Skip to main content

Posts

Showing posts from October 24, 2025

కర్నూలు బస్సు ప్రమాదం: రాష్ట్ర హోం, రవాణా మంత్రులతో టీడీపీ నేతల భేటీ

   కర్నూలు: కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో, రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిలు ఈరోజు కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్‌లో విపత్తు అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా, కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రమాద సంఘటనపై మరియు ఇతర కీలక అంశాలపై చర్చించారు. ఈ చర్చలో కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నాగేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు, దర్యాప్తు పురోగతి, మరియు బాధితులకు ప్రభుత్వం అందించే సహాయం తదితర విషయాలపై మంత్రులతో టీడీపీ నేతలు మాట్లాడినట్లు సమాచారం.

శబరిమల గోల్డ్ స్కామ్లో కీలక ట్విస్టు

  దేశవ్యాప్తంగా పెను సంచలనం  శబరిమల ఆలయ బంగారం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం తాపడాల నుంచి వేరు చేసిన పసిడిని కర్ణాటకలోని ఓ వ్యాపారి విక్రయించినట్లు ఈ కేసులో ప్రధాన నిందితుడి ఉన్నికృష్ణన్ అంగీకారించాడు. విచారణలో నిందితుడు పూర్తి వివరాలు వెల్లడించినట్లు సిట్ అధికారలు తెలిపారు. బంగారు తాపడాలను మరమ్మతుల కోసం తీసుకెళ్లగా.. తరువాత చోరీకి గురయ్యాయి.

మార్కాపురంలోకి శ్రీశైలం..?

 ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లా కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల జిల్లా నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం...!!

ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ ఉంది. కావేరి ట్రావెల్స్ యాజమాన్యం

బెంగుళూరు: కర్నూలు లో జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాదంపై ఎట్టకేలకు యాజమాన్యం స్పందించింది. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయని ఆ సంస్థ యజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరుమీద ఓ ప్రకటన విడుదల చేసింది. బస్సులో 40 మంది ప్రయాణికులున్నారని, తమ ఏజెన్సీ తరఫున ప్రయాణికులందరికీ ఇన్సూరెన్స్ కూడా ఉందని స్పష్టం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

తోక తొక్కితే తోటి వాడు అనుకో

ఘనంగా నాగుల చవితివేడుకలు ఆశ్లేష, ఆరుద్ర, మూల,పూర్వాభాద్ర, పూర్వాషాడ అను ఈ ఐదు నక్షత్రములు సర్ప నక్షత్రములు. సర్పము అనగా కదిలేది, పాకేది. నాగములో ‘న, అగ’ ఎప్పుడూ కదులుతూ ఉండేదని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతివేగంగా వెళ్ళేదాన్ని ‘నాగము’ అంటారు. అన్నింటికంటే వేగంగా వెళ్ళేది ‘కాలము’ కావున నాగమునకు మరో అర్థం కాలం. అందుకే ‘కాలనాగము’ లేదా ‘కాలనాగు’ అని అంటారు. జ్యోతిష్యశాస్త్రానుసారం కాలసర్ప దోషం ఉన్నవారికి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతాయి. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ. అనగా ‘నాగం’ సర్పము హృదయ భాగంతో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ‘ఉరా’ అంటారు. కావున సర్పానికి ‘ఉరగము’ అని కూడ పేరు. ఉదరమున ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైన మనమూ కూడా ‘ఉరగముల’మే. సర్పం తాను నిరంతరం సాగుతూ మన జీవనక్రమంలోని వివాహం, సంతానం వంటి జీవన ఘట్టాలను అవరోధపరస్తుంది కావున కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తారు. అగ్ని దేవతగా ఉండేది. కార్తీకమాసములోనే. మన జీవనానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం వంటివి తేజస్సు వలన అనగా సూర్యుడు, అగ్ని వలన కలుగుతాయి. శ్రీహరికి శయ్య, శంకరునికి ఆభరణము కూడా సర్పమే. కావున నాగులను ఆరాధిం...

ఆదారాలతో సహా మెము విద్యుత్ అవినీతిపై చూపించాము..

