Skip to main content

Posts

Showing posts from September 28, 2025

విద్యా లక్ష్మీగా ఉద్భవ లక్ష్మీ

  ఉరవకొండ  సెప్టెంబర్ 29: అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని,ఆదివారం మహా లక్ష్మీ రూపంలో భక్తుల కు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు   సెప్టెంబర్ 22, సోమవారం: ఆదిలక్ష్మి  సెప్టెంబర్ 23, మంగళవారం: గజలక్ష్మి  సెప్టెంబర్ 24, బుధవారం: ధాన్యలక్ష్మి  సెప్టెంబర్ 25, గురువారం: సౌభాగ్యలక్ష్మి  సెప్టెంబర్ 26, శుక్రవారం: ధనలక్ష్మి  సెప్టెంబర్ 27, శనివారం: సంతానలక్ష్మి  * సెప్టెంబర్ 28, ఆదివారం: మహాలక్ష్మి రూపాల్లో దర్శనం ఇచ్చారు. కాగా సోమవారం  ఉదయం దేవస్థానం లో అమ్మవారు విద్యా లక్ష్మీ గా భక్తులు పూజలు నిర్వహించారు.సుప్రభాత సేవ, పసుపు, కుంకుమార్చనలు చేశారు. పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి భక్తులు పూజలు నిర్వహించారు. చూడముచ్చటగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.   సోమవారం విద్యాలక్ష్మిగా భక్తుల నీరాజనాల అందుకుంటారని దేవస్థాన పూజారులు ద్వారకనాథ ఆచార్యులు, మయూరం బాలాజీలు తెలిపారు.

బీజేపీ గిరిజన మోర్చా జోనల్ సమావేశం: తిరుపతిలో గిరిజన నేతల భేటీ

 తిరుపతి: తిరుపతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిరిజన మోర్చా రాష్ట్ర నాయకత్వం తిరుపతిలో జోనల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి గిరిజన మోర్చా ముఖ్య సభ్యులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పొంగి రాజా రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. గిరిజన మోర్చా కార్యకలాపాలు, పార్టీ పటిష్టత, రాబోయే ఎన్నికల్లో గిరిజన ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:  * పొంగి రాజా రా  (గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు)  * మూడ్ కేశవ నాయక్  (బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు)  * సుగాలి గోపాల్ నాయక్  (రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్)  * శివా నాయక్   * నారాయణ   * తదితర బీజేపీ గిరిజన మోర్చా కుటుంబ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు పొంగి రాజా  మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గిరిజనులలోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని మోర్చా సభ్యు...

రేబిస్ మహమ్మారి పై ఆందోళన

 ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వ్యాధి ప్రాణాలు బలితీస్తూనే ఉంది. డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదిక ప్రకారం, ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరు రేబిస్ వల్ల మృతి చెందుతున్నారు. ఇందులో మూడవ వంతు మరణాలు భారతదేశంలోనే సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో భారతదేశంలోనే 284 మంది రేబిస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండటం ఈ దుస్థితికి ప్రధాన కారణమని పార్లమెంట్‌కు సమర్పించిన ఐడీఎస్‌పీ (ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) నివేదిక స్పష్టం చేసింది. పలు దేశాలు ఇప్పటికే 70% వాక్సినేషన్ లక్ష్యం సాధించి రేబిస్ నియంత్రణలో విజయవంతమయ్యాయి. అదే విధంగా భారత్ కూడా ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రేబిస్ నివారణకు వెంటనే వాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం అత్యవసరం అని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

మరో అల్పపీడనం.. రాష్ట్రంలో వర్షాల సూచన.

