ఉరవకొండ: కర్నూలు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర బీ జే పీ సీనియర్ నేత దగ్గుపాటి శ్రీ రామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని విడుదల ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులను ఆదుకోవాలి ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రి తమ సానుభూతిని తెలియజేశారు. "బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే ఆయన దేశ ప్రధాని, రాష్ట్ర సియం ద్రుష్టి కి తీసుకెళ్లి నట్లు తెలిపారు. ఏపీ వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని కోరగా,అధికారులను ఆదేశించినట్లు బిజెపి నేత దగ్గుపాటి శ్రీ రామ్ వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
Local to international