ధర్మవరం:ట్రూ టైమ్స్ ఇండియా జిల్లా శాంతి, అభివృద్ధి కోసం సమిష్టి కృషి అవసరం – మంత్రి సత్యకుమార్ యాదవ్ అభివృద్ధి–భద్రతా రంగాల్లో సమిష్టి కృషి చేయాలి – మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం, అక్టోబర్ 05:– సత్యసాయి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సతీశ్ కుమార్ ఆదివారం ధర్మవరం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, జిల్లాలో ప్రజా సేవా కార్యక్రమాలు, భద్రతా వ్యవస్థ బలోపేతం, ప్రజలతో పోలీసు శాఖ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత చేరువగా ఉండాలని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు సామరస్య వాతావరణం నెలకొల్పే దిశగా అధికారులు కృషి చేయాలని మంత్రి గారు సూచించారు. — సత్యసాయి జిల్లా అభివృద్ధి, ప్రజా భద్రతా వ్యవస్థలు పరస్పర సహకారంతో ముందుకు సాగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. కొత్తగా నియమితులైన తమరు ప్రజలతో స్నేహపూర్వక ధోరణిలో వ్యవహరించి, న్యాయపరమైన, బాధ్యతాయుతమైన విధానాలతో జిల్లా భద్రత...