగు చేశారు, దీనితో అధిక దిగుబడి వచ్చింది.ఈ సీజన్లు విపరీత వర్షాలు వచ్చినప్పటికీ మంచి నాణ్యతతో కూడిన 60 నుంచి 70 బస్తాలు వేరుశనగ కాయలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు దంపతులు తెలియజేశారు. తక్కువ విత్తనం మోతాదు, తెగుళ్లు, పురుగులను & దోమలను సమర్థవంతంగా తట్టుకునే సామర్థ్యం ఉండటం, ప్రక్క కు కొమ్మలు అధికంగా రావడం, ఎక్కువ కాయలు కాయటం, ఆకు దిగుబడి అంటే పొట్టు కూడా ఎక్కువ గా రావటం చేత రైతులoదరికీ లాభ సాటిగా ఉంటుందనితెలిపారు. డిహెచ్256 వేరుశనగ లక్షణాలు ఈ విధంగా ఉంటాయని తెలియజేశారు* *DH-256 యొక్క ముఖ్య లక్షణాలు*: *ఆరిజిన్: వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయం (యుఎఎస్), ధార్వాడ వేరుశనగ పరిశోధన కేంద్రం చేత అభివృద్ధి చేయబడిన స్పానిష్ బంచ్ వేరుశనగ రకం DH-256, ఈ వేరుశనగరకం తుప్పు తెగులు మరియు సర్క్కోస్ఫర ఆకుమచ్చ తగులను తట్టుకోవటంలో ప్రసిద్ది చెందింది మరియు స్పోడోప్టెరా, త్రిప్స్ మరియు లీఫ్‌హాపర్స...

ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు

  ఏపీ 'ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. కాగా, 2024 ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

66సంవత్సరాల మెడికల్ కాలేజీలు లీజు వద్దు.. మెడికల్ కాలేజీలు ముద్దు

 17 మెడికల్ కళాశాలలు 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి   రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంలో ఉన్న17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి అనుమతితో నిధులు సమకూర్చింది,ఈ కళాశాలను ఏర్పాటు చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల వైద్య విద్యను దగ్గర చేస్తున్నామని చెప్పి చెప్పి ఈరోజు ప్రభుత్వం మారగానే వైద్య విద్యను దూరం చేసే విధంగా107,108,590 జీవోను తీసుకొచ్చాయని, మా ప్రభుత్వం వైద్య విద్యార్థులకు అండగా నిలుస్తుందని లోకేష్ బాబు తన యువగలం పాదయాత్రలో వైద్య విద్యార్థులందరికీ సమాన విద్యను అందిస్తామని ఉచిత విద్యను అందిస్తామని ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలలకు సంబంధించి 1800 మెడికల్ సీట్లు రద్దు చేయమని కూటమి ప్రభుత్వం జాతీయ మెడికల్ కౌన్సిల్ లకు లేఖ రాయడం చాలా దుర్మార్గం 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించుటకు నాలుగు కళాశా లలు సిద్ధంగా ఉన్నాయి ఆ కళాశాలల...

అనంతపురం జిల్లా ఎల్డిఎం కి ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి.

   జిల్లాలో దేవాదాయ భూములు సాగు చేస్తున్న సిసిఆర్సి ఉన్న కౌలు రైతులకు పంట రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు విడపనకల్లు ఉరవకొండ మండలాల్లోని దేవాదాయ భూములు సాగు చేస్తున్న కౌలు రైతులకు గత డిసెంబర్ నాటికి వ్యవసాయ అధికారులు పంపిన కౌలు రైతుల జాబితాలో బ్యాంకు అధికారులు టేబుల్ మీద ఉన్నాయి తప్ప పరిశీలించడం కానీ సర్వే చేయడం గాని లేదు ఈ సంవత్సరం కూడా ఒక కౌర రైతుకి పంట రుణం అందే పరిస్థితి లేదు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణం ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి కౌలురై ఎకరాకు 5000 నుండి 30 వేల వరకు ముందస్తు కౌలు చెల్లించి మిర్చి పంటకు ఎకరా పంటకు లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెట్టి బయట అప్పులు చేసి వడ్డీలు కడుతూ ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు ప్రభుత్వము రాష్ట్ర, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో కౌలు రైతులకు రుణాల ప్రతిపాదన తెస్తున్నారు తప్ప జిల్లా, స్థానిక బ్యాంక్,వ్యవసాయ అధికారులు కౌలు రైతుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు కనీసం కౌలు రైతుల సమాచారం ఆధార్, బ్యా...

దర్గా హోన్నూరు నుండి ఉరవకొండ కు కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలి*

ఉరవకొండ::   దర్గా హోన్నూరు నుండి ఉరవకొండ పట్టణానికి విద్యాభ్యాసం చేయడానికి విద్యార్థులు రాకపోకలకు బస్సు సౌకర్యం కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఉరవకొండ డిపో మేనేజర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కోశాధికారి రాజు మాట్లాడుతూ దర్గా హోన్నూరు, గోవిందవాడ, కలవెల్లి తిప్ప, పాల్తూరు తదితర గ్రామాల నుండి విద్యార్థులు విద్యాభ్యాస కోసం ఉరవకొండ పట్టణానికి వస్తుండటంతో బస్సు సౌకర్యం సరిగ్గా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. విద్యార్థులు వెళ్లే బస్సులో అదే ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా ప్రయాణిస్తుండడంతో విద్యార్థులకు కనీసం నిలబడి ప్రయాణించడానికి కూడా వీలు లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు నిన్నటి రోజున ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి ఉరవకొండ డిపో మేనేజర్ గారికి వారం రోజులలోపు ఉరవకొండ నుంచి దర్గా హాన్నూరు కి విద్యార్థులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది.కావున డిపో మేనేజ...

ప్రజా దర్బార్ లో బెస్త సేవా సంఘం విజ్ఞాపన పత్రం!

      తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ గారు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో అనంతపురం నగరం, ఆదర్శనగర్ లో బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గంగపుత్ర కమ్యూనిటీ హాలు,మరియు గంగమ్మ& పోలేరమ్మ దేవాలయాల సముదాయానికి ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎంపీ నిధులు ఇప్పించడం కోసం ఎంపీ గారికి సిఫార్సు చేయాలని,అలాగే వేదాలకు మూలపురుషుడైన గంగపుత్రుడు వేదవ్యాస మహర్షి విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వెంటనే ఎంపీ నిధుల కోసం ఎంపీ గారికి లెటర్ పంపిస్తున్నట్లు,అలాగే అనంతపురం నగరంలోని నడిమి వంక సమీపానగల గంగమ్మ గుడి దగ్గర వేద వ్యాసం మహర్షి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ తో అనుమతి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది.     వెంటనే బెస్త సంఘం నాయకులు సదర స్థలాన్ని పరిశీలించి ఇంజనీర్ తో అంచనాలు తయారు చేయించి,భూమి పూజ చేయాలని నిర్ణయించడం జరిగింది.       ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కేవీ రమణ,ఉపాధ్యక్షులు గంగప్ప,వర్కింగ్ ప్రెసిడెంట్ హ...