Skip to main content

Posts

Showing posts from October 20, 2025

​ఉరవకొండ నియోజకవర్గానికి రూ. 7.40 కోట్ల తాగునీటి ప్రాజెక్టు: రేపు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభోత్సవం

  ఉరవకొండ అక్టోబర్ 21: ​అనంతపురం జిల్లా, ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్టుకు రేపు (అక్టోబర్ 22, 2025, బుధవారం) అంకురార్పణ జరగనుంది. మొత్తం రూ. 7.40 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన నూతన పైప్‌లైన్ల నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ​ఈ ప్రాజెక్టు ద్వారా హవళిగి, పాల్తూరు, జి.మల్లాపురం, కరకముక్కల, చీకలగుర్కి, ఉండబండ, విడపనకల్ సహా పలు ఇతర గ్రామాలలో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటి సౌకర్యం అందుబాటులోకి రానుంది. ​మంత్రి కార్యక్రమ వివరాలు ఇలా ఉన్నాయి: ​తేదీ: అక్టోబర్ 22, 2025 (బుధవారం) ​ఉదయం 10:00 గంటలకు: హవళిగి గ్రామంలో ప్రారంభోత్సవం. ​మధ్యాహ్నం 2:00 గంటలకు: పాల్తూరు గ్రామంలో ప్రారంభోత్సవం. ​నియోజకవర్గ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చే ఈ కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.

సొగసరి.... పెన్నోబిలం జలసిరి

  ఉరవకొండ అక్టోబర్ 21: సుప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆవరణంలో జలపాత హొయలు యాత్రికులకు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి పెన్నో బిలం అనగానే అటు ఆధ్యాత్మిక క్షేత్రం ఇటు ప్రకృతి రమణీయతకు కేంద్ర బిందువు.  లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలగోపురానికి దిగువన ఉన్న జలపాతాలు వంపు సొంపులతో వయ్యారంగా నిండుగా ప్రవహిస్తుంది.  చెట్టు చేమల గుండా తుంగభద్ర నీరు ప్రవహిస్తుంది. జలపాత హోయలు తిలకించడానికి జిల్లా నలుమూలనుంచి భక్తులు, పర్యటకులు వస్తూ ప్రకృతి అందచందాలను ఆస్వాదిస్తున్నారు పెన్నోబులంలో రెండు జలపాతాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. జలపాతాల చుట్టూ ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి.జలపాత ప్రాంతంలో నీటి అందాలను తిలకించే క్రమంలో కాలుజారి పడి భక్తులు,పర్యాటకాలు మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి.  బుగ్గన కోనేరు నిండిపోయింది: బసవుడి నోటి నుంచి చెట్లు చేమల మధ్య నుంచి నీరు వస్తుంది ఇది పెన్నోబిలానికి అత్యంత ఆకర్షణ.  బ్రిడ్జి ప్రాంతంలో నీరు పరవళ్ళు తొక్కుతోంది ఇక్కడ గంగాదేవి ఆలయం ఉంది భక్తులు పర్యాటకులు  నదిస్నానాలు...

ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించిన సీఎం చంద్రబాబు

1 డీఎ ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించాం. నవంబరు 1వ తేదీ నుంచి అమలు అయ్యేలా డీఏ చెల్లింపు. రూ160 కోట్ల వ్యయం అవుతుంది పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేస్తాం* రూ.210 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తాం 60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైమ్ లో ఆరోగ్య పరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం. చైల్డ్ కేర్ లీవ్స్ వినియోగంలో వయోపరిమితి లేదు ఈ లీవ్ లను ఉద్యోగ విరమణ వరకూ వినియోగించుకునే వెసులుబాటు కల్పించాం ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు క్లియర్ చేస్తాం ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తాo.

ఇదేం దుస్థితి.. ట్రైన్ టికెట్ కోసం 2KM క్యూ

  గుజరాత్ గుజరాతకు వలసవచ్చిన UP, బిహార్ రాష్ట్రాల కార్మికులు దీపావళి సందర్భంగా సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో నిన్న సూరత్లోని ఉద్నా రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. టికెట్ల కోసం ఏకంగా రెండు కిలోమీటర్ల మేర క్యూ ఏర్పడింది. రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వేలాదిగా వచ్చినవారిని అధికారులు అదుపు చేయలేకపోయారు~£

ఎన్నికల వేళ.. డ్రై స్టేట్‌ బిహార్‌లో రూ.23 కోట్ల మద్యం సీజ్‌

 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల (Bihar Polls) షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు.

