Skip to main content

Posts

Showing posts from September 26, 2025

ఏపీ 108 అంబులెన్స్ సర్వీసెస్‌లో EMT, డ్రైవర్ల నియామకాలు

విజయవాడ, సెప్టెంబర్ 27: రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీసెస్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం, EMT పోస్టులకు B.Sc Nursing, GNM, B.Sc Life Sciences, B.Sc Physiotherapy, B.Sc/M.Sc EMT అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ (TR) మరియు కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. ఈ పోస్టులకు కూడా గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 29, 30 తేదీల్లో విజయవాడలోని మంగళరావుపేటలో ఉన్న భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, PMD బ్రాంచ్ ఆఫీస్ (మెగాసిటీ ప్లాజా సమీపంలో) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికేట్లు, ...

చేనేతల చూపు. ప్రత్యమ్నాయం వైపు

 నేతన్నకు నిరాధారణ - పట్టు కోల్పోతున్న చేనేత - జీఎస్టీ గుదిబండగా మారిన వైనం - అమలు కానీ చేనేత1985 రిజర్వేషన్ చట్టం. - చేనేత పై పవర్ లూమ్స్.  ఆధిపత్యం - పవర్ లూమ్స్ కార్మికునికి తప్పని కష్టాలు.  - చేనేత వస్త్రాల తయారీపై 30% రాయితీ ఇవ్వాలి. దశాబ్దాలకు పైగా ఆడిన మగ్గం నేడు మూలాన పడింది. హరివిల్లు లాంటి అందమైన పట్టు చీరను తయారుచేసే నేతన్న కష్టాల కడలిలో పడ్డాడు. వ్యవసాయం తర్వాత అత్యధికమంది జీవనం సాగిస్తున్న చేనేతపై పాలకుల చిన్నచూపు కొనసాగడంతో ఈ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు వేల మందికి ఉపాధినిచ్చిన చేనేత నేడు దాని ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది.  చిన్న చూపు అధికారుల నిర్లక్ష్యం వెరసి నేతన్న వృత్తికి దూరమవుతున్నాడు.  ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చే పార్టీల నాయకులు ఆ తర్వాత వాటిలో పది శాతం కూడా అమలు చేయడం లేదు..  కొత్తవి అమలు చేయకపోగా పాత వాటిని రద్దు చేయడంతో కార్మికులు ప్రభుత్వ సహాయానికి దూరం అవుతున్నారు.ఉన్న కష్టాలకు తోడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం పట్టు చీరల వ్యాపారాలపై జీఎస్టీ విధించటంతో చేనేత రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. మూలిగే నక్కపై తాటి...

ముక్త్యాల రాజా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి మూల పురుషుడు.

   - నల్గొండ,ఖమ్మం,గుంటూరు కృష్ణాజిల్లా ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కోసం వేల ఎకరాలు భూమి దానం,చేశారు. ఆరోజుల్లోనే లక్షలాదిà రూపాయలు ప్రాజెక్టు కోసం సహాయం చేసి, ప్రాజెక్టు నిర్మాణానికి కీలకపాత్ర వహించిన రాజా వారికి ఘన నివాళులర్పించారు.. పల్నాడు ప్రజలందరు రాజా గారికి ఋణపడి ఉన్నారు..  హృదయంలో ఆయనను దేవునిగా కొలుస్తారు.  నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంకు మూలం  ఆ మహానుభావుడే.ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా నల్లగొండ, గుంటూరు, ఖమ్మం, కృష్ణా జిల్లాల లో ప్రజలు ఈ రోజు సుభిక్షం గా పాడి పంటల తో ఉన్నారంటే వారే కారణం,వంశ పారం పర్యంగా వచ్చిన రాజరికంతో తృప్తి చెందలేదు. ప్రజలకు పది కాలాలు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో, తన సొంత ఖర్చులతో వూరు వూరు తిరిగి రైతులను చైతన్యం చేసి కృష్ణా ఫార్మర్స్ సొసైటీ ని స్థాపించి నాగార్జున సాగర్ వద్ద( నంది కొండ వద్ద ) ఆనకట్ట కడితే బహుళార్ధసాధకంకా ఉపయోగపడి ఆనీటితో పంటలు పండించుకుని కరువులు దూరం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి అయి తెలుగునేల అన్నపూర్ణగా, భారత దేశ ధాన్యగారంగా మారుతుందని తలంచి, అనకట్టలు ఆధునిక డేవాలయాలని భావిం...