  అమరావతి : బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రేపటినాటికి అక్కడ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, అది బుధవారానికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో ఇప్పటికే వర్షం పరిస్థితులు ఏర్పడుతున్నాయని, నేడు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ⚠️ అధికారులు ప్రజలు వర్షాలు, గాలులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రిజిస్టర్ పోస్టు విలీనం – తపాలా శాఖలో కొత్త మార్పులు

  న్యూఢిల్లీ: దేశ తపాలా సేవల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్ పోస్టు విధానంను తపాలా శాఖ స్పీడ్ పోస్టులో విలీనం చేసింది. ఇకపై రిజిస్టర్ పోస్టు ఒక విలువ ఆధారిత సేవగా స్పీడ్ పోస్టు కింద అందుబాటులోకి రానుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ అమలులోకి వస్తోంది. అదనంగా కొత్తగా ఓటీపీ ఆధారిత డెలివరీ సేవను ప్రవేశపెట్టింది. ఈ మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిన ఉత్తరాలను చిరునామాదారుకే పోస్టుమన్ అందజేయాలి. ఇందుకోసం సంతకం తప్పనిసరి. ఈ సేవను వినియోగించుకోవడానికి నిర్దేశిత టారిఫ్‌పై ప్రతి ఆర్టికల్‌కు రూ.5 అదనంగా (జీఎస్టీ మినహాయించి) వసూలు చేయనున్నారు. ఇక స్పీడ్ పోస్టుకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన ఓటీపీ ఆధారిత డెలివరీ సేవలో, ఉత్తరం పంపిణీ సమయంలో చిరునామాదారుని మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ధృవీకరించిన తర్వాతే పోస్టుమన్ ఉత్తరాన్ని అందజేస్తాడు. ఈ సేవకూ నిర్దేశిత టారిఫ్‌పై రూ.5 అదనంగా చెల్లించాలి. విద్యార్థులకు ఉపశమనం స్పీడ్ పోస్టు చార్జీలను విద్యార్థులకు 10 శాతం...

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.        బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, “ఆడబిడ్డలను మన సంతోషాల్లో భాగస్వాములను చేసినప్పుడే ఈ పండుగ నిండుదనం సంతరించుకుంటుంది” అని పేర్కొన్నారు. బతుకమ్మ కుంట కోసం జీవితాంతం పోరాడిన వి. హనుమంతరావును స్మరించుతూ ఆయనకు గౌరవప్రదమైన నివాళులు అర్పించారు. హైడ్రా ఏర్పాటు సమయంలో ఎదురైన వివాదాలు, విమర్శలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, “ఒడిదుడుకులు వచ్చినపుడు సమయస్ఫూర్తితో పరిష్కారాలు కనుగొంటూ ముందుకు సాగాలి” అని అన్నారు. కోవిడ్‌ తరువాత వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం కుంభవృష్టి వర్షాలు ఒకేసారి కురుస్తున్నాయని తెలిపారు. “మన వ్యవస్థ కేవలం రెండు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేలా ఉన్నప్పటికీ, ఇప్పుడు విపరీత వర్షాలను ఎదుర్కొనేలా పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలు సిద్ధం చేశాం” అని ముఖ్యమంత్రి వివరించారు. మూసీ పునరుజ్జీవనమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి...

ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ని ఘనంగా సన్మానించిన పూతలపట్టు జనసేన నాయకులు.

పూతలపట్టు సెప్టెంబర్ : ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమితులైన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ గాని మదనపల్లి కేంద్రంలో ఉన్న ఎంజి గ్రాండ్ నందు పూతలపట్టు జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై పోస్ట్ మహేష్ గారిని ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమించడం శుభసూచకమని భవిష్యత్తులో ఉమ్మడి చిత్తూరు జిల్లా, పరిసర జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మహేష్ గారు రెట్టింపు స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి,అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని,ఇలాంటి యువ నాయకుడికి అవకాశం కల్పించడం హర్షణీయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య,జిల్లా నాయకులు ఎం మహేష్ స్వేరో,యాదమరి మండల అధ్యక్షులు కుమార్,యాదమరి మండల కార్యదర్శి వేముల పవన్,తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు చిన్న,అజిత్ శ్రీరాముల,అనిల్ కుమార్,ప్రభాకర్,టీ ఎన్ ఎస్ ప్రసాద్,త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

 మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలు ఈనెల 29వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ        అనంతపురం:  మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 29వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ : ఈనెల 29వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఉదయ...