 తిరుపతి..  ఎబి వెంకటేశ్వర రావు,,మాజీ డిజి.. ఇది ట్రయిలర్ మాత్రమే.. పకడ్బందీగా అవినీతి సామ్రాజ్యం నిర్మించారు... రెండు ప్రభుత్వాల ప్రేమకథ. ఇందులో హీరోయిన్ ఒకరే..హీరోలు మాత్రము ఇద్దరు.. మాకు వ్యక్తిగతంగా ఎవ్వరి మీదా లేదు.. ఈ దందా వల్ల పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు నష్టపోతారు.. షిర్డిసాయి కాకపోతే మరో కంపెనీని తెచ్చుకుంటారు.. నేనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చెప్పిన వారు ఎందుకు అవినితి గురించి మాట్లాడారు.. 27సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తాయిలాల వల్ల సంస్కరణలు వచ్చాయి.. మనకంటే ముందుగా హర్యానా లాంటి రాష్టాలు సంస్కరణలు వచ్చాయి.. కేంద్రము చాక్ కెట్ అశ చూపించి విద్యుత్ బోర్డులు రద్దు చేసి జనరేషన్,డిస్టిబ్యూషన్ పేరుతో విడదీసి కార్పొరేషన్ పేరుతో కమర్షియల్ గా మార్చారు.. పాతిక సంవత్సరాల తర్వాత నష్టం తప్ప లాభము లేదు.. ప్రభుత్వ జవాబు దారీ తనము లేకుండా చేసారు.. ఈఅర్ సి పేరుతో రిటైర్డ్ జడ్జీని తెచ్చి పెట్టారు‌.. ఈ అర్ సి వల్ల ఎవ్వరికి న్యాయము.. ఈ అర్ సి అనేది డిస్టిబ్యూషన్ సంస్థల తప్పులకు వత్తాసు పలుకుతుంది.. గత రెండు సంవత్సరాలుగా అవినీతి ప్రేమకథ క్లైమాక్స్ నడుస్తుంది.. ఈ ...

రోడ్డు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలి

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అనంతపురం  : జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, నగరపాలక సంస్థ, ట్రాఫిక్ అధికారులు జాయింట్ తనిఖీ చేసి ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలన్నారు. గుత్తి - గుంతకల్లు రోడ్ లోని రోడ్ మరియు ఆర్ఓబిని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస్సులను ఆపేందుకు గుర్తించిన స్థలాల్లోనే మార్కింగ్ వేసి అక్కడే బస్సులు నిలిపేలా మున్సిపల్ కమిషనర్ తో సమన్వయం చేసుకొని ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఐసి వారు అభివృద్ధి చేసిన ఐరాడ్ యాప్ లో సిహెచ్సి మరియు ఏరియా ఆస...

అండర్ బ్రిడ్జ్ నీటి సమస్యకు నవంబర్‌లో శాశ్వత పరిష్కారం — రైల్వే అధికారులు హామీ

ధర్మవరం, అక్టోబర్ 24:— ధర్మవరం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే సంవాద్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ప్రజలతో పాటు రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, మంత్రి సత్య కుమార్ యాదవ్ తరపున ప్రజల తరఫున పలు ముఖ్యమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. హరీష్ బాబు మాట్లాడుతూ — గత కొన్ని సంవత్సరాలుగా గాంధీనగర్, శాంతినగర్, గుట్టకిందపల్లి, ఎల్-3, ఎల్-4 కాలనీల పరిసర ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జ్‌లలో వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్-3, ఎల్-4 కాలనీలకు బ్రిడ్జ్ యాక్సెస్ నిర్మాణం, స్టేషన్ పరిధిలో కోచ్ మోడల్ రెస్టారెంట్, షాపింగ్ కాంప్లెక్స్, అలాగే 5వ ప్లాట్‌ఫారమ్ వద్ద టికెట్ బుకింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. హరీష్ బాబు ప్రతిపాదనలకు ప్రతిస్పందిస్తూ, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కోఆర్డినే...
 పరిటాల శ్రీ రామ్   ఆదేశాలతో  విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ ధర్మవరం అక్టోబర్ 24: శి వానగర్ ప్రాధమిక ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రామేశ్వరరావు  ప్రభుత్వ పాఠశాలలో స్పోర్ట్స్ స్కిట్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారని పరిటాల శ్రీరామ్కి వినతిపత్రం అందించడంతో శుక్రవారం పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు శివానగర్ శివాలయం ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దాసర రంగయ్య శివానగర్ ప్రాథమికోన్నత పాఠశాలకు స్పోర్ట్స్ కిడ్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్  07 వార్డ్ మాజీ వార్డ్ కౌన్సిలర్ పామిశెట్టి శివశంకర్  07 వార్డ్ ఇంచార్జ్ పల్లపు రవీంద్ర  07 వార్డు అధ్యక్షులు పల్లపు శివశంకర్  ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