విజయవాడ దుర్గగుడి ధర్మకర్తల మండలిలో 16 మంది కొత్త సభ్యుల నియామకం

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం) ధర్మకర్తల మండలి పునర్‌వ్యవస్థీకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 16 మందిని సభ్యులుగా ఎంపిక చేస్తూ జాబితాను ఖరారు చేసింది. ఇందులో తెలుగు దేశం పార్టీకి అత్యధికంగా 11 స్థానాలు, జనసేన పార్టీకి మూడు, భారతీయ జనతా పార్టీకి రెండు స్థానాలు కేటాయించబడ్డాయి. అదనంగా ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడకు చెందిన మార్తి రమాబ్రహ్మం, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్లను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే పోరంకి ప్రాంతానికి చెందిన బొర్రా రాధాకృష్ణను ఆలయ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకటించిన జాబితాతో ధర్మకర్తల మండలి పూర్తయింది. ఈ నియామకాలు ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పనులపై ప్రభావం చూపనున్నాయి. మండలి సభ్యుల జాబితా: విజయవాడ వెస్ట్ నుంచి అవ్వారు శ్రీనివాసరావు (బీజేపీ), విజయవాడ సెంట్రల్ నుంచి బడేటి ధర్మారావు (టీడీపీ), మైలవరం నుంచి గూడపాటి వెంటక సరోజినీ దేవి (టీడీపీ), రేపల్లె నుంచి జీవీ నాగేశ్వర్ రావు (టీడీపీ), హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ (టీడీపీ తెలంగాణ), తాడ...

ఎస్టిఐ రమణమ్మా.. నీ ఈ సడింపు చర్యలు మానమ్మా!

 ​.కొందరికి మోదం.. అందరికీ ఖేదం. -​ఉరవకొండ డిపో ఉద్యోగుల సమస్యలపై   డిపో మేనేజర్, ఎస్ టి ఐ చర్యలతో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఒకరివి ఒంటెత్తు పోకడలైతే, మరొకరి విసడింపు చర్యలతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. డిపో మేనేజర్ చర్యలు అందరి ప్రయోజనాలకు కాకుండా కొందరికి మాత్రమే మేలు చేకూరేలా ఉందనే విమర్శలు వెళ్ళుతున్నాయి. ఇది ఇలా ఉంటే రమణమ్మ పరిస్థితి నేటి యొక్క ఒకనాటి కోడలు అన్న చందంగా మారింది. కండక్టర్ స్థాయి నుంచి ఎస్ టి ఐ స్థాయికి ఎదిగిన ఆమె సిబ్బంది పట్ల బూతులు వల్లించడం ఉద్యోగస్తులకు మింగుడు పడటం లేదు. ఆమెన్ పై అనేక అవినీతి ఆరోపణలు రాత మూలకంగా ఫిర్యాదు చేసిన అవి బుట్ట దాఖలు కావటం హాట్ టాపిక్ గా మారింది. మేం ఇంతే మారం అంతే అన్న చందంగా ఇరువురి పరిస్థితులతో సిబ్బంది తలబాదుకుంటున్నారు. ​ఉరవకొండ డిపోలో ఉద్యోగులు గత కొంతకాలంగా రెండు ప్రధాన సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించమని పలుమార్లు డిపో మేనేజర్‌ను కోరినా ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్మిక పరిషత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ​1. డిజిటల్...

