కళ్యాణదుర్గం: విద్యార్థిని విద్యార్థులకు భద్రత, చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా కళ్యాణదుర్గంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు అక్టోబర్ 29, బుధవారం నాడు శక్తి టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి టీమ్ సభ్యులు హెడ్ కానిస్టేబుల్ కె.సి. హక్కులన్న, మహిళా కానిస్టేబుల్ స్వాతి, కానిస్టేబుల్ విద్యాధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు విద్యార్థులకు ముఖ్యంగా బాలికలకు గుడ్ టచ్ - బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, పోక్సో (POCSO) చట్టం గురించి, అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్ల గురించి పూర్తిగా వివరించారు. ఉన్నత విద్య అభ్యసించే సమయంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థిని, విద్యార్థులు పేర్కొన్నారు. అధికారులు తమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, సహకరించిన ఉపాధ్యాయులకు, యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వివేకానంద హైస్కూల్ కరస్పాండెంట్ నరసింహ చారి, హెడ్‌మాస్టర్ విశ్వనాథ్, తిప్పే స్వామి మరియు ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.
Local to international