పశ్చిమ రాయలసీమ విష్ యు భూమిరెడ్డి గోపాల్ రెడ్డికి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఉపాధ్యాయ సంఘం

 పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన కలిసి వారికి వారి కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు వేల్పుల రామాంజనేయ ప్రసాద్, రాష్ట్ర సేవా ప్రముఖ్ ఎరుకల రెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, చక్రాయపేట మండల కోశాధికారి మల్లేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారితో మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరియు గౌరవ ముఖ్యమంత్రి వారితో కలిసి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.తదనంతరం డిఎ మంజూరు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆరియర్స్ ను రిటైర్మెంట్ తర్వాత ఇవ్వడం అనేది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగిస్తున్నదని గతంలో లాగా ప్రావిడెంట్ ఫండ్ జమ చేసేలా చూడవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే మెమో 57ను అమలు చేయాలని, సిపిఎస్ ఎంప్లాయిస్ కి గతంలో చెల్లించవలసిన డిఏ బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని, బదిలీ అయి రిలీవర్ రాక రిలీవ్ కాలేనటువంటి ఉ...

సముద్రంలో పడిపోయిన విమానం

  అక్టోబర్20 హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. తుర్కియేకు చెందిన బోయింగ్ 747 కార్గో విమానం దుబాయ్ నుంచి వస్తూ ల్యాండ్ అవుతుండగా స్కిడ్ అయి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. విమానంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం సహయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఒక్క ఛాన్స్ ప్లీజ్.-కరెంట్ గోపాల్

గుంతకల్ అక్టోబర్ 20: పోలీస్ అమరవీరుల త్యాగాలను కొనియాడే ఒక్క అవకాశం కల్పించాలని కరెంట్ గోపాల్,, గుంతకల్ డివిజనల్ పోలీసు అధికారిని కోరారు. ఆయన పేరు గోపాల్. ఇంటిపేరు ఉక్కీసుల. ఉక్కీసుల గోపాల్ అంటే ప్రజలు గుర్తుపట్టరు కానీ ఆయనను కరెంట్ గోపాల్ అని పిలిస్తే ప్రజలు ఇట్టే గుర్తుపడతారు. ఉక్కీసుల గోపాల్ అలియాస్ కరెంటు గోపాల్ అంటే కరెక్ట్ గోపాల్ అనే పేరు అయన సంపాదించుకున్నారు.  వృత్తి రీత్యా ఆయన గ్రామపంచాయతీలో సీనియర్ ఎలక్ట్రీషియన్ గా ఎలాంటి అరమరికలు లేకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ అందరి మెప్పు పొందారు.  ప్రవృత్తి రీత్యా ఆయనలో దేశభక్తి భావనలు అణువు అణువులో నిండిపోయాయి.  దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన దేశ నాయకుల, రాష్ట్ర నాయకుల చరిత్రలు ఆయనకు కొట్టిన పిండి. వారి జయంతోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ప్రజలకు వివరించి వారిలో దేశభక్తి భావనలు పెంపొందిస్తున్నారు.  ఈ క్రమంలో ఆయన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు సేవలను కొనియాడే అవకాశం కోసం తహతహలాడిపోయారు. దీంతో గుంతకల్ పోలీస్ డివిజన్ అధికారి శ్రీనివాసులను సోమవారం కలిసి పోలీసు సేవలను కొనియాడే ఒక...

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

  తిరుమల, 2025 అక్టోబర్ 20: తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది.  ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు.  ఇందులో భాగంగా, శ్రీ మలయప్పస్వామి,శ్రీ-భూ అమ్మవార్లు, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి ,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పార మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలను అర్చకస్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు.   నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు మరియు దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తి అయినది.  అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు.

​ట్రంప్ దిష్టిబొమ్మ దహనం: వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల పెంపునకు నిరసన

  ​ఉరవకొండ: అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు, ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం పెంచిన సుంకాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీపావళి సందర్భంగా నరకాసుర వధ స్థానంలో ట్రంప్ విధించిన సుంకాలను నిరసిస్తూ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. ​ఈ నిరసనలో భాగంగా, ఉరవకొండ మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ ఫ్లెక్సీని దహనం చేసి తీవ్ర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్నాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ రంగం, పాడి, ఎగుమతి చేసే ఉత్పత్తులపై 11 నుంచి 50% వరకు ట్రంప్ విధించిన సుంకాల కారణంగా దేశీయ వ్యవసాయ రంగం దివాళా తీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల వ్యవసాయ కార్మికులు పని దినాలు కోల్పోయి, పెద్ద ఎత్తున వలసలు పోవాల్సి వస్తుందని తెలిపారు. భారతదేశ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే విధానాలు అవలంబిస్తున్న అమెరికా సామ్రాజ్యవాదాన్ని కేంద్రంలో...