Skip to main content

Posts

Showing posts from November 13, 2025

ఉరవకొండలో ఘనంగా 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం:వై. ప్రతాప్ రెడ్డి

  ఉరవకొండ, జిల్లా గ్రంథాలయ సంస్థ, అనంతపురం ఆధ్వర్యంలో పనిచేయుచున్న శాఖా గ్రంథాలయం ఉరవకొండ నందు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మండల విద్యాధికారి (M.E.O.) ఈశ్వరప్ప ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. చాచా నెహ్రూకు నివాళులు: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తొలుత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి ఎంఈఓ ఈశ్వరప్ప పూలమాల వేసి నివాళులర్పించారు. పుస్తక సంపదను సద్వినియోగం చేసుకోండి: ఈ సందర్భంగా ఎంఈఓ ఈశ్వరప్ప విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న అపారమైన పుస్తక సంపదను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. "ఎక్కడ అందుబాటులో లేని పురాతన పుస్తకాలు సైతం గ్రంథాలయాలలో లభిస్తాయి. గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనందరి బాధ్యత," అని తెలిపారు. గ్రంథాలయ ఉద్యమకారులైన ఎస్. ఆర్. రంగనాథన్, కల్లూరు సుబ్బారావు, అయ్యాంకి వెంకటరమణయ్య వంటి వారి కృషి వలనే నేడు ఇన్ని గ్రంథాలయాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు. సాహిత్యంపై తనకు మక్కువ గ్రంథాలయం ద్వారానే పెరిగిందని, సాంకేతికత ఎంత పెరిగినా పుస్తకం విలు...

విద్యార్థులు మన దేశానికి ఆశా దీపాలు... కరెంట్ గోపాల్

  ఉరవకొండ పట్టణం లో ఎమ్ పీ పీ యస్ సెంట్రల్ స్కూల్ లో బాల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఉన్న మన సెంట్రల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు టీచర్లు అయిన S. శ్రీనివాసులు , D. శ్రీనివాసులు , K. హరికృష్ణ , P. చంద్రశేఖర్ నెహ్రూ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు   మన దేశానికి ఆశాదీపాలైన న ప్రియమైన విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలుతెలిపారు. వక్తలు వేడుక ప్రముఖ్యత వివరించారు. మన దేశానికి మొదటి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. నెహ్రూ గారికి పిల్లలంటే ఎంతగానో ఇష్టం. ఆయన పిల్లలను "రేపటి దేశ నిర్మాతలు" అని అనేవారు. అందుకే ఆయన్ను మనం ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుస్తాం. ఆయన జ్ఞాపకార్థం, పిల్లల పట్ల ఆయనకున్న ప్రేమను స్ఫూర్తిగా తీసుకుని, ఈ రోజును మన బాల్యం యొక్క విలువను గుర్తుచేసుకోవడానికి కేటాయించారని వక్తలు తెలిపారు. మరో వక్త కరెంట్ గోపాల్ మాట్లాడుతూ బాలలారా, మీరే మన నిజమైన శక్తిగా అభివర్ణించారు. నేను గ్రామ పంచాయతీలోఉక్కీసుల గోపాల్ సీనియర్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తాను. ప్రతి ఇంటికి, ప్రతి పాఠశాలకు వెలుగు ...

32 కార్లు… 8 మానవ బాంబులు

దేశాన్ని కుదిపేసే ఉగ్ర యత్నాన్ని భగ్నం చేసిన ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా సంచలనానికి గురిచేస్తూ, 32 కార్లలో బాంబులు అమర్చి, ఒకేసారి ఎనిమిది ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన ఫరీదాబాద్‌ ఉగ్ర ముఠా భారీ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బయటపెట్టింది. ఇందులో పాల్గొన్న సభ్యులందరూ వైద్యులే కావడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అసాధారణ విధ్వంసానికి పన్నిన పథకం ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం — మొత్తం 32 కార్లను పేల్చే ప్రణాళిక వాటిని నాలుగు గ్రూపులుగా విభజించిన 8 మానవ బాంబులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాన లక్ష్యం ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ దీనికే వేదికగా హర్యానాలోని అల్‌ ఫలాహ్ యూనివర్సిటీ యూనివర్సిటీ హాస్టల్‌లోని 17వ భవనంలోని 13వ గది ఈ ముఠాకు ప్రధాన స్థావరంగా మారినట్లు గుర్తించారు. టర్కీ నుంచి ఆదేశాలు – ‘ఉకాసా’ అనే హ్యాండ్లర్ దాడుల వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై పరిశోధనలో కీలకమైన విషయం తెలిసింది. టర్కీలో ఉన్న ‘ఉకాసా’ అనే అనుమానాస్పద వ్యక్తి ఈ మాడ్యూల్‌కి నిరంతరం ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కమ్యూనికేషన్ కోసం స్విట్జర్లాండ్‌కు చెందిన త్రీమా (Threema) య...