ఘనంగా వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ

పావగడ: Ex MP. T. Rangaiah హాజరైన అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య  ఆత్మీయ స్వాగతం పలికిన YNH కోట గ్రామస్తులు  కర్ణాటక రాష్ట్రంలోని పావగడ తాలూకా YNH కోట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా చేపట్టారు. గ్రామస్థుల ఆహ్వానం మేరకు వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి YNH కోట గ్రామానికి చేరుకున్న మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం YSRCP సమన్వయకర్త తలారి రంగయ్య గారికి ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు.              అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహం వద్దకు చేరుకుని మహర్షి విగ్రహాన్ని ఆవిష్కరించారు.                      ఈ కార్యక్రమంలో YNH కోట గ్రామస్తులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు

తిరుమలలో చరిత్ర సృష్టించిన గరుడ సేవ: 2.35 లక్షల భక్తులతో అశేష జనవాహిని!

 తిరుమల:    సెప్టెంబర్ 28: కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి పారవశ్యంతో పతాక స్థాయికి చేరాయి. ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైన, ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవ ఈ రోజు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. ప్రతి ఏటా శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు జరిగే ఈ సేవకు భక్తులు పోటెత్తడంతో తిరుమల గిరులు అశేష జనవాహినితో నిండిపోయాయి. నిర్ణీత సమయం కంటే ముందే గరుడ సేవ ప్రారంభం భక్తుల రద్దీని, వారి సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సాధారణంగా రాత్రివేళ జరిగే గరుడ సేవను ఈ ఏడాది ఆలయ అధికారులు ముందుగానే ప్రారంభించారు. నిర్ణీత సమయం కంటే ముందే, సరిగ్గా ఉదయం 6:07 గంటలకే శ్రీవారి మూలవిరాట్ తరహాలో అలంకరించబడిన ఉత్సవ మూర్తిని అంగరంగ వైభవంగా గరుడునిపై అధిరోహింపజేశారు. శ్రీనివాసుడు తన జన్మదిన నక్షత్రమైన స్వాతి నక్షత్రానికి అధిపతి, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడుని (వేదాలలో విష్ణువు వాహనంగా పేర్కొనబడిన పక్షిరాజు) అధిరోహించి భక్తులకు దర్శనం ఇచ్చారు. తిరుమాడ వీధుల్లో కమనీయ దృశ్యం శ్రీవారి గరుడ వాహన సేవ తిరుమాడ వీధుల్లో వైభవంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వా...

దక్షిణ కొరియాకు అమెరికా నుండి $350 బిలియన్ డిమాండ్ – ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు.

  సియోల్: నిత్యం సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, తాజాగా దక్షిణ కొరియాకు ఒక అంచనాకు మించి ఉన్న వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనతో వార్తల్లోకి వచ్చారు. గతంలో ఈ దేశంపై సుంకాలను విధించిన ట్రంప్, ఇప్పుడు వాటిని తగ్గించడానికి దక్షిణ కొరియాకు $350 బిలియన్ల నగదు చెల్లింపును డిమాండ్ చేశారు.                                                                                                 దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ డిమాండ్ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విధంగా ఉందని హెచ్చరించింది. జూలైలో రెండు దేశాల మధ్య సుంకాలను 25% నుండి 15%కి తగ్గించడానికి చర్చలు జరిగినప్పటికీ, ఈ కొత్త డిమాండ్ దేశానికి తీవ్రమైన ఆర్థిక ముప్పును కలిగించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.                    ...

భారత్, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కుల ఉద్యమ కారుడు

-ఘనంగాభగత్ సింగ్ వర్ధంతి వేడుకలు.  భారత్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకి, భారత్ మరియు బ్రిటన్ దేశాల్లో రాజకీయ ఖైదీల కోసం సమాన హక్కులు కల్పించాలని ఉద్యమించిన భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు ఘనంగా జరుపుకున్నాయి   ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతీయ విప్లవకారుడు స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.గొప్ప కమ్యూనిస్టు ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ ప్రకారం భగత్ సింగ్, భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త ...

