Skip to main content

Posts

Showing posts from October 28, 2025

రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన హైదరాబాద్‌కు చెందిన ఎస్ఐ

  ఇటీవల రూ.3 వేల కోట్లు కొల్లగొట్టి ఆర్థిక నేరం చేసి ముంబయికి పారిపోయిన నిందితుడు ఈ నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి పంపిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముంబయిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా నిందితుడితో రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకున్న ఎస్ఐ  ఇతర పోలీసులను వేరే వాహనంలో పంపించి, తాను మాత్రం నిందితుడితో వేరే వాహనంలో వెళ్లే విధంగా, రెండు వాహనాలకు మధ్య 30 కిలోమీటర్ల దూరం ఉండేలాగా ఎస్ఐ మాస్టర్ ప్లాన్ మార్గ మధ్యలో నిందితుడి సభ్యులకు ఫోన్ చేసి ఒక హోటల్ వద్దకు రూ.2 కోట్లు క్యాష్ తీసుకురావాలని ఆదేశించిన ఎస్ఐ  హోటల్లో డబ్బులు తీసుకుని నిందితుడిని వదిలేసి.. తాను వాహనం ఆపినప్పుడు పారిపోయాడని ఉన్నతాధికారులను నమ్మించి సదరు ఎస్ఐ  డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీలో డబ్బులు తీసుకుని ఎస్ఐ నిందితుడిని వదిలేసినట్టు నిర్ధారించిన ఉన్నతాధికారులు 2020 బ్యాచ్‌కు చెందిన సదరు ఎస్ఐ, గత కొన్నేళ్లుగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన దర్యాప్తు బృందాలు...

విడపనకల్ రెవెన్యూ ఇంద్రజాలం: అంధుడికి అందని సమాచారం!

  విడపనకల్ (అక్టోబర్ 28): విడపనకల్ మండలంలో రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని కొట్టాలపల్లి గ్రామానికి చెందిన అంధుడైన కురువ ఎర్రిస్వామికి భూ సమాచారం విషయంలో అధికారులు చుక్కలు చూపించారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన వివరాలకు, పొంతన లేని సమాధానాలిచ్చి దరఖాస్తుదారుడిని గందరగోళానికి గురిచేశారు.  మ్యుటేషన్ గందరగోళం భూమి మ్యుటేషన్ సందర్భంగా 'గొలుసు ఆధారిత పత్రాలు' (Chain Documents) ప్రామాణికంగా తీసుకుంటారా? కేవలం రిజిస్ట్రేషన్ దస్తావేజులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా? ఏ చట్టం ఏం చెబుతోంది? అని ఎర్రిస్వామి ప్రశ్నించారు.  * దీనికి విడపనకల్ తాసిల్దార్ బదులిస్తూ, రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా మ్యుటేషన్ చేస్తామని తెలిపారు.  * అయితే, గొలుసు పత్రాలు పరిశీలించకుండా మ్యుటేషన్ చేస్తే, ఆస్తి చరిత్ర, అమ్మకాలు-కొనుగోలు వివరాలు ఎలా తెలుస్తాయని ఎర్రిస్వామి అనుమానం వ్యక్తం చేశారు.  మరణ ధ్రువీకరణ పత్రాలతో మ్యుటేషన్! ఇదిలా ఉండగా, కొట్టాలపల్లికి చెందిన చంద్రబాబు తండ్రి నారాయణస్వామి అమ్మమ్మ మృతి చెందారు. కేవలం దరఖాస్తుదారుడు సమర్పించిన మరణ ధ్రువీకరణ ...

వీ ఆర్ కు కళ్యాణదుర్గ రూరల్ సీఐ వంశీకృష్ణ

   కళ్యాణదుర్గం రూరల్ సీఐ వంశీకృష్ణను పోలీసు ఉన్నతాధికారులు వీఆర్ కు పంపారు. ఇటీవల సీఐ వంశీ కృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. స్టేషన్ కు వచ్చే ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఫిర్యాదులున్నాయి.  ఈయన తీరుతో స్టేషన్లో పనిచేసే సిబ్బంది సైతం విసుక్కున్నట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా ఓ మహిళ విషయంలో ఈయన వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్లో వ్యవహారాలపై అనేకమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు.  విధుల్లో నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల విచారణ మేరకు సిఐ వంశీకృష్ణ ను విఆర్ కు పంపారు.

అనంతపురం: ఉరవకొండలో రైతు సంఘం మహాసభ - పంట నష్టానికి పరిహారం, ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం డిమాండ్‌

   అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం: ఉరవకొండలోని గవి మఠం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ ఉత్సాహంగా జరిగింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు చేసి, వారి సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటాలు చేస్తామని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. 💧 అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలు: పరిహారం కోరుతూ తీర్మానం ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతినడంపై మహాసభలో చర్చ జరిగింది. పొలాల్లో నీరు నిలిచిపోవడం వల్ల పప్పుశనగ, కంది, బోరుబావుల కింద, కాలువల కింద వేసిన వేరుశనగ పంటలు పూర్తిగా నాశనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం ప్రభుత్వానికి, అధికారులకు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసింది. అధికారులు పంట పొలాలను పరిశీలించి, పంట నష్టపోయిన రైతులను అన్ని రకాలుగా ఆదుకోవాలని రైతు సంఘం నూతన కమిటీ సభ్యులు కోరారు. 🚨 ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం డిమాండ్‌ మహాసభ జరుగుతున్న రోజు ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఉపాధి నిమిత్తం వ్యవసాయ పనులకు వేరే గ్రామాలకు వెళ్తున్న కొందరు రైతులు ప్రమాదవశాత్తు కారుకు ఢీకొని గాయపడ్డారు. గాయపడిన వారందరికీ మెరుగైన ...