విశాఖ ను మరో బాంబేగా తీర్చిదిద్దుతా సీ యం. చంద్రబాబు నాయుడు.

 విశాఖ ను మరో బొంబాయి గా తీర్చి దిద్దుతా మని ఏపీ సీ యం చంద్రబాబు వెల్లడించారు. విశాఖ ఎకనమిక్ రీజియన్' కు సంబంధించిన సమావేశం లేదా కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టిలో, విశాఖ ఎకనమిక్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గాపనిచేయాలి. దీనిని రాబోయే ఏడేళ్లలో (2032 నాటికి) ఒక ప్రధాన ఆర్థిక శక్తి కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థిక లక్ష్యాలు    2032 నాటికి లక్ష్యం: ఈ రీజియన్ నుండి $120 బిలియన్ డాలర్ల (సుమారు ₹10 లక్షల కోట్లు) ఆర్థిక కార్యకలాపాలు లేదా జీడీపీని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.   ఈ ప్రాంతం ప్రస్తుత జీడీపీ సుమారు $49 బిలియన్ డాలర్లుగా ఉంది. సుమారు $100 బిలియన్ నుంచి $115 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది 'విశాఖ ఎకనమిక్ రీజియన్'లో మొత్తం ఎనిమిది జిల్లాలు ఉన్నాయి: విశాఖపట్నం,విజయనగరం,శ్రీకాకుళం,అనకాపల్లి,కాకినాడతూర్పు గోదావరిఅల్లూరి సీతారామరాజు మన్యంఈ రీజియన్ శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు విస్తరించి ఉ...

శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్‌ను తేనున్న టీటీడీ

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో తీపికబురు అందించింది. టెక్నాలజీని వినియోగించుకుంటూ భక్తులకు మరింత మెరుగైన, సులభమైన సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టెక్ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్‌ భాగస్వామ్యంతో త్వరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ ఏఐ చాట్‌బాట్‌ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు, ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో పొందవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌలభ్యం కోసం ఈ సేవలను ఏకంగా 13 భాషల్లో అందించనున్నారు. అంతేకాకుండా, భక్తులు తమ ఫిర్యాదులను, సలహాలు, సూచనలను కూడా ఈ చాట్‌బాట్‌ ద్వారా సులభంగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్ట్స్, టెక్ట్స్ టు స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు కూడా ఉండనున్నాయి. దీనివల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా కూడా సమాచారాన్ని పొందగలరు. ఈ అత్యాధునిక చాట్‌బాట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, టీటీడీ పాలనలో పారదర్శకత ...

నర్సింగ్ హోమ్ నిర్మాణం, ఏర్పాటుకు కీలక నిబంధనలివే!

- ప్రైవేట్ ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ మరియు రెగ్యులేషన్ చట్టం-2002 కింద నిబంధనలు జారీ - అనుమతులు...తూచ్ అనుమతులు లేని నర్సింగ్ హోమ్ ఉరవకొండ నివాస నిర్మాణం ముసుగులో అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఓ డాక్టర్ చట్టవ్యతిరేకంగా నర్సింగ్ హోమ్ నిర్మిస్తున్నారు. ఉన్నత చదువు కోసం ఆయన దీర్ఘ కాలిగ సెలవులో వెళ్లారు. అంతటితో ఆగకుండా పొట్టి  శ్రీరాములు విగ్రహ సమీపంలో యాథేచ్చగా ప్రైవేట్ క్లినిక్ నిర్వహించిస్తూ అక్రమాలకు తెరలేపారు. ఈచేదు నిజాలను జిల్లా వైద్యాధికారికి జిల్లా సహచ కార్యదర్శి మీనుగ మధు బాబు ఫిర్యాదు చేశారు. అయితే అక్రమార్కునిపై చర్యలు తీసుకోకుండా చేష్టలుడిగారు. అయితే ఓ చిన్న ప్రైవేట్ క్లినిక్ పై పిచ్చుకపై బ్రహ్మస్రం అన్న చందగా చర్యలు తీసుకోవడం పై వైద్యాధికారులు పెద్ద ఎత్తున విమర్శలు మూట గట్టుకున్నారు. నిభందనలు ఇలా ఉన్నాయి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి ప్రభుత్వం కఠినమైన నియమాలను నిర్దేశించింది. ముఖ్యంగా 25 పడకల (బెడ్స్) సామర్థ్యం గల ప్రైవేట్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనుకునేవారు, రిజిస్ట్రేషన్ నుండి మౌలిక సదుపాయాలు, సిబ్బంది, మరియు త...

