హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా చేయడానికి డ్రోన్ల ద్వారా పోలీసింగ్ విధానం ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి సూచన ప్రకారం, అత్యంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించి వాహనదారులకు ప్రత్యక్షంగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అయితే, ఈ విధానం కోసం పోలీస్ విభాగం వెంటనే తగిన సంఖ్యలో డ్రోన్లను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. డ్రోన్ల ద్వారా వాహనాల రద్దీపై అంచనాలు వేయడం, రూట్ మార్గాలను సూచించడం, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే చర్యలు చేపట్టడం లక్ష్యంగా ఉంది. ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణలో నూతన యంత్రాంగం వేగంగా అమలు కానుందని అధికారులు తెలిపారు.
Local to international