Skip to main content

Posts

Showing posts from October 2, 2025

కొబ్బరి బొండాల్లో గంజాయి స్మగ్లింగ్ : ముఠా అరెస్టు

హైదరాబాద్ ట్రూ టైమ్స్ ఇండియా పెద్ద అంబర్పేట వద్ద బుధవారం భారీగా గంజాయి పట్టుబడింది.  విశాఖ నుంచి రాజస్థాన్కు తరలిస్తున్న సుమారు 400 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఎవరికీ అనుమానం రాకుండా, కొబ్బరి బొండాల మాటున గంజాయి తరలిస్తుండగా ఈగల్ బృందం గుర్తించింది.  ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, డీసీఎం, కారును స్వాధీనం చేసుకున్నారు

ధర్మవరం నుండి గుంటూరు కు నూతన రైలు సర్వీసు..

 ధర్మవరం:ట్రూ టైమ్స్ ఇండియా ధర్మవరంలో మధ్యాహ్నం1.20 బయలుదేరి ములకలచెరువు2.50 నిమిషములకు చేరుకొని వయా తిరుపతి, కడప, ప్రొద్దుటూరు, నంద్యాల, వినుకొండ మీదుగా ఉదయం 7.20 గుంటూరుకు చేరుకుంటుంది. ఇదివరకు ఈ రైలు గుంటూరు నుండి మదనపల్లి రోడ్డు వరకు కొనసాగేది. నేటి నుండి ధర్మవరం వరకు అధికారులు సర్వీసును పొడిగించారు.*సర్వీస్ నెంబరు17261,17262*

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి హుండీ ఆదాయం ₹25.12 కోట్లు

తిరుమల. ట్రూ టైమ్స్ ఇండియా శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించినట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈ ఉత్సవాలకు తితిదే ఏర్పాట్లపై భక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు

ఆర్ధికంగా ఎదిగే అవకాశాన్ని అందిపుచ్చుకోండి

 మత్స్యకారులతో సమావేశంలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి సబ్సిడీతో వచ్చే బోట్లను మత్స్యకారులు తీసుకుని ఆర్ధికంగా ఎదిగే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో మత్స్యకారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర మత్స్య, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, రాష్ట్ర ఫిషరీస్ సెక్రటరీ రాం శంకర్ నాయక్ లతో ఎమ్మెల్యే పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సముద్రాన్ని నమ్ముకొని రోజూ ప్రాణాలు పణంగా పెట్టి జీవనం సాగిస్తున్న మత్స్యకార సోదరుల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లే మత్స్యకారులకు కూడా అదే విధంగా ప్రయోజనం వచ్చేలా ముఖ్యమంత్రిని ఒప్పించి, కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడానికి కృషి చేస్తామన్నారు. మీరు లైసెన్సులు సక్రమంగా పొందితే ప్రభుత్వ పథకాలన్నీ మీకు అందుతాయన్నారు. సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే సబ్సిడీలు, రుణ సౌకర్యాలు సులభంగా లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఆధునిక సాంకేతికతతో వచ్చిన ఈ హార్బర్లలో చిన్న జెట్టీలు ఏర్పాటు చేసి మత్స్యకారులు వలసలు వెళ్లాల్సిన అవ...

శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతాలు పెంపు.

 *అమరావతిట్రూ టైమ్స్ ఇండియా శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతాలు పెంపు. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 1,50,000. ఇంటి అద్దె 25000 నుండి 50,000. రైల్వే చార్జీలు 1,00,000. పేపర్ ఖర్చులు 1,00,000. మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000. ఎమ్మెల్యే కారు లోను 10,00,000 నుండి 25,00,000 కు పెంపు..

రాష్ట్రంలో డీ అడిక్షన్ కేంద్రాలు - రూ.33.80 కోట్లతో ప్రతిపాదనలు*

అమరావతి:ట్రూ టైమ్స్ ఇండియా ప్రస్తుత సమాజంలో పెద్దల నుంచి చిన్నారుల వరకు సిగరెట్లు, గంజాయి మత్తు, మద్యానికి బానిసలవుతున్నారు. యువత హాష్‌ ఆయిల్, మత్తు ఇంజక్షన్లు, డ్రగ్స్‌ అలవాటుపడుతున్నారు. ఇలాంటి వారిని మత్తుకు దూరంగా ఉంచే ప్రయత్నంలో కొంతమంది తీవ్ర ఆవేశానికి గురవుతున్నారు. అంతర్లీనంగా ఏర్పడిన మానసిక పరిస్థితులతో తమ ప్రాణాలను తామే తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి కోసం కూటమి ప్రభుత్వం వ్యసన విమోచన కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కూటమి ప్రభుత్వం కృషి: ఈ క్రమంలో రాష్ట్రంలో వ్యసన విమోచన కేంద్రాల బలోపేతానికి రూ.33.80 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. జిల్లా, బోధనాసుపత్రుల్లో గల 21 కేంద్రాల్లో వైద్యపరికరాలు, మందులు, మౌళిక సదుపాయాల కల్పన, సాంకేతిక వ్యవస్థను మెరుగుపరచడం, సిబ్బందికి ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. 21 కేంద్రాల ద్వారా వ్యసనాల బారిన పడినవారిని ఆ వ్యసనాల నుంచి బయటకు తెచ్చి సన్మార్గంలో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వైద్యారోగ్...

