Skip to main content

Posts

Showing posts from November 4, 2025

గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పునరుద్దరించాలి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఉరవకొండ శాఖ ఆధ్వర్యంలో బుధవారం బస్సు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం అందడం జరిగింది ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కన్వీనర్ శివరాజ్ మాట్లాడుతూ చుట్టుపక్కల ఉన్న పాల్తూరు, వన్నూరు, ఆవలికి , గోవిందవాడ వంటి గ్రామాల నుండి వస్తున్న విద్యార్థులు కి సమయానికి బస్సులు రావడం లేదు ఇలా ఉంటే విద్యార్థులు తరగతులకు ఆలస్యం అవుతున్నారు. ఇది వారి విద్యపై ప్రభావం చూపుతోంది దీనిపై మీరు వెంటనే స్పందించి సమయానికి బస్సులను నడపాలని అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎబివిపి ఉరవకొండ శాఖ ఆధ్వర్యంలో తెలియడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎబివిపి ఉరవకొండ బాగ్ కన్వీనర్ నిఖిల్ తేజ , కార్యకర్తలు సురేష్, బాబు పాల్గొనడం జరిగింది

పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెన్షన్ — అధికారుల తక్షణ చర్య

శ్రీకాకుళం: మెళియాపుట్టి  మండలం బందపల్లి గ్రామంలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థులతో తన కాళ్లు నొక్కించుకోవడం వీడియో రూపంలో బయటకు రావడంతో జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వీడియోలో ఆ ఉపాధ్యాయురాలు కుర్చీలో కూర్చుని సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, పక్కనే ఉన్న విద్యార్థులతో కాళ్లు నొక్కించుకుంటూ కనిపించడంతో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ప్రజలు, తల్లిదండ్రులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాపంపేట సోత్రీయ భూములపై అక్రమ GPA నమోదు – రెవెన్యూ మంత్రికి సిపిఐ వినతిపత్రం

అనంతపురం రూరల్ :  పాపంపేట గ్రామంలోని సోత్రీయ (ఇనామ్) భూములపై చెల్లని పత్రాల ఆధారంగా అక్రమ GPAలు నమోదవుతున్నాయని ఆరోపిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ మంత్రిని సిపిఐ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా సిపిఐ ప్రతినిధులు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. సిపిఐ నాయకులు తమ వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, పాపంపేట గ్రామం 1948లోని ఎస్టేట్స్ (అబాలిషన్ అండ్ కన్వర్షన్ టు రైత్వారీ ఆక్ట్) పరిధిలోకి వచ్చిన ఇనామ్ ఎస్టేట్. రాష్ట్ర ప్రభుత్వం G.O.Ms No.728 (తేదీ 29 ఏప్రిల్ 1964) ప్రకారం ఎస్టేట్‌ను రద్దు చేయడమే కాక శ్రోత్రియదార్ల హక్కులను కూడా రద్దు చేసింది. తర్వాత G.O.Ms No.936 (తేదీ 19 సెప్టెంబర్ 1967) ప్రకారం ప్రభుత్వం నియమించిన సెటిల్‌మెంట్ అధికారి భూములను పరిశీలించి, నిజమైన యజమానులకు రైత్వారీ పట్టాలు జారీ చేశారు. అయితే, ఇటీవల రాచూరి వెంకట కిరణ్ అనే వ్యక్తి 1952 మరియు 1956 సంవత్సరాల కుటుంబ విభజన పత్రాల ఆధారంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ GPAలు నమోదు చేయించుకున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈ పత్రాలు ఎస్టేట్ రద్దు తరువాత చెల్లుబాటు కాని వాటని, మొత్తం 22 ఎకరాలకు పైగా భూములపై తప్పుడు రిజిస...