కావలి ఎమ్మెల్యేను సైబర్ నేరగాళ్లు బలి చేసుకున్నారు

సైబర్ మోసగాళ్ల బారిన సామాన్యులు మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా చిక్కుకుంటున్నారు. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి సైబర్ నేరగాళ్లకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 22న ఎమ్మెల్యే వ్యక్తిగత వాట్సప్ నంబర్‌కు ఆర్టీఏ బకాయిలు చెల్లించాలంటూ ఓ లింకు వచ్చింది. తన కంపెనీ వాహనాలకు సంబంధించిన బకాయిలుగా భావించిన ఆయన ఆ లింక్‌పై క్లిక్ చేశారు. వెంటనే ఆయన సిమ్ బ్లాక్ అయ్యింది. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఆధార్ విజిలెన్స్ విభాగం దృష్టికి తీసుకెళ్లారు. 25 రోజుల తరువాత సిమ్ మళ్లీ యాక్టివ్ అయింది. అయితే, ఆ కాలంలోనే ఎమ్మెల్యేకు చెందిన రెండు యాక్సిస్ బ్యాంక్ ఖాతాల నుంచి యూపీఐ లావాదేవీల రూపంలో మొత్తంగా రూ.23,16,009 నగదు మాయం అయినట్లు కంపెనీ సిబ్బంది గమనించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 16 వరకు దశల వారీగా డబ్బు డెబిట్ అయినట్లు ఆలస్యంగా తెలిసింది. దీంతో అసలు విషయం బయటపడింది. సైబర్ నేరగాళ్లు ఈ దందా వెనుక ఉన్నారని గ్రహించిన ఎమ్మెల్యే, వెంటనే కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ...

ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

 Uravakonda ​ ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు-ఉరవకొండ-తుమకూరు మరియు గుంతకల్లు-కళ్యాణదుర్గం-మడకశిర-మధుగిరి రైలు మార్గాల నిర్మాణానికి వారు డిమాండ్ చేశారు. ​ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రైలు మార్గాలు అత్యంత అవసరమన్నారు  ఈ నేపథ్యంలో, గుంతకల్లు నుండి ఉరవకొండ మీదుగా కర్ణాటకలోని తుమకూరు వరకు బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మించాలని కేశవ్ నాయక్, లాలెప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్థికమంత్రులను వారు డిమాండ్ చేశారు. ​అదేవిధంగా, గుంతకల్లు నుండి కళ్యాణదుర్గం, మడకశిర మీదుగా కర్ణాటకలోని మధుగిరి వరకు మరో రైలు మార్గాన్ని కూడా నిర్మాణ ఆవశ్యకత ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు మార్గాల నిర్మాణం ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇది ఉరవకొండ నియోజకవర్గంతో పాటు వందలాది గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వ్యాపార, వ...

మత సామరస్యానికి ప్రతీక: జైనబ్బీ దర్గా

 సీతమ్మ వారి అంశగా హిందువుల నమ్మకం. ఉరవకొండలో ఉన్న జైనబ్బీ దర్గా హిందూ-ముస్లిం ఐక్యతకు గొప్ప ఉదాహరణ. ఈ దర్గాని స్థానికులు పాక్ థామస్ పీరతు నీవ్రాసా హజ్రత్ బీబీ రహంతుల్లా అలైహ వారి దర్గాగా కూడా పిలుస్తారు. ఇక్కడ అన్ని మతాల ప్రజలు కలిసి ప్రార్థనలు చేస్తారు. కేవలం ఉరవకొండ నుంచే కాకుండా కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ దర్గాని సందర్శించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. జైనబ్బీ దర్గా చరిత్ర, విశిష్టత జైనబ్బీ దర్గా నిర్మాణానికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు లేనప్పటికీ, దీని గురించి ఒక ఆసక్తికరమైన కథనం స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ కథనం ప్రకారం, జైనబ్బీ అమ్మవారు కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతానికి చెందిన అపూర్వ సౌందర్యరాశి. దేశ పర్యటనలో భాగంగా ఆమె ఉరవకొండకు చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు బ్రిటిష్ సైనికులు ఆమెను దురుద్దేశంతో వెంబడించారు. వారి నుంచి తప్పించుకోవడానికి మార్గం లేక, జైనబ్బీ అమ్మవారు భూమాతను వేడుకున్నారు. దీంతో భూమి రెండుగా చీలి ఆమెను తనలోకి తీసుకుని, తిరిగి యథాస్థితికి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న సైనిక కమాండర్ అహంకారంతో ఆమెను దుర్భాషలాడగా, ఆయన దృష్టి కోల్పోయారు. ...

