Skip to main content

Posts

Showing posts from October 22, 2025

నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సీఐ చెన్నకేశవరావు వివరణ..!

అమరావతి :అక్టోబర్ 23 నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సీఐ చెన్నకేశవరావు వివరణ..! నిన్న సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కార్ట్ తో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ఘటన జరిగింది...  నిందితుడు నారాయణరావు వాష్ రూమ్ కెళ్ళిన క్రమంలో వర్షం పడడంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్ళారు... ఆ సమయంలో ఒక్కసారిగా చెరువులో దూకేసాడు...  రాత్రంతా వెతికీనా బాడీ దొరకలేదు ఉదయం ఫైర్ , పోలీస్ సిబ్బంది గజ ఇతగాళ్లతో వెతకగా బాడీ దొరికింది...  అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదా..!? అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాం.

భారత సైన్యంలో ‘భైరవ్’!

  భారత సైన్యంలో ఆధునిక పరిజ్ఞానం, శక్తిమంతమైన ఆయుధాలతో త్వరితగతిన స్పందించే 'భైరవ్' బెటాలియన్లు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 1న తొలి బెటాలియన్ను మోహరించనున్నట్లు సైన్యం డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో ఒక్కో యూనిట్లో 250 మంది సుశిక్షితులైన జవాన్లతో కూడిన 25 'భైరవ్' బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు~

అమెజాన్పై పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ

  కర్నూల్ అక్టోబర్ 23 అమెజాన్ సంస్థకు కర్నూలు జిల్లా కన్స్యూమర్ ఫోరం నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఓ వినియోగదారుడు అమెజాన్లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15+ ఆర్డర్ పెట్టగా.. ఐక్యూ ఫోన్ డెలవరీ అయ్యింది. కస్టమర్ కేర్కు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితుడు కన్స్యూమర్ ఫోరంను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి ఐఫోన్ డెలవరీ చేయని పక్షంలో రూ.80 వేలు+ రూ.25వేలు చెల్లించాలని కన్స్యూమర్ ఫోరం తీర్పు ఇచ్చింది.

నరసింహ రాజు .నట జీవిత చరిత్ర

   ఒక ప్రముఖ తెలుగు నటుడు. 1970 వ దశకంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించాడు. 1978 లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని అనే సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆంధ్రా కమల్ హాసన్గా పేరు పొందాడు. సుమారు 110 చిత్రాల్లో నటించాడు. అందులో 90 సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. పలు టీవీ ధారావాహికల్లో కూడా నటించాడు. నరసింహ రాజు 1974 లో విడుదలైన నీడలేని ఆడది సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో కథానాయికగా నటించిన ప్రభకు కూడా అది మొదటి సినిమానే. ఇది వందరోజులు ఆడి మంచి విజయం సాధించింది. కానీ ఒక ఏడాది పాటూ అవకాశాలు రాలేదు. మళ్లీ అదే నిర్మాతలే అమ్మాయిలూ జాగ్రత్త అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత దాసరి నారాయణ రావు తూర్పు పడమర సినిమాలో అవకాశం ఇచ్చాడు. మరి కొన్ని సినిమాలలో అవకాశం వచ్చింది. 1970 వ దశకం రెండో అర్ధ భాగంలో సుమారు 20 సినిమాల్లో నటించాడు. 1978లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన జగన్మోహిని చిత్రం మంచి విజయం సాధించింది. దీనికి ముందుగానే కొన్ని సినిమాల్లో నటించిన ఉన్న నరసింహరాజు విఠలాచార్య దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా చిత్రీకరణకు వెళ్ళి అవకాశం కోసం అ...