స్వామి వివేకానంద విగ్రహం చుట్టూ అన్యమత పోస్టర్లు అంటించిన వారితోనే తీయించిన పోలీసులు.

       గుంటూరు : గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం చుట్టూ అన్యమత పోస్టర్లు అతికించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ పోస్టర్ల విషయం బయటపడగానే భారతీయ జనతా యువమోర్చా నాయకుడు అంకరాజు శశాంక్ శర్మ ఆధ్వర్యంలో బీజేవైఎం, బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.వెంటనే విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం, పోస్టర్లు అతికించిన నిర్వాహకులను పిలిపించి వారితోనే పోస్టర్లు తొలగింపజేశారు.ఈ సందర్భంగా ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ఇరు వర్గాలతో చర్చించి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. “పట్టాభిపురంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద అన్యమత పోస్టర్లు తొలగిస్తున్న దృశ్యం.”

భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలి

కణేకల్:  మండలం లోని కె.కొత్తపల్లి గ్రామం లో పీడీ యస్వి  యూ ద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూభగత్ సింగ్ జీవితం నేటి యువతరానికి విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు.1907 సెప్టెంబర్ 27న జన్మించిన భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశభక్తిని అణువణున నింపుకొని దేశ స్వాతంత్రం కోసం.సమ సమాజ స్థాపన కోసం పోరాటం చేశాడని అన్నారు  వలస పాలకులు జరిపిన జలియన్వాలాబాగ్ మారణకాండ ఆయన్ను 12 సంవత్సరాల ప్రాయంలోనే సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ సంఘటన భగత్ సింగ్ ను ఆలోచింప చేసిందని గుర్తు చేశారు.సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కరపత్రాలు విసిరి పొగ బాంబులు వేసి విప్లవం వర్ధిల్లాలి అని నినదిస్తూ పారిపోకుండా పోలీసులకు దొరికిపోయారు. తరువాత భగత్ సింగ్ కు ఆయన సహచరులైన సుఖదేవ్,రాజ్ గురులకు మరణశిక్షను విధించటం జరిగింది అని మరణశిక్షను 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీన లాహోర్ జైలులో అమలు చేశారని అన్నారు.ఈ విధంగా భగత్ సింగ్ తన 23 ఏళ్ల జీవితకాలంలో భగత్ సింగ్ చేసిన పోరాటం,చూపిన తెగువ,పట్టుదల,సమాజం పట్ల ప్రేమా...

మహాలక్ష్మిగా ఉద్భవ లక్ష్మి

నేడు విద్యాలక్ష్మీ ఉరవకొండ  సెప్టెంబర్ 28: అనంతపురం జిల్లా సుప్రసిద్ధ పుణ్య క్షేత్ర మైన పెన్నోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన పరిధి లోని ఉద్భవ లక్ష్మీ దేవస్థానం లో ఆదివారం నాడు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, అమ్మవారి అలంకారాలు ఈ విధంగా ఉన్నాయి:  సెప్టెంబర్ 22, సోమవారం: ఆదిలక్ష్మి  సెప్టెంబర్ 23, మంగళవారం: గజలక్ష్మి  సెప్టెంబర్ 24, బుధవారం: ధాన్యలక్ష్మి  సెప్టెంబర్ 25, గురువారం: సౌభాగ్యలక్ష్మి  సెప్టెంబర్ 26, శుక్రవారం: ధనలక్ష్మి  సెప్టెంబర్ 27, శనివారం: సంతానలక్ష్మి  సెప్టెంబర్ 28, ఆదివారం: మహాలక్ష్మి ఉదయం దేవస్థానంలో అమ్మవారికి భక్తులు సుప్రభాత సేవ, పసుపు, కుంకుమార్చనలు నిర్వహించారు. పట్టు వస్త్రాలతో అలంకరించబడిన అమ్మవారిని భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నేడు విద్యాలక్ష్మి రూపంలో దర్శనం దేవస్థానం పూజారులు ద్వారకనాథ ఆచార్యులు, మయూరం బాలాజీలు తెలిపిన వివరాల ప్రకారం, నేడు సోమవారం అమ్మవారు విద్యాలక్ష్మి రూపంలో భక్తుల నీరాజనాలు అంద...