బార్ అసోసియేషన్ లు కూడా ఆర్టీఐ పరిది లోకి వస్తాయి- కేరళ హైకోర్టు తీర్పు

 కేరళ కేరళ రాష్ట్ర సమాచార కమిషన్ ఇటీవల రాష్ట్రంలోని బార్ అసోసియేషన్లు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని తీర్పు ఇచ్చింది [ అడ్వా. టికే సత్యనాథన్ వర్సెస్ స్టేట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, కాలికట్ బార్ అసోసియేషన్ ] ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2(హెచ్ ) కింద నిర్వచించబడిన విధంగా బార్ అసోసియేషన్‌ను 'ప్రజా అధికారం'గా పరిగణించవచ్చని రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీకుమార్ ఎస్ అభిప్రాయపడ్డారు.  సమాచార హక్కు చట్టంలోని సెక్షన్లు 2(హె చ్)(సీ), 2(హెచ్)(డి), మరియు 2(హెచ్)(ii) కేరళ అంతటా ఉన్న అన్ని బార్ అసోసియేషన్లకు వర్తిస్తాయి. అంతేకాకుండా, ఈ సంఘాలు 1961 నాటి అడ్వకేట్స్ చట్టంలోని అడ్వకేట్స్ నిబంధనల ప్రకారం మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో పనిచేస్తాయి. అందువల్ల, కేరళలోని వివిధ జిల్లాల్లోని అన్ని బార్ అసోసియేషన్లు 'ప్రజా అధికారం' నిర్వచనం కిందకు వస్తాయి" అని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాలికట్ బార్ అసోసియేషన్ రాష్ట్ర ప్రజా సమాచార అధికారి ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరిన సమాచారాన్ని అందించకపోవడంతో న్యాయవాది TK సత్యనాథన్ ఆయనపై దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఉత్తర్వు జారీ చేయబడిం...

పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ సిద్ధం

హైదరాబాద్‌: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం శిల్పారామంలో జరగనున్న *“తెలంగాణ టూరిజం కాంక్లేవ్‌ – 2025”*లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు నూతన ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు. పర్యాటక రంగంలో విస్తృతమైన అవకాశాలను సృష్టించి యువతకు ఉపాధి కల్పించడం, తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వం – ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభించనుంది. అనంతగిరి కొండల్లో వెల్‌నెస్ సెంటర్‌, వైన్ తయారీ యూనిట్‌, తాజ్ సఫారీ, వాటర్‌ఫ్రంట్ రిసార్ట్స్‌, ఫైవ్ స్టార్ హోటళ్లు, టైర్-2 నగరాల్లో జింజర్ హోటళ్లు, నాగార్జునసాగర్‌లో వెల్‌నెస్ రిట్రీట్ వంటి ప్రాజెక్టులు ముఖ్యమంత్రిచే ఆవిష్కరించబడతాయి. బౌద్ధవనాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు తైవాన్‌కు చెందిన Fo Guang Shan ముందుకు వస్తోంది. అదే విధంగా, ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్ ద్వారా సినిమా నిర్మాణాలకు సింగిల్ విండో అనుమతులు, ఏఐ ఆధారిత లొకేషన్ క్లియరెన్స్ సౌకర్యం అందించనున్నారు. వైద్య పర్యాటకాన్ని అభివృద...

తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)గా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి, ప్రస్తుతం రాష్ట్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఆయన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శివధర్ రెడ్డి తన సుదీర్ఘ సేవలో విభిన్న పదవుల్లో పనిచేశారు. ముఖ్యంగా ఇంటలిజెన్స్‌ విభాగాన్ని విజయవంతంగా నడిపిన ఆయనకు పరిపాలనా అనుభవం సమృద్ధిగా ఉంది. వ్యూహాత్మక నిర్ణయాల్లో నైపుణ్యం, క్రమశిక్షణ, నిష్పాక్షిక వైఖరితో ఆయనకు విశ్వసనీయ అధికారి అన్న పేరు లభించింది. రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, శాంతి భద్రతల పరిరక్షణలో కొత్త డీజీపీ కీలకపాత్ర పోషించనున్నారని భావిస్తున్నారు. రాష్ట్రంలోని పోలీస్‌ శాఖలో అనేక మార్పులు, సవాళ్లు ఎదురవుతున్న సమయంలో శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. నేర నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సైబర్‌ క్రైమ్‌ నివారణ, మహిళా భద్రత వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటైన తరువాత మూడో డీజీపీగా...

