Skip to main content

Posts

Showing posts from November 11, 2025

రాష్టం గర్వించదగ్గ నాయకుడిగా ఎంత ఎదిగి పోయావయ్యా.- మాస్టర్ గంగాధర్ శాస్త్రి

రాష్ట్ర ఆర్థిక మంత్రికి గురువందనం: పయ్యావుల కేశవ్‌కు గురువు ఆశీస్సులు!   పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురు భక్తిని చాటుకున్నారు. పవిత్ర ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తిలో నివాసముంటున్న తన బాల్య గురువు, రిటైర్డ్ ఉపాధ్యాయులు గంగాధర శాస్త్రి గారిని ఆయన ఆత్మీయంగా కలుసుకున్నారు. శాంతి నిలయంలో గురువు గారితో అనుబంధాన్ని పంచుకున్న మంత్రి కేశవ్, సాష్టాంగ నమస్కారం చేసి, కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. గురువు గారి భావోద్వేగం: "రాష్ట్రం గర్వించదగిన నాయకుడివి" తన శిష్యుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఎదిగిన తీరును చూసి ఉపాధ్యాయులు గంగాధర శాస్త్రి గారు అమితానందం వ్యక్తం చేశారు. "ఏం నాయనా.. బాగున్నావా... రాష్ట్రం గర్వించదగిన నాయకుడు అయ్యావు సంతోషం" అని అభినందించారు. తన వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్న విద్యార్థి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుచేసే ఆర్థికవేత్త అవుతాడని ఊహించలేదని చెబుతూ గంగాధర శాస్త్రి గారు భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి కేశవ్: ఈ రోజు నాకు అమితానందం గురువును కలిసిన సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ కూడా తన బాల్య అనుబంధాన్ని గుర్తు చ...

వజ్రకరూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం

  అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల కేద్రం లో వైస్సార్ సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజ వర్గం సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై. విశ్వేశ్వర్ రెడ్డి నాయకత్వంలో జరిగే "ప్రజా ఉద్యమం" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు బిందెల సోమశేఖర్ రెడ్డి  పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉస్మాన్, చాపల సర్పంచ్ మల్లెల జగదీష్ , మైనార్టీ నాయకులు కట్టా కాజా పీరా, రఘుపతి, తిప్పారెడ్డి, జాఫర్, ఆదినారాయణ, ధర్మపురి అశోక్ పాల్గొన్నారు

భారత్‌తో ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం: ట్రంప్ కీలక ప్రకటన

  భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరలో ఉన్నామని ఆయన వెల్లడించారు. గతంలో జరిగిన ఒప్పందాలకు ఇది పూర్తిగా భిన్నంగా, ఇరు పక్షాలకు న్యాయం చేకూర్చేలా ఉంటుందని స్పష్టం చేశారు. అందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంటోందని ట్రంప్ తెలిపారు. భారత్‌కు అమెరికా నూతన రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్, ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. గోర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు అద్భుతమైన సంబంధాలున్నాయని అన్నారు. అమెరికాకు ఉన్న అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధం ఒకటని ఆయన అభివర్ణించారు. "ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటైన భారత్ అద్భుతమైన దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మాకు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక భద్...

తెలుగుదేశంపార్టీ గౌరవ శాసనసభ్యుల నెలవారి టైం_టేబుల్ :

1st: పింఛన్ల పంపిణీ కార్యక్రమం 5th: ప్రభుత్వ పాఠశాల visit 10th: అన్న canteen లో భోజనం 15th: ప్రభుత్వ ఆసుపత్రి visit 20th: CMRF/TDP కార్యకర్తల భీమా పంపిణీ  25th: MRO లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల visit

సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ. మంత్రి నారా లోకేష్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజా దర్బార్ మంగళగిరి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 72వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను స్వయంగా కలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా అర్జీలు పరిష్కరించి అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు అక్రమ కేసులతో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వేధించారు - టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనపై అక్రమంగా హత్య కేసు బనాయించి ఇబ్బందులకు గురిచేశాడని, దీంతో తీవ్రంగా నష్టపోయానని సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం శిరిగారిపల్లికి చెందిన కే.రవీంద్ర మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి ...