30 ఏళ్లుగా కడ్లే గౌరమ్మ ఉత్సవాలకు ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వితరణ

ఉరవకొండ :  విడపనకల్లు మండలం, పాల్తూరు గ్రామం, ఎస్సీ కాలనీలో కొలువైయున్న కడ్లే గౌరమ్మ దేవి ఆలయ ఉత్సవాలకు ఎమ్మెల్సీ కొనకొండ్ల వై. శివరామిరెడ్డి గత 30 సంవత్సరాలుగా నిరంతరాయంగా వితరణ అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించడానికి అయ్యే ఖర్చును ఆయనే సమకూర్చారు. మూడు దశాబ్దాల సేవ  ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి 1995వ సంవత్సరం నుండి నేటి వరకు (దాదాపు 30 సంవత్సరాలుగా) ప్రతి ఏటా గౌరమ్మ దేవాలయ ఉత్సవాల కొరకు విద్యుత్ దీపాలంకరణ మరియు ఇతర సామాగ్రి కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఎమ్మెల్సీ శివరామరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా తమ దేవాలయానికి చేస్తున్నటువంటి సేవను మరువలేమ"ని కొనియాడారు. ఈ సంవత్సరం కూడా ఆయన సహకారంతో ఉత్సవాలకు అవసరమయ్యే విద్యుత్ దీపాలంకరణ సామాగ్రిని సమకూర్చుకున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఉదారతను గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు , మహేష్, ధనుంజయ, దేవేంద్ర నవీను, సుధాకర్, మహదేవ్, నాగప్ప, మాలింగా, ఉపసర్పంచ్ సుంకన్న, రామ...

ఏడు నుంచి దర్గా హోన్నూరు ఉరుసుషరీఫ్ వేడుకలు ప్రారంభం .

  బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూర్ గ్రామంలో వెలిసిన హజరత్ సయ్యద్ కాజాసయ్యద్ షో సోఫీ శర్మాస్ హుసేని స్వాములవారి 347 ఉరుసు వేడుకలు ఈనెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఏడో తేదీన శుక్రవారం గంధం, ఎనిమిదో తేదీ దీపారాధన,9వ తేదీ రెండవ దీపారాధన, పదవ తేదీ దేవుని సవారి, 11వ తేదీన జియరత్ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దర్గాను వివిధ రంగులతో సుందరంగా అలంకరిస్తున్నారు. జిల్లా నల్ల మూలల నుంచే కాక కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తుల కోసం త్రాగునీరు ,విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు . ఉరుసు లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సంతకాలు సేకరించారు. రచ్చబండ కార్యక్రమంలో, కమిటీల ఏర్పాటు ఈరోజు "వెలి గొండ లత్తవరం తండా" మరియు బూదగవి గ్రామాలలో కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజల సంతకాలు సేకరించారు. అలాగే, ఈ రెండు గ్రామాలలో ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి గ్రామ ముఖ్య కమిటీలు మరియు అనుబంధ కమిటీలను కూడా నియమించడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2022 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజీలకు శాంక్షన్ ఆర్డర్స్ తీసుకువచ్చిందని తెలిపారు.  పూర్తైన కాలేజీలు: ఇందులో ఇప్పటికే 7 కాలేజీలు పూర్తి అయ్యాయి.  పూర్తి కావాల్సినవి: మరో 10 కాలేజీలు పూర్తి కావాల్సి ఉంది.   ప్రభుత్వ లక్ష్యం: కేవలం ₹5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తవుతాయని,...

చాబాల యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా చల్లా అనంతయ్య నియామకం

అనంతపురం జిల్లా, వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామానికి చెందిన చల్లా అనంతయ్య యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆదివారం రోజు సాయంత్రం 4 గంటల సమయంలో అనంతపురం పట్టణంలోని నక్కా రామారావు యాదవ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో, జాతీయ కార్యనిర్వాహాక అధ్యక్షులు డా. లాకా వెంగలరావు యాదవ్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.  ఈ సందర్భంగా చల్లా అనంతయ్య మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యాదవ సంఘం బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు మరియు తెదేపా జిల్లా నాయకులు రేగాటి నాగరాజు, గొల్ల గోపాల్, గొల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి బొమ్మనహల్ మండలంలో శ్రీ గజగౌరీ, శ్రీ కడ్లే గౌరమ్మ దేవి ఉత్సవాలు ప్రారంభం

  బొమ్మనహల్ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బొమ్మనహల్ మండల పరిధిలో నేటి (బుధవారం, నవంబర్ 4) తెల్లవారుజాము నుంచే శ్రీ గజగౌరీ, శ్రీ కడ్లే గౌరమ్మ దేవి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పెద్దలు, నిర్వాహకులు అమ్మవారి ఆలయాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.  పలు గ్రామాలలో ఉత్సవాల వివరాలు మండలంలోని పలు గ్రామాలలో ఉత్సవాల నిర్వహణ తేదీలను గ్రామ పెద్దలు, కార్యనిర్వాహకులు ప్రకటించారు. | గ్రామం | విగ్రహ ప్రతిష్ట | చెక్కెర హారతులు | నిమజ్జనం | |---|---|---|---| | ఉద్దేహాల్, ఉంతకల్లు, గోనేహాల్, శ్రీధరఘట్ట, బొమ్మనహల్, బోల్లనగుడ్డం | నవంబర్ 4 (నేడు) తెల్లవారుజాము | నవంబర్ 6 సాయంత్రం | నవంబర్ 7 తెల్లవారుజాము | | గోవిందవాడ, సింగేపల్లి, కల్లుహోల్ల | నవంబర్ 10 | నవంబర్ 11 | నవంబర్ 12 |   ప్రత్యేక పూజలు: ఈ ఉత్సవాల్లో భాగంగా మహిళా మణులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, చెక్కెర హారతులను సమర్పించనున్నారు.   నిమజ్జనం: నిర్ణీత తేదీలలో ...

ఉరవకొండ లో ఊరూరా మద్యం బెల్ట్ షాపులు అరికట్టాలి

  - మహిళలపై జరుగుతున్న హింస ను నియంత్రించాలి ఉరవకొండ మండలం లో  గ్రామీణ ప్రాంతాలలో విచ్చలవిడిగా వెలిసిన మద్యం బెల్ట్ షాపులను ప్రభుత్వం అరికట్టాలని, మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసను నియంత్రించాలని సిపిఐ పార్టీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య (ఎన్ఎఫ్ ఐడబ్ల్యూ) అనంతపురం జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ తెలిపారు.  మంగళవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మద్యం బెల్ట్ షాపుల వల్ల యువత మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అంతేకాకుండా మద్యం కారణంగా అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని రోడ్డు ప్రమాదాలు కుటుంబ కలహాలు మద్యం వల్ల జరుగుతున్నాయని ప్రభుత్వం తక్షణమే వీటిని నియంత్రించాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మహిళల అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం వెంటనే అమలు చేయాలన్నారు. ఉచిత గ్యాస్ పథకం కూడా అనేకమంది మహిళలకు అందడం లేదని అర్హులైన వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింప ...

విద్యార్థినులతో వికృత చేష్టలు చేసిన ఎన్ ఎస్ టీచర్‌ను తొలగించాలని డిమాండ్

వెంకటాంపల్లి జడ్పీ హైస్కూల్‌లో కలకలం ఉరవకొండ,  (నవంబర్ 4): వజ్రకరూరు మండలం వెంకటాంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (ZPHS) చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన (వికృత చేష్టలు) ఎన్ఎస్ (NS) సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుడిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు మంగళవారం ఇన్‌ఛార్జి హెడ్‌మాస్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.   తల్లిదండ్రులు, గ్రామస్తుల ఆగ్రహం ఎన్ఎస్ ఉపాధ్యాయుడు బాలికల పట్ల వికృత చేష్టలకు పాల్పడటం, వారిని ఇబ్బందులకు గురిచేసి పైశాచిక ఆనందం పొందడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.   విషయాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం ఈ సంఘటనను పాఠశాల హెడ్‌మాస్టర్, ఎన్ఎస్ టీచర్‌తో కలిసి తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని, తమను మన్నించాల్సిందిగా తల్లిదండ్రులను వేడుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ టీచర్ గతంలో కూడా ఇలాంటి చేష్టలకు పాల్పడ్డాడని, ఆ చేదు జ్ఞాపకాలు మరువకముందే మళ్లీ పునరావృతం అయ్యాయని వారు తెలిపారు. సెలవు తర్వాత విధుల్లోకి సదరు ఉపాధ్యా...