మణుగూరు ఎస్‌హెచ్‌ఓ లంచం ఆరోపణలపై ACB వలలో.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి మరోసారి వెలుగులోకి వచ్చింది. మణుగూరు పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తూ, అదే స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బతిని రంజిత్‌పై అవినీతి నిరోధక శాఖ (ACB) ఉచ్చు వేసింది. నోటీసుల జారీకి ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేసిన ఆరోపణలతో ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం, మణుగూరు పోలీస్‌ స్టేషన్‌లో Cr. No. 292/2025 కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఫిర్యాదుదారుని మరియు అతని సోదరుడిని BNSS చట్టంలోని సెక్షన్‌ 35(3) కింద విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత, ఎస్‌హెచ్‌ఓ రంజిత్‌ ఫిర్యాదుదారుని నుండి రూ.40,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుదారుడు దీనిపై ACBను సంప్రదించడంతో, క్రిమినల్‌ మిస్కండక్ట్‌ కేసు నమోదు చేసి అధికారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయనను వరంగల్‌లోని SPE & ACB ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు శాఖ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుని భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు స్పష్టం ...

ఉరవకొండ ఆసుపత్రిలో బాలుడి మృతి.. అధికారుల విచారణ

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాద ఘటన కలకలం రేపింది. వజ్రకరూర్ మండలం చాబాల గ్రామానికి చెందిన ఐదేళ్ల ఆహరన్ జ్వరంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు సమయానికి హాజరుకాకపోవడంతో చికిత్స ఆలస్యం అయ్యిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ లోగా బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. జిల్లా DCHS డేవిడ్ సెల్వన్ రాజు ఆసుపత్రికి చేరుకుని సిబ్బందిని ప్రశ్నించారు. తల్లిదండ్రుల వాంగ్మూలం, ఆసుపత్రి రికార్డులు, డ్యూటీ షెడ్యూల్ వంటి అంశాలను సమీక్షించారు. బాధ్యతారహిత వైఖరి ఉన్నట్లయితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు. బాలుడి మృతి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రిలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం విచారకరమని వారు మండిపడుతున్నారు.

ధనలక్ష్మీగాఅవతరించిన ఉద్భవ లక్ష్మీ

 పెన్నహోబిలం: అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని,శుక్రవారం ఉద్భవ లక్ష్మీ అమ్మవారు ధన లక్ష్మీ గా భక్తుల నీరాజనాలు అందుకొన్నారు.  ఉదయం దేవస్థానం లో అమ్మ వారికి సుప్రభాత, మేలుకొలుపు సేవలో భక్తులు తరించారు.అమ్మ వారికి కుంకుమ అర్చనలు, అభిషేక పూజలు చేశారు. అమ్మ వారిని పట్టు వస్రాల తో విశేష పుష్పాలంకరణ చేశారు.  ఉద్భవ లక్ష్మీ, ధన లక్ష్మిఅవతారం లోభక్తల, పూజలు, సేవల తో తరించారు. ఈ కార్యక్రమంలో ద్వారక నాథ ఆచార్యులు, మయూరం బాలాజీ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

వైద్యుడు నిర్లక్ష్యానికి బాలుడు మృతి

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక అహరన్ (5) అనే చిన్నారి మృతి. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి.  వైద్యం విద్య అందకా సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో.  ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి వైద్యం విద్య సామాన్య ప్రజలకు అందే విధంగా చూడాలి తన అన్న కుమారుడు మృతి చెందడంతో ఆ బాలుడి చిన్నాన్న అజయ్ ఆవేదన ఆసుపత్రి పరిస్థితి కి అద్దం పడుతోంది.*

భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

 నంద్యాల: ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి గ్రామీణ 364, పట్టణ 214 ఆర్ఓ ప్లాంట్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించి నీటి నమూనాలను ల్యాబ్ లకు పంపండి  జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా *జిల్లా ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు అన్ని ఆర్ఓ వాటర్ ప్లాంట్లు క్రమం తప్పకుండా నాణ్యతా పరీక్షలు నిర్వహించి, BIS ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్ఓ ప్లాంట్ల భద్రతా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.* ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో అధిక వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు గాను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న 364 ఆర్ఓ ప్లాంట్లు, పట్టణ ప్రాంతాలలో ఉన్న 214 ఆర్ఓ వాటర్ ప్లాంట్లలో ముమ్మర తనిఖీలు నిర్వహించి నీటి నమూనాలు సేకరించి ల్యాబ్ లకు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి త్రాగునీటిని పరీక్షించే 13 పారామీటర్లైనా క్లోరైడ్, ఫ్లోరైడ్, టర్బ...