సచివాలయంలో 'కరెంట్' చౌర్యం – స్కూటీలకు ప్రభుత్వ విద్యుత్‌తో ఛార్జింగ్

  ఉరవకొండ,  అక్టోబర్ 22: ఉరవకొండ మండలంలోని రాకెట్ల గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది ప్రభుత్వ విద్యుత్‌ను వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వారు తమ ఎలక్ట్రిక్ స్కూటీలకు సచివాలయ కరెంటుతో ఛార్జింగ్ చేసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. విద్యుత్ బిల్లుల భారం సచివాలయ సిబ్బంది కొందరు నిత్యం తమ కరెంటు స్కూటీలకు కార్యాలయంలోనే ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా సచివాలయానికి రావాల్సిన కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోతోందని, ఈ భారం ప్రభుత్వ ఖజానాపై పడుతోందని సచివాలయం సిబ్బందిలోనే ఒకరు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్‌ను వ్యక్తిగత వాహనాలకు ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్లు స్పష్టమవుతోంది. చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వ సిబ్బందిగా ఉండి, ఇలా విద్యుత్‌ను చౌర్యం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ప్రభుత్వ విద్యుత్‌ను వ్యక్తిగత వాహనాలకు వినియోగిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి విద్యుత్ చౌర...

RMP నిర్లక్ష్యం: ఇంజక్షన్ వికటించి గిరిజన కుటుంబానికి తీవ్ర నష్టం

  అమిద్యాల అక్టోబర్ 22 ఉరవకొండ: ఆర్ఎంపీ (RMP) డాక్టరు నిర్లక్ష్యం కారణంగా ఓ గిరిజన కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. లేని రోగానికి చికిత్స పేరుతో అధిక ఖర్చు చేయాల్సి రావడంతో పాటు, తప్పుడు ఇంజక్షన్ వల్ల రోగికి శారీరక ఇబ్బందులు తలెత్తాయి. చికిత్సలో నిర్లక్ష్యం ఉరవకొండ సమీపంలోని ఆమిద్యాల గ్రామానికి చెందిన నెట్టికల సాంబయ్య అనే గిరిజనుడు అనారోగ్యంతో బాధపడుతూ రాకెట్ల గ్రామంలోని ఓ ఆర్ఎంపీ డాక్టరు వద్దకు వెళ్ళాడు. డాక్టర్ సాంబయ్యకు ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పి, నరానికి వేయాల్సిన ఇంజక్షన్‌ను పొరపాటున మరొక కండరానికి వేశాడు. ఈ నిర్లక్ష్యం కారణంగా సాంబయ్య చెయ్యి సెప్టిక్ అయ్యింది. లక్షల్లో ఖర్చు, ఆపరేషన్ అవసరం ఆర్ఎంపీ డాక్టరు నిర్లక్ష్యం వల్ల పరిస్థితి విషమించడంతో, నెట్టికల కుటుంబం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించగా, చికిత్స నిమిత్తం సాంబయ్య కుటుంబం సుమారు రూ. 60,000 ఖర్చు చేసిందని బాధితుడు నెట్టికల సాంబయ్య పేర్కొన్నాడు. లేని రోగానికి చికిత్స చేయించుకోవడం, ఆపై నిర్లక్ష్యం కారణంగా భారీగా నష్టపోవడం ఆ కుటుంబానికి తీవ్...

ఈ భవనానికి అహుడా అను'మతులు' లేవోచ్.