గత వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. కాలనీల్లోకి నీరు వస్తోంది*

  విశ్వశాంతి నగర్ లో ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి అధికారులు కాలనీవాసులతో మాట్లాడిన ఎమ్మెల్యే   వచ్చే వర్షాకాలకి శాశ్వత చూపిస్తామన్న ఎమ్మెల్యే  గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం వర్షాలకు కాలనీల్లోకి నీరు చేరుతోందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన రుద్రంపేట పంచాయతీలో ముంపుకు గురైన విశ్వశాంతి నగర్ లో పర్యటించారు. అధికారులు స్థానిక టిడిపి నాయకులతో కలసి కాలనీ మొత్తం తిరిగారు. అక్కడ ఎంత మేర నీరు వచ్చింది... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆరా తీశారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు చూపించారు. అలాగే అధికారులు కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరంలో అనంతపురం నగరంలో భారీ వర్షం వచ్చి చాలా కాలనీలు నీట మునిగాయన్నారు. అప్పట్లో కొందరు వైసీపీ నాయకులు ఆక్రమణల వలన ఇబ్బందులు వచ్చాయన్నారు. వంకల్లో ఎక్కడా పూడిక తీయకపోవడం వలన కాలనీల్...

వైద్య పరీక్ష విషయంలో వివాదం...* *ఆస్పత్రిలో డాక్టర్ ఆత్మహత్య...*

 *మహారాష్ట్ర అక్టోబర్ 24 మహారాష్ట్ర సతారా జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు సంపద ముండే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. వైద్య పరీక్షల విషయంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో ఆమెపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన వైద్యురాలు, సీనియర్ అధికారిని కలసి విచారణ ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అన్నట్టుగానే చివరికి గురువారం రాత్రి ఆస్పత్రిలోనే ఆమె సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బొమ్మనహల్ మండల కేంద్రానికి వెళ్లే రహదారిలో ప్రమాద ఘంటికలు - ఆర్&బీ రోడ్డు గుంతలతో ప్రయాణికులకు ఇక్కట్లు

బొమ్మనహల్, అక్టోబర్ 24  బొమ్మనహల్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన ఆర్.అండ్.బి. (భవనాలు, రహదారులు) రోడ్డు ప్రమాదకరంగా మారింది. దర్గాహొన్నూరు, గోవిందవాడ, దేవగిరి, బండూరు, కల్లుదేవనహల్లి, తారకపురం వంటి పలు గ్రామాల నుండి మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఈ రహదారిపై ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే, రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటం వల్ల వాహనదారుల ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది వాహనాలు ఈ దారి గుండా రాకపోకలు సాగిస్తుండగా, గుంతల కారణంగా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తరచూ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో, సంబంధిత ఆర్.అండ్.బి. అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్రంగా కోరుతున్నారు.

రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించాలి - ఐక్య విద్యార్థి సంఘాల డిమాండ్

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లోని ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ కళాశాలల్లో ప్రిన్సిపాల్స్‌గా దీర్ఘకాలంగా కొనసాగుతున్న కాంట్రాక్ట్ వ్యక్తులను తొలగించి, యూనివర్సిటీ రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించాలని కోరుతూ అనంతపురంలో ఐక్య విద్యార్థి సంఘాలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. రౌండ్‌ టేబుల్ సమావేశం: ఐసా (ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర సహాయ కార్యదర్శి భీమేష్ అధ్యక్షతన శుక్రవారం అనంతపురంలో విద్యార్థి, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఎస్కేయూలోని ఈ రెండు కళాశాలల్లో కాంట్రాక్ట్ వ్యక్తుల పాలన కొనసాగడం వల్ల యూనివర్సిటీ కళాశాలలు ప్రైవేట్ కళాశాలల మాదిరిగా నిర్వహించబడుతున్నాయని, విద్యార్థులకు నాణ్యత లేని బోధన మరియు అవకాశాల భద్రత కొరవడుతోందని సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నాయకుల అభిప్రాయాలు:  * ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు తరిమెల గిరి మాట్లాడుతూ, కాంట్రాక్ట్ ప్రిన్సిపాల్స్ పాలనలో విద్యార్థులను మార్కుల పేరుతో భయపెట్టి, వారిని ప్రైవేట్ కార్పొరేట్ బందీలుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఎస్కేయూకు ఉన్న ప్రతిష్టను కాపాడటానికి, ముఖ్యంగా అత్యధిక విద్యార్థుల...