పట్టుబడ్డ మద్యం ధ్వంసం.పలు వాహనాలు వేలాలు

ఆంధ్రా, అనంతపురం: ఉరవకొండ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు ఎక్సైజ్ కేసులలో పట్టుబడి, ప్రభుత్వానికి జప్తు అయిన ఆరు వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు. అనంతపురం అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి రేవతి ఆధ్వర్యంలో ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్‌లో ఈ వేలం జరిగింది. ఈ వేలంలో మూడు ద్విచక్ర వాహనాలను రూ. 15,800కి మరియు జీఎస్టీ రూ. 2,842కి బిడ్డర్లు కొనుగోలు చేశారు. మరో మూడు వాహనాలకు బిడ్డింగ్‌లు రాలేదు. మద్యం ప్రాపర్టీ డెస్ట్రక్షన్ అదేవిధంగా, వివిధ కేసులలో పట్టుబడిన 6.6 లీటర్ల నాటుసారా, 6.8 లీటర్ల ఎన్డీపీఎల్ (NDPL), మరియు 8.1 లీటర్ల డీపీఎల్ (DPL) ను ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎక్సైజ్ చెక్ పోస్టులు, వైన్ షాపుల తనిఖీ అనంతపురం అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శుక్రవారం విడపనకల్లు మండలం పరిధిలోని విడపనకల్లు మరియు దొనేకల్లు ఎక్సైజ్ చెక్ పోస్టులను తనిఖీ చేశారు. కర్ణాటక నుండి వచ్చే వాహనాలను కఠినంగా తనిఖీ చేసి, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలని చెక్ పోస్ట్ అధికారులు శ్రీ...

మారిన ప్రభుత్వం.. మారని అధికారుల తత్త్వం

ట్రా ఫిక్ లోఆవులతో అవస్థలు.ప్రమాదాలకు హేతువులు  -నిబంధనలకు నీళ్లు పట్టించుకోని పోలీసులు- సోమవారాలు, పండగలపూట ట్రాఫిక్ జామ్ - రోడ్డు మీదే అడ్డగోలుగా వాహనాలు పార్కింగ్మా   ట్రాఫిక్ లో ఆవులు ప్రమాదాలకు హేతువులుగా మారాయని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు వారం రోజుల క్రితం బూదగవి గ్రామ సమీపంలో అడ్డొచ్చినవో బర్రెను ఢీకొని ఓ విలేకరి మృతి చెందారు. పట్టణంలో పట్టణ శివార్లలో అడుగడుగునా ఆవులు వాహన చోదకులకు ప్రమాదహేతువులుగా మారాయి . వీటిని నియంత్రించే దిశగా తక్షణమే వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలని ప్రజలు వాహన చోదకులు కోరుతున్నారు.  ఉరవకొండ పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. నిబంధనలకు నీళ్లు వదిలిన పోలీసులు పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు సర్వత్రా వెళ్ళు వెత్తుతున్నాయి. రిక్రియేషన్ క్లబ్బు పక్కన ఓ మెకానిక్ ఏకంగా సగం రోడ్డు మీదే వాహనాలు పార్కింగ్ చేస్తూ మరమ్మత్తులు చేస్తూ ప్రధాన ప్రతిబంధం కంగా మారాడు. ఇది ప్రధాన అన్నికార్యాలయాలకు వెళ్లే రహదారి. అయితే పోలీసులు నియంత్రణ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. నిత్యం వాహన రాకపోకులకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ...