    అనుమతి ఒకదానికి.. నిర్మాణం మరొకదానికి. - రోగం ఒకటైతే చికిత్స మరొకదానికా - నర్సింగ్ హోమ్ నిర్మాణ జీ+5) అక్రమాలు  ఉరవకొండ అక్టోబర్ 22 : పట్టణంలో ఓ నర్సింగ్ హోమ్ నిర్మాణంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయి. అనంతపురం అహుడా అనుమతులు లేకుండా జి + 5 బహుళ అంతస్తుల భవనాలు అక్రమంగా నిర్మిస్తున్నారు.ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో శ్రీ ఈశ్వరమ్మ దేవస్థాన సమీపంలో 8 సెంట్లు స్థలాన్ని ఓ వైద్యులు కొనుగోలు చేశారు. కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన చిలకూరి ఎర్రి స్వామి రెడ్డి ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు.  సర్వే నంబర్543/ఏ, ప్లాట్ నెంబర్ 1920 ఎనిమిదో సెంట్ల స్థలములో తన నివాస ప్రయోజనం కోసం గ్రామపంచాయతీ వారికి నిర్మాణ అనుమతుల కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. గ్రామపంచాయతీ వారు ఫైల్ నెంబర్26/2024 నందు నివాస ప్రయోజనం కోసం నిర్మాణ అనుమతులు మంజూరు చేశారు.  అయితే సదరు ఎర్రి స్వామి రెడ్డి నివాస నిర్మాణ అనుమతుల ముసుగులో వ్యాపార ప్రయోజనాల కోసం నర్సింగ్ హోమ్ నిర్మాణం యదేచ్ఛగా సాగిస్తున్నారు.  గ్రామపంచాయతీ నివాస ప్రయోజనం కోసం జి ప్లస్ టు వరకు మాత్రమే అనుమతులు మంజూరు చేస్తారు. ...

ఏఎస్పీకే గతిలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?

  – డీజీపీ, డీఐజీ, ఎస్పీ చేతగానితనంతోనే ఈ దుస్థితి   అనంతపురం  వై సీ పీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి  గుత్తి, అక్టోబర్‌ 22 :  అధికార పార్టీ నేతల అరాచకాలపై వైఎస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి పట్ల మునిసిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం గుత్తిలో నిర్వహించిన ‘రచ్చబండ’లో అనంత మాట్లాడారు. తాడిపత్రిలో అమరవీరుల దినోత్సవం రోజే పోలీసుల సమక్షంలోనే ‘‘రేయ్‌ ఏఎస్పీ.. ఎస్పీ లేకపోతే మీ ఇంట్లోకి దూరేవాడిని’’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరించడాన్ని చూస్తే ఈ ప్రభుత్వంలో సామాన్యులకే కాదు.. చివరకు ఐపీఎస్‌లకూ రక్షణ లేని పరిస్థితి కనిపిస్తోందన్నారు. 24 గంటలు గడిచినా డీజీపీ, డీఐజీ, ఎస్పీ స్పందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. సాక్షాత్తూ ఏఎస్పీకే గతిలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల గౌరవాన్ని పెంచుతాం.. అంట...

హవళిగి గ్రామ0లో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్

 ఉరవకొండలో రూ. 7.40 కోట్ల తాగునీటి ప్రాజెక్టు ప్రారంభం: ! ​ఉరవకొండ అక్టోబర్ 22: : రాష్ట్ర ఆర్థిక, మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్ మండల పరిధిలోని హవళిగి గ్రామంలో ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన రూ. 7.40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన పైప్‌లైన్ల వ్యవస్థను ప్రారంభించారు. ​ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల భద్రతా ప్రణాళికలో కీలక ఘట్టంగా, ఫంక్షనల్ హౌస్‌హోల్డ్ ట్యాప్ కనెక్షన్ల (FHTC) డెలివరీకి నిబద్ధతగా పరిగణించబడుతోంది. హవళిగి ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ (JJM) లక్ష్యాలతో పూర్తిగా ఏకీకృతమై ఉంది. నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను ప్రాథమిక ఆందోళనగా పరిగణించిన మంత్రి కేశవ్, ఈ రూ. 7.40 కోట్ల ప్రాజెక్టును స్థానిక అవసరాలకు అనుగుణంగా అమలు చేయడానికి కృషి చేశారు. ​నిధుల విడుదల వేగం: ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రిగా పయ్యావుల కేశవ్ ఈ ప్రాజెక్టును ప్రత్యక్షంగా పర్యవేక్షించడం, నిధుల విడుదల మరియు ఆమోద ప్రక్రియలో ఎదురయ్యే బ్యూరోక్రాటిక్ అడ్డంకులను తొలగించడానికి వీలు కల్పించింది, తద్వారా ప్రాజెక్టు అమలు వేగం పెర...