సింధనూర్ గాంధీనగర్‌లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల విరూపాక్ష దేవాలయ సందర్శన

  కర్ణాటక రాష్ట్రంలోని సింధనూర్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్‌లో వెలసిన ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి సందర్శించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ్ పెద్దలు, గ్రామ పెద్దలు మరియు పలువురు హిందూ బంధువులు పాల్గొని, తమ భక్తిని చాటుకున్నారు. ఈ పర్యటన స్థానికంగా ఆధ్యాత్మిక మరియు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

ప్రోత్సాహక బహుమతులు అందజేత

  గోరంట్ల  అక్టోబర్ 24: గోరంట్ల పట్టణకేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) నందు పదవ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికీ రాష్ట్ర బీసీ సంక్షేమ & చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆశీస్సులతో గోరంట్ల మైనారిటీ యువ నాయకుడు, సమాజ సేవకుడు ఉమర్ ఖాన్ తన సహృదయం తో జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి లో ఉత్తమ ప్రతిభతో పాస్ అయిన బాలికలకు ప్రోత్సాహం బహుమతులు అందజేశారు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ముస్కాన్ కి 5 వేలు, సెకండ్ క్లాస్ లో పాస్ అయిన సానియా కి 3 వేలు, థర్డ్ క్లాస్ లో పాస్ అయిన అయేషా కి 2వేల రూపాయలు, వారిని ప్రోత్సహిస్తూ ఉమర్ ఖాన్ తన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

98 ఎకరాల్లో13500 మొక్కలు నాటిన రైతులు

  భారీగా మొక్కలు పంపిణీ, ఉ రవకొండ అక్టోబర్ 24:  ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోనివజ్ర కరూర్ మండలం జే. రామ పురం లో రైతులకు 98 ఎకరాల్లో 13,500 మొక్కలు పంపిణీ చేసి వాటి సంరక్షణ భాధ్య తలు అప్పగించారు. ఈ ఇంటర్నేషనల్ క్లైమేట్ యాక్షన్ డే సందర్భంగా బృహత్ కార్యక్రమం చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం, జె. రామాపురం గ్రామంలో 35మంది రైతులకు సుమారు 98ఎకరాల విస్తీర్ణంలో 13500 మొక్కల పంపిణీ మరియు నాటకం కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ సతీష్ కుమార్ ,సే ట్రీస్ ప్రోగ్రాం మేనేజర్ డి. పీరవళి సే ట్రీస్ ఫీల్డ్ టీమ్ బాబు నాయక్,N. సుమంత్ మరియు బి. గురుప్రసాద్ మరియు గ్రామ కమిటీ మరియు రైతులు హాజరూ కావడం జరిగినది. ఈ కార్యక్రమంలో మహాగని, రెడ్ సాండల్‌వుడ్ మరియు టెంకాయ మరియు చినీ మొక్కలు నాటడం జరిగింది. ఈ ప్లాంటేషన్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ రైతులకు ఆర్థికంగా నిలకడైన ఆదాయం అందించడం లక్ష్యంగా ఉంది. సే ట్రీస్ మరియు హ్యాండ్స్ సంస్థలు కలిసి రైతులకు నీటి నిర్వహణ, మొక్కల సంరక్షణ, మరియు కార్బన్ ప్రాజెక్ట్ ప్రయ...