బంగారం కొనుగోలుదారుల ఆందోళన: తరుగు పేరుతో వినియోగదారుల నిలువు దోపిడీ

 ఉరవకొండ: బంగారు వ్యాపారస్తుల దోపిడీ నుండి రక్షణ కల్పించండి - తూనికల కొలతల శాఖపై పర్యవేక్షణ లోపంపై వినియోగదారుల డిమాండ్ తూనికల కొలతల (Weights and Measures) అధికారుల పర్యవేక్షణ లోపించడం వలన బంగారు వ్యాపారస్తులు వినియోగదారులను మోసం చేస్తూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి తరుగు, సొర (wastage/excess metal added) పేర్లతో వ్యాపారులు అదనంగా సొమ్ము వసూలు చేస్తూ, వినియోగదారులకు భారీ నష్టం కలిగిస్తున్నారని వారు ఫిర్యాదు చేస్తున్నారు. మోసపూరిత 'తరుగు' లెక్కలు ఇలా: బంగారు ఆభరణాలు తయారు చేయించే ప్రక్రియలో వ్యాపారులు అనుసరిస్తున్న అన్యాయమైన పద్ధతిని వినియోగదారులు వివరించారు:  * తరుగు పేరుతో అదనపు వసూలు: ఒక వినియోగదారుడు 10 గ్రాముల బంగారం కొనుగోలు చేసి, దాన్ని ఆభరణంగా మార్చమని ఇచ్చినప్పుడు, వ్యాపారులు ఒక గ్రాము 'సొర' (లేదా తరుగు) కలపాలని చెబుతారు.  * డబ్బు చెల్లింపు: వినియోగదారుడు అదనంగా కలిపిన ఆ ఒక గ్రాముకు కూడా డబ్బు చెల్లించాలి, దీంతో మొత్తం 11 గ్రాముల బంగారానికి డబ్బు కట్టినట్టు అవుతుంది.  * ఇచ్చే బంగారం 10 గ్రాములే:...

వేల్పు మడుగులో 'స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్' విజయవంతం

పెద్ద కొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వేల్పు మడుగు గ్రామంలో 'స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పీహెచ్‌సీ డాక్టర్ జయ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ తిప్పారెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు. ఎంపీహెచ్‌ఈఓ తిరుపాల నాయక్ గారు కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించగా, ఈ అభియాన్ విజయవంతమైంది. మహిళా ఆరోగ్యం, అభ్యున్నతే లక్ష్యం ఈ సందర్భంగా డాక్టర్ జయ కుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిస్థితులు, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మహిళలకు విస్తృతంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా:  * ఎన్‌సీడీ (దీర్ఘకాలిక వ్యాధులు): దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సకాలంలో చికిత్స అందించి, వ్యాధిని నయం చేయడంపై దృష్టి సారిస్తారు.  * క్యాన్సర్ స్క్రీనింగ్: పెద్ద క్యాన్సర్ చికిత్సలు గుర్తించి, అవసరమైన శస్త్ర చికిత్సలు చేయించుకునేందుక...

కర్నూలు హైకోర్టు సాధన దీక్షలు: వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఐదో రోజు కొనసాగింపు – ₹700 కోట్లు కేటాయించాలని పట్టు

  కర్నూల్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేపట్టిన నిరసన దీక్షలు నేడు (ఐదో రోజు) కూడా ఉధృతంగా కొనసాగాయి. కర్నూలు హైకోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలకు భారీ వర్షం కూడా అడ్డు చెప్పలేకపోయింది. ఆకాశం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ, దీక్షాకారులు వెనక్కి తగ్గకుండా, తమ పట్టుదలను చాటుతూ నిరసనను కొనసాగించారు. కీలక డిమాండ్లు: శ్రీ బాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలి సాధన సమితి నేతలు మరోసారి తమ ప్రధాన డిమాండ్లను స్పష్టం చేశారు. 1937 శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో, ముఖ్యంగా కర్నూలులో, హైకోర్టును ఏర్పాటు చేయాలనే హామీని ముఖ్యమంత్రి వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. వారి ముఖ్య డిమాండ్లు ఇవే:  * కర్నూలులో హైకోర్టు లేదా హైకోర్టు బెంచ్ ఏర్పాటు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర అసెంబ్లీ సమావేశాల్లో తక్షణమే ప్రకటించాలి.  * కర్నూలు హైకోర్టుకు శాశ్వత భవనం నిర్మాణానికి తక్షణమే \text{₹}700 కోట్లు కేటాయించి రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయాలి. ప్రభుత్వం తమ డిమాండ్లను తక...