ఎడతెరిపి వర్షాలతో పత్తి రైతుల దుస్థితి

తెల్ల బంగారం నల్లబడిపోతుండటంతో అన్నదాతల ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఆశాజనకంగా పెరిగిన పత్తి పంట ఇప్పుడు విపరీతమైన వర్షాల దెబ్బకు నష్టపోతూ రైతుల కలలను ఛిద్రము చేస్తోంది.తెల్ల చీర కట్టుకున్నట్లుగా విరాజిల్లిన పత్తి పొలాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక దారుణ స్థితికి చేరుకున్నాయి. రైతులు సకాలంలో పత్తిని విడిపించలేకపోతుండడంతో ‘తెల్ల బంగారం’ క్రమంగా నల్లబడిపోతూ నష్టాల్లోకి జారుతోంది.“వర్షం రాకపోతే అనావృష్టి, వర్షం అధికంగా కురిస్తే అతివృష్టి— రైతు పరిస్థితి ఎప్పుడూ కష్టమే. కష్టపడి సాగు చేసిన పంట చివరి దశలో నష్టపోవడం మాకు మానసికంగా, ఆర్థికంగా పెద్ద దెబ్బ” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో సాగు చేసిన పత్తి ఇప్పుడు నిలువనే నష్టమవుతుందేమోనన్న భయంతో రైతులు వణుకుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పత్తి పంటకు మచ్చలు ఏర్పడి, నాణ్యత తగ్గిపోతుండటంతో మార్కెట్లో ధరలు కూడా పడిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ— తక్షణమే నష్టాన్ని అ...

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణుల స్వాధీనం

  హైదరాబాద్ : శషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి విదేశీ వన్యప్రాణుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాదుకు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా, అతని సామాను నుంచి అరుదైన వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు.అరుదైన జాతులు పట్టుబాటు కస్టమ్స్ అధికారుల ప్రకారం స్వాధీనం చేసిన వన్యప్రాణాల్లో ఒక మానిటర్ బల్లి, రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాలు, మొత్తం 12 ఇగువానాలు ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న అరుదైన జాతులని తెలిపారు.తిరిగి బ్యాంకాక్ తరలింపు స్వాధీనం చేసిన ఈ వన్యప్రాణులను సంబంధిత అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తిరిగి బ్యాంకాక్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.ప్రయాణికుడు అదుపులో వన్యప్రాణాలను అక్రమంగా భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో సెక్యూరిటీ విభాగాలు అప్రమత్తమయ్యాయి.

స్వయం సమృద్ధి ద్వారానే ‘వికసిత్ భారత్’ సాధ్యం: ప్రధాని మోదీ.

న్యూఢిల్లీ: దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవకపోతే ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 126వ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ కొనాలి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని ప్రధాని సూచించారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో మహాత్మా గాంధీ స్వదేశీ ఉత్పత్తులపై ప్రజల్లో అపారమైన అవగాహన కల్పించారని గుర్తుచేశారు. కాలక్రమేణా ఖాదీకి డిమాండ్ తగ్గినా, గత 11 ఏళ్లలో మళ్లీ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మోదీ వివరించారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిలో స్వదేశీకి ప్రాధాన్యం ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం కూడా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. ఇందుకోసం స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని పెంపొందించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.అన్ని పార్టీలూ కలిసిరావాలి.రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి దేశవ్యాప్తంగా విప్లవాత్మకంగా సహక...