దళిత, గిరిజనులపై దాడులు అరికట్టాలి: ప్రభుత్వానికి మోహన్ నాయక్ హెచ్చరిక

  ఉరవకొండ, అక్టోబర్ 24: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి దళిత, గిరిజనులపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి. మోహన్ నాయక్ ఆరోపించారు. దాడులను వెంటనే అరికట్టి, బాధితులకు న్యాయం చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థినులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు రక్షణ కరువైందని, వారిపై రోజురోజుకు పెరుగుతున్న హింస ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ వర్గాల ప్రజల భద్రతను నిర్ధారించాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకొని దాడులు, హత్యలను అరికట్టాలని, లేనిపక్షంలో దళిత, గిరిజనులు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు మహాలక్ష్మి, ధనలక్ష్మి, రాజేశ్వరి, సావిత్రి, భార్గవి, అశ్విని, గౌతమి, మానస, తదితరులు పాల్గొన్నారు...

ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం చేయూత: రూ.715 కోట్ల నిధులు విడుదల

  అమరావతి, అక్టోబర్ 24:  ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) మరియు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ (RGSA) కింద కేంద్రం మొత్తం రూ.715 కోట్లు మంజూరు చేసింది. ఉపాధి హామీ బకాయిల చెల్లింపునకు మార్గం సుగమం: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.665 కోట్లను విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.166 కోట్లను జత చేసింది. దీంతో మొత్తం రూ.831 కోట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిధులతో 2025, మార్చి 31వ తేదీ నాటికి ఉన్న పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించేందుకు వెసులుబాటు కలుగుతుంది. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి రూ.83 కోట్లు: రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డుల కంప్యూటరీకరణ, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులకు శిక్షణ వంటి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వం 'రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య ...

16 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది

   - ప్రజా ఉద్యమం’ పోస్టర్లు విడుదల ఈనెల 28న రాయదుర్గంలో ర్యాలీ  రాయదుర్గం అక్టోబర్‌ 24 : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘‘వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ఉద్యమం‘పై రూపొందించిన పోస్టర్‌ను రాయదుర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించిన *వైసీపీ రాష్ట్ర జాయింట్ సెకరేట్రి మెట్టు విశ్వనాధ్ రెడ్డి  ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోంది.  మెట్టు విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన రాయదుర్గం నియోజకవర్గ లో ర్యాలీ చేపడుతున్నాం. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు అనుబంధ విభగాల, అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని కోరుతున్నాం.  టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి.  16 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొంది కూటమి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయి అభిరుద్ది శున్యం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్...

వక్ఫ్ ఆస్తుల సమస్యలపై మంత్రుల బృందం కీలక సమావేశం

విజయవాడ/అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా మంత్రుల బృందం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు తరపున పలు ముఖ్యమైన అంశాలను ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రులు, అధికారులు: విజయవాడ నుండి:  అనగాని సత్యప్రసాద్ గారు (రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి)  కొలుసు పార్థసారథి గారు (రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి)   ఎన్.ఎమ్.డి ఫరూక్ (రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి)   సంబంధిత శాఖల కార్యదర్శులు మరియు ఉన్నతాధికారులు. అనంతపురం కలెక్టరేట్ నుండి:   పయ్యావుల కేశవ్ (రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, వక్ఫ్ బోర్డు సమస్యలపై మంత్రులందరూ కూలంకషంగా చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు, తగు నిర్ణయాలు తీసుకునే దిశగా కార్యాచరణను ప్రారంభించినట్లు సమావేశంలో వెల్లడించా...

విద్యారంగ సమస్యలపై AI­SF 'బస్సు జాత': విజయనగరంలో ఉద్విగ్న సభ

  ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు సాగుతున్న జాతకు భారీ మద్దతు విజయనగరం: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 'బస్సు జాత' మూడవ రోజు విజయనగరం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఉత్తేజభరిత వాతావరణంలో జరిగింది. AISF జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఈ సభలో పాల్గొని ప్రసంగించింది. విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నేతలు ప్రభుత్వాన్ని బలంగా డిమాండ్ చేశారు. సభలో ప్రముఖుల ప్రసంగం ఈ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న AISF మాజీ జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ... విద్యా హక్కుల కోసం విద్యార్థులు ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ముఖ్యంగా:  * ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్  * ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు  * ప్రధాన కార్యదర్శి నాసర్ జి లు ప్రసంగిస్తూ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఫీజుల సమస్యలు, నిరుద్యోగం, ప్రభుత్వ విద్యా సంస్థల బలహీనతలపై తమ గళాన్ని వినిపించారు. విద్యార్థుల పోరాటాలకు ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారం చూపకుంటే, ఈ ఉద్యమాన్న...