మరో తుఫాను.. మళ్లీ ఏపీలో వర్షాలు!

ఏపీ - మొంధా తుఫాను విధ్వంసం నుంచి కోలుకోక ముందే రాష్ట్రాన్ని మరో ముంపు ముప్పు వెంటాడుతుంది ఈ నెల 19/20వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణం శాఖ నిపుణులు వెల్లడించారు.  ఇది తుఫానుగా బలపడి ఈ నెల 25 నాటికి తీరం దాటవచ్చని దీని ప్రభావంతో కోస్తా జిల్లాలపై భారీ వర్షా ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాగే మరో నాలుగు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో ఏపీ రాష్ట్రంలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేశారు ...

భారతీయులకు రష్యా బంపరాఫర్.. ఏకంగా 70 వేల మందికి ఉద్యోగాలు

రష్యా మోసాలను అరికట్టి, కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యం భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థలో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ, టెక్స్‌టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి భారత మానవ వనరులను ఆహ్వానిస్తోంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇప్పటికే రష్యాలో పనిచేస్తున్న భారతీయుల ప్రయోజనాలకు భద్రత లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో 70,000 మందికి పైగా భారతీయులు అధికారికంగా ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అంచనా. మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ బిజినెస్ అలయన్స్ (IBA) ఈ ఒప్పందాన్ని స్వాగతించింది. ఇది ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్త...

సాయి జయంతి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రుల బృందం

  పుట్టపర్తి, నవంబర్ 11, 2025  భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు ఈరోజు (మంగళవారం) పుట్టపర్తిలో పర్యటించారు. రాష్ట్ర మంత్రుల బృందం చైర్మన్ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు సత్యకుమార్ యాదవ్, దేవదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణరెడ్డి ఈ పనులను పర్యవేక్షించారు. హిల్ వ్యూ స్టేడియంలో తనిఖీలు: మంత్రులు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, డిఐజి షిమోషి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ట్రస్టు సభ్యులతో కలిసి పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ముఖ్యంగా:  వీవీఐపీలు, వీఐపీల రాక సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లు.   భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు, ట్రస్టు సభ్యులకు మంత్రులు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎం.టి. కృష్ణబాబు, అజయ్ జైన్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సాయి...

మౌలానా బహు బాష కోవిదుడు

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి: 'జాతీయ విద్యా దినోత్సవం'పై వక్తల ప్రశంస దేశానికి తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను స్థానిక పంచాయతీ కార్యాలయం లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మౌలానా సేవలను కొనియాడారు. ప్రతి సంవత్సరం నవంబర్ 11న ఆయన జయంతిని పురస్కరించుకుని దేశం జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకొంటుందని వక్తలు పేర్కొన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ విద్యా వ్యవస్థకు చేసిన సేవలను వారు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. మౌలానా ఆజాద్ సేవలను కొనియాడిన వక్తలు:  మౌలానా 1888, నవంబర్ 11న మక్కాలో జన్మించారని, ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అని, 'అబుల్ కలాం' బిరుదు కాగా, 'ఆజాద్' ఆయన కలంపేరు అని వక్తలు తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర: ఆయన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్య నాయకులలో ఒకరిగా, మహాత్మా గాంధీకి సన్నిహితుడిగా పనిచేశారని పేర్కొన్నారు.   విద్యా వ్యవస్థకు పునాదులు: స్వతంత్ర భారతదేశానికి మొదటి విద్యాశాఖ మంత్రిగా (1947 నుండి 1958 వరకు) పనిచేసి దేశ విద్యా విధానానికి బలమైన పునాదులు వేస...