నిమ్మల రామానాయుడు గారి డొంక తిరుగుడు సమాధానంతో గందరగోళం!

 పోలవరం నుండి నల్లమల సాగర్ రిజర్వాయర్ వరకు రెండు దశల్లో నిర్మాణం చేపడితే,నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని శ్రీశైలం రిజర్వాయర్ లోకి ఎత్తి వస్తారా,లేక రివర్స్ పంపింగ్ ద్వారా బనకచర్లకు తీసుకెళ్తారా? లేక సోమశిల రిజర్వాయర్ కు తీసుకెళ్లాలా? అనే అంశం పై జలవనరుల శాఖా మాత్యులు నిమ్మల రామానాయుడు గారు చెప్పిన డొంక తిరుగుడు సమాధానం, తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడకు గడ్డి కోయడానికి అన్నట్లుగా ఉంది.     పోలవరం-బనకచెర్ల డిపిఆర్ తయారు చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను ఎందుకు రద్దు చేశారో నిజాయితీగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ శాఖ మంత్రి పైన ఉన్నది.      మంత్రిగారి డొంక తిరుగుడు సమాధానం ప్రజలలో మరింత గందరగోళాన్ని సృష్టించడానికి దోహదపడేలా ఉన్నది. ఈ వ్యాఖ్యలు ముమ్మాటికీ అవగాహనా రాహిత్యంతో చేసినవి తప్ప మరొకటి కాదు.    నిపుణులతో మాట్లాడిన తర్వాత టెండర్లు రద్దు చేశామని చెప్పారు,బాగానే ఉన్నది,కానీ ఏ నిపుణులు,ఏ ఇంజనీరింగ్ అధికారులు నల్లమల సాగర్ నుండి శ్రీశైలం జలాశయానికి,లేదా బనకచర్లకు తరలించే సూచనలు చేశారో చెప్పగలరా?   ...

తల్లి సంరక్షణలో వైఫల్యం: కొడుకుకు ఇచ్చిన ఆస్తి గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసిన ట్రిబ్యునల్

  - సీనియర్ సిటిజన్స్ చట్టం కింద సంచలన ఉత్తర్వులు అనంతపురం జిల్లా ఉరవకొండ: తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణమరియు swసంక్షేమ చట్టం, 2007 కింద గుంతకల్‌లోని రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు ట్రిబ్యునల్ అధ్యక్షులు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధురాలైన తల్లిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మోసపూరితంగా ఆమె ఆస్తిని తన మైనర్ కుమార్తెల పేరు మీద గిఫ్ట్ డీడ్‌గా రాయించుకున్న పెద్ద కుమారుడి చర్యను తప్పుబడుతూ, సదరు గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తూ ఆర్.డి.ఓ. ఉత్తర్వులిచ్చారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి: కేసు నేపథ్యం: ఉరవకొండ గ్రామం, పాతపేటకు చెందిన వడ్డే ఆదిలక్ష్మి (73) అనే వృద్ధురాలు తన పెద్ద కుమారుడు, బెంగళూరు నివాసి అయిన వడ్డే కిషోర్ కుమార్ తనను సరిగా చూసుకోకుండా, మోసం చేసి తన ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ గుంతకల్ ఆర్.డి.ఓ./నిర్వహణ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆస్తి బదిలీలో మోసం: ఆదిలక్ష్మి భర్త మరణానంతరం, ఆమె తన పెద్ద కుమారుడిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో, తన నివాస గృహ ఆస్తిని తన పేరు మీదకు బదిలీ చేస్తారని నమ్మబలికిన కుమారుడు, ఆమెను సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసు...