Skip to main content

Posts

Showing posts from October 4, 2025

తొక్కిసలాటపై ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు – "ఇది పక్కా ప్రణాళికతో జరిగింది!

కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన దారుణ తొక్కిసలాట ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. ఖుష్బూ మాట్లాడుతూ, “ఈ ఘటన యాదృచ్ఛికం కాదు... పక్కా ప్రణాళికతో కావాలనే సృష్టించినట్లు కనిపిస్తోంది,” అంటూ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు. తొక్కిసలాటలో జరిగిన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, దీనికి ఎవరో కావాలనే కారణమై ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వకపోవడాన్ని ఖుష్బూ తీవ్రంగా విమర్శించారు. “41 మంది ప్రాణాలు పోయాయి... కానీ సీఎం స్టాలిన్ మాత్రం మౌనం వహిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడాలి. ర్యాలీలో పోలీసులు లాఠీ ఛార్జ్ ఎందుకు చేశారు?” అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయని, వాటి ఆధారంగా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక కరూర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టింది.

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...

బూదగవి భూ కబ్జాపై ఉరవకొండ తాసిల్దార్ విచారణ: కబ్జాదారుడు గైర్హాజరు

ఉరవకొండ, : మండల పరిధిలోని బూదగవి గ్రామంలోని సర్వే నంబర్ 371 పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందన్న ఆరోపణలపై శనివారం ఉరవకొండ తాసిల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ భూ కబ్జాకు సంబంధించి, ఉరవకొండ పట్టణానికి చెందిన ఆదోని ఆదాం సాబ్ అనే వ్యక్తి పొలాన్ని కబ్జా చేశాడని ఆరోపిస్తూ మీనుగ మధుబాబు తాసిల్దార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన తాసిల్దార్ శనివారం విచారణ నిర్వహించారు. కబ్జాదారుడు గైర్హాజరు, ఫిర్యాది వాదన అయితే, ఈ విచారణకు కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదాం సాబ్ గైర్హాజరు అయ్యారు. ఫిర్యాదుదారుడు మీనుగ మధుబాబు మాత్రం హాజరై తన వాదనను అధికారికి వినిపించారు. మధుబాబు మాట్లాడుతూ, సర్వే నంబర్ 371లోనిది ప్రభుత్వ స్థలం/పొలం అని, దీనికి సంబంధించి ఎలాంటి గొలుసు ఆధారిత పత్రాలు (chain documents) లేవని తెలిపారు. అయితే, తాసిల్దార్ అది కొనుగోలు పత్రం అని ఫిర్యాదికి తెలిపినట్టు సమాచారం. గొలుసు ఆధారిత పత్రాలు లేకపోవడం, కబ్జాదారుడు విచారణకు గైర్హాజరు కావడం వంటి అంశాలను మధుబాబు తాసిల్దార్ దృష్టికి తెచ్చారు. అనుమానం వ్యక్తం చేసిన ఫిర్యాది ఈ సందర్భంగా మధుబాబు ఒక కీలక అంశాన్ని ప్రస్తావి...

అనంతపురం జిల్లాలో సంచలనం: అంతర్రాష్ట్ర ఆలయ దొంగల ముఠా అరెస్ట్

అనంతపురం (పోలీస్ ప్రెస్ మీట్): ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు అనంతపురం జిల్లా పోలీసులు శనివారం ప్రకటించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ముఖ్య అంశాలు:   అరెస్ట్: పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసి, వారి నుంచి భారీగా దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.  స్వాధీనం చేసుకున్న సొత్తు:     వెండి : 12 కిలోలు    * బంగారం : 44 గ్రాములు    రాగి బిందెలు 5 కిలోలు  దొంగతనం విధానం: ఈ ముఠా ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లోని ఆలయాలను లక్ష్యంగా చేసుకొని, అక్కడి విగ్రహాలు, ఆభరణాలు, పూజా సామగ్రిని చోరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెల్లడించిన వివరాలు: "గత కొంతకాలంగా అనంతపురం జిల్లాలో కొన్ని ఆలయాల్లో చోరీలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారం ద్వారా ఈ అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకోగలిగాం. పట్టుబడిన నిందితుల నుంచి దొంగిలించబ...

ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన: రెండు తలల దూడ జననం

  కుంచేపల్లి (ప్రకాశం జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పొదిలి మండలం, కుంచేపల్లి గ్రామంలో ఒక గేదెకు రెండు తలలు ఉన్న దూడ జన్మించింది. ఈ అద్భుతాన్ని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రైతు అన్నపురెడ్డి వెంకటరెడ్డికి చెందిన గేదె శనివారం ఈ అసాధారణ దూడకు జన్మనిచ్చింది. సాధారణంగా జరగని ఈ ఘటనతో స్థానికులు దానిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సమాచారం అందుకున్న పశువైద్యాధికారులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. పశువైద్యులు బ్రహ్మయ్య దూడను పరీక్షించి, ఇది ఒక జన్యుపరమైన లోపం (Genetic Defect) కారణంగా అరుదుగా సంభవించే సంఘటన అని తెలిపారు. ప్రస్తుతం రెండు తలల దూడ ఆరోగ్యంగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ బ్రహ్మయ్య ధృవీకరించారు. అరుదైన జీవిగా జన్మించిన ఈ దూడ ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

సింగపూర్: సెక్స్ వర్కర్లపై దాడి, దోపిడీ కేసులో ఇద్దరు ఇండియన్లకు ఐదేళ్ల జైలు, కొరడా దెబ్బలు 🇸🇬

  సింగపూర్: సింగపూర్‌లో వేసవి సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చి, ఇద్దరు సెక్స్ వర్కర్లపై దాడి చేసి, దోపిడీకి పాల్పడినందుకు గాను ఇద్దరు భారతీయ యువకులకు సింగపూర్ కోర్టు కఠిన శిక్ష విధించింది. వారికి ఐదు సంవత్సరాల ఒక నెల జైలు శిక్షతో పాటు 12 బెత్తం దెబ్బల శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు: ఘటన వివరాలు ఏప్రిల్ 24న సెలవుల నిమిత్తం సింగపూర్‌కు వచ్చిన ఆరోక్కియసామి డైసన్ (23), రాజేంద్రన్ (27), ఏప్రిల్ 26న లిటిల్ ఇండియా ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఇద్దరు సెక్స్ వర్కర్ల పరిచయం పొందారు. డబ్బు కోసం ఈ ఇద్దరు యువకులు ఒక హోటల్ గదిలో ఆ సెక్స్ వర్కర్లపై దాడి చేసి, వారిని గాయపరిచి, చోరీకి పాల్పడ్డారు. కోర్టు విచారణ, తీర్పు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి, డైసన్ మరియు రాజేంద్రన్‌లను అరెస్ట్ చేసి, ఇటీవల కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా, నిందితులు తమ వద్ద డబ్బులు లేకపోవడం వల్లే ఈ నేరానికి పాల్పడ్డామని కోర్టుకు విన్నవించారు. అయినప్పటికీ, నేరం తీవ్రత దృష్ట్యా, సింగపూర్ కోర్టు ఇద్దరు యువకులకు నేరం రుజువైనట్టు నిర్ధారించి, తీవ్ర శిక...

పెన్నహోబిలంలో వైభవంగా పల్లకి సేవ

   ఉరవకొండట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 4 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పెన్నాహోబిలంలో జరిగే పల్లకి సేవను భక్తులు అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.. పల్లకి సేవ నిర్వహణను ఈ ఆలయంలో సాధారణంగా ప్రతి శనివారం సాయంత్రం స్వామివారికి పల్లకి సేవను నిర్వహిస్తారు. శనివారం నాడు నరసింహస్వామిని దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు అలాగే శ్రావణ మాసం వంటి పవిత్ర మాసాలలో మరియు వార్షిక బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు వంటి పెద్ద ఉత్సవాల సందర్భాలలో కూడా పల్లకి సేవను మరింత ఘనంగా నిర్వహిస్తారు. సేవ విధానం: అలంకరణ: ఉత్సవాలకు ముందు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉత్సవమూర్తులను అత్యంత సుందరంగా, పట్టు వస్త్రాలు మరియు వివిధ రకాల పుష్ప మాలలతో అలంకరిస్తారు కొలువుదీర్చడం:అలంకరించిన ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా సిద్ధం చేసిన పల్లకిలో ఆశీనులను చేస్తారు.    * ఊరేగింపు (ప్రదక్షిణ): స్వామివారు కొలువుదీరిన పల్లకిని అర్చకులు మరియు భక్తులు తమ భుజాలపై మోస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజన కీర్తనలతో కూడిన కోలాహలం మధ్య ఆలయ ప్రాంగణం చుట్టూ లేదా పురవీధుల్లో ఊరేగిస్తారు.  సే...

స్థానిక ఎన్నికల ముందు కుల గణన తప్పని సరి సిపిఐ

 ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేపట్టాలి: సీపీఐ డిమాండ్‌ ఉరవకొండ మన జన ప్రగతి అక్టోబర్ 4:  జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని, దాని ఆధారంగా బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్లు కేటాయించాలని సీపీఐ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా) డిమాండ్ చేసింది. ఈ మేరకు అనంతపురం నగరంలోని రామ్ నగర్‌లోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో సీపీఐ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాల సమన్వయంతో ఒక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షత వహించగా, సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసరి శంకర్రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ కూడా పాల్గొన్నారు. స్థానిక ఎన్నికలకు ముందు కులగణన తప్పనిసరి సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలలో జనగణనలో కులగణన చేపట్టి, దాని ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించారని, ఎస్సీ, ఎస్టీలకు సైతం జనాభా ప్రాతిపదికనే కేటాయించా...