విజయదశమి శోభ: గురుగుంట్ల చౌడేశ్వరి, చెరువు కట్ట సుంకులమ్మ అమ్మవార్ల వేడుకలు

 ఉరవకొండ ట్రూటైమ్స్ ఇండియా అక్టోబర్ 03 దసరా పండుగ అంటేనే అమ్మవారి వైభవానికి ప్రతీక. ముఖ్యంగా విజయదశమి రోజున, అమ్మవార్లను వివిధ రూపాలలో అలంకరించి, అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం ఆనవాయితీ. ఈ చిత్రాలు అదే పవిత్ర ఘట్టాన్ని తెలియజేస్తున్నాయి. గురుగుంట్ల చౌడేశ్వరి అమ్మవారి అలంకరణ (చిత్రం 1) మొదటి చిత్రంలో గురుగుంట్ల చౌడేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు.   శివలింగ రూపంలో: అమ్మవారి పక్కనే శివలింగం కూడా పూజలందుకుంటోంది. అమ్మవారిని, శివుడిని ఒకే చోట ఆరాధించడం ఈ ఆలయ ప్రత్యేకతను, శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది.  దివ్య అలంకరణ: అమ్మవారి విగ్రహాలు, శివలింగం పసుపు, ఎరుపు, నారింజ రంగుల పూలమాలలు, ముఖ్యంగా బంతి పూల మాలలతో నిండుగా అలంకరించబడి ఉన్నాయి.  పత్రాల పందిరి: పీఠం పైన ఆకులతో అలంకరించిన అందమైన పందిరి, నిరాడంబరమైనా పవిత్రమైన వాతావరణాన్ని పెంచుతోంది. పైన నాగదేవత ప్రతిమలు కొలువై ఉన్నాయి.   భక్తి వాతావరణం: నేలపైన పండ్లు, అరటిపండ్లు, వడపప్పు వంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించబడ్డాయి. ఒక భక్తురాలు పక్కనే భక్తితో కూర్చుని ఉండడం ఆలయ పవిత్రతను తెలియజేస్తోంది. చెరువు కట్ట సుంకులమ్మ అమ్మవ...

ఉరవకొండలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ఉరవకొండ ట్రూ టైమ్స్ఇండియా:అక్టోబర్ 02: ఉరవకొండ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అక్టోబర్ 2న అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను పలువురు ప్రముఖులు మరియు అధికారులు పర్యవేక్షించారు. ముఖ్య అతిథులు మరియు పర్యవేక్షణ ఈ వేడుకల పర్యవేక్షణలో హరిత దివ్యాంగుల సేవా సమితి అధ్యక్షుడు మోహన్ నాయక్ ముందున్నారు. వీరితో పాటు పంచాయతీ కార్యదర్శి గౌస్, సర్పంచి లలిత, ఏ వన్ గుమస్తా అబ్దుల్ బాషా, నిరంజన్ గౌడ్, లెనిన్ బాబు, ఓబులేసు, సీనియర్ ఎలక్ట్రీషియన్ ఉక్కీసుల గోపాల్, మరియు శానిటరీ మేస్త్రీలు పాల్గొన్నారు. మోహన్ నాయక్ ప్రసంగం వేడుకల సందర్భంగా మోహన్ నాయక్ మరియు ఉక్కీసుల గోపాల్ ప్రసంగిస్తూ, మహాత్ముడి గొప్పదనాన్ని కొనియాడారు. మోహన్ నాయక్ తన ప్రసంగంలో గాంధీ జయంతి ప్రాముఖ్యతను ఈ విధంగా వివరించారు:  * జననం: ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ జన్మదినాన్ని జాతీయ సెలవుదినంగా జరుపుకుంటాం.  * గౌరవం: దేశ ప్రజలు గాంధీజీని ప్రేమగా 'బాపూ' అని, గౌరవంగా 'జాతిపిత' అని పిలుస్తారు.  * స్వాతంత్ర్య పోరాటం: గాంధీజీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక భూమిక పోషించి, అహింసా మార్గంలో దేశ...