Skip to main content

Posts

Showing posts from October 26, 2025

విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌కు ఎస్.సి. ఎస్.టి. విజిలెన్స్ కమిటీ వినతి

  గుంతకల్ రెవిన్యూ డివిజన్, అక్టోబర్ 27: ఆంధ్ర రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తరుణంలో, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న విడపనకల్లు ఏపీ మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ వార్డెన్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని గుంతకల్ రెవిన్యూ డివిజనల్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎస్. హరి ప్రసాద్ యాదవ్ జిల్లా కలెక్టర్‌ను మీడియా ద్వారా కోరారు. విద్యార్థినుల ఆవేదన: గత కొద్ది రోజులుగా విడపనకల్ ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని హరి ప్రసాద్ యాదవ్ తెలిపారు. అక్టోబర్ 26, 2025 (ఆదివారం) మధ్యాహ్నం ఆయన వ్యక్తిగతంగా హాస్టల్‌ను సందర్శించారు.  * వార్డెన్ లేకపోవడం: తాను వెళ్లిన సమయంలో వార్డెన్ విధుల్లో లేకపోవడం గమనించారు. దీంతో ఆయన గేటు బయట నుంచే విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  * నాసిరకం భోజనం: ముఖ్యంగా, కడుపునిండా అన్నం పెట్టడం లేదని, చికెన్ ఇస్తే నీళ్లగా ఉండి కేవలం రెండు ముక్కలు మాత్రమే ఇస్తున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు.  * బెదిరింపులు: ఆహారం గురించి ప్ర...

విద్యుత్ ఉద్యోగుల సెలవులు రద్దు: మంత్రి గొట్టిపాటి

  A P : మొంథా తుఫాను నేపథ్యంలో 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు.  ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉంటూ, విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తిన వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.  ఎక్కడైనా పవర్ సప్లైలో అంతరాయం కలిగితే 1912 నంబరును సంప్రదించాలని ప్రజలకు సూచించారు.  కిందపడిన విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి చెప్పారు.

విద్యారంగంలో ఆందోళన: 8,000 పాఠశాలల్లో ఒక్క విద్యార్థీ చేరలేదు!

  ఢిల్లీ అక్టోబర్ 27: దిల్లీ: దేశవ్యాప్తంగా విద్యారంగంలో ఆందోళన కలిగించే అంశాలను కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలో సుమారు 8,000 పాఠశాలల్లో (సుమారు 7,936) ఒక్క విద్యార్థి కూడా నమోదు కాలేదు. అంతకు మించి, ఈ విద్యార్థులు లేని బడుల్లో 20 వేలకు పైగా (20,817) మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండటం ప్రభుత్వ వనరుల దుర్వినియోగానికి అద్దం పడుతోంది. ఈ గణాంకాలు రాష్ట్రాల వారీగా విద్యా వ్యవస్థలో ఉన్న అసమతుల్యతను స్పష్టంగా చూపిస్తున్నాయి. రాష్ట్రాల వారీగా పరిస్థితి   సున్నా నమోదు పాఠశాలల్లో అగ్రస్థానం:     ఈ జాబితాలో అత్యధిక సంఖ్యలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది.    తరువాత స్థానాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఒకే టీచరున్న బడుల్లో 33 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో సిబ్బంది కేటాయింపులో లోపాలున్నాయనే విషయాన్ని ఈ నివేదిక హైలైట్ చేసింది. దేశవ్యాప్తంగా 33 లక్షల మందికి పైగా విద్యార్థులు కేవలం ఒకే ఒక్క టీచరు ఉన్న పాఠశాలల్లో చదువుతున్నారు. ఇది విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి (PTR)పై, బోధ...

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన వాయిదా.*

 అమరావతి అక్టోబర్ 27: ఎల్లుండి అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొనేందుకు రేపు అమరావతి రావాల్సి ఉన్న నిర్మలా సీతారామన్. మొంథా తుపాను కారణంగా కార్యక్రమం వాయిదా.

గురు కుల విద్యార్థి అదృశ్యం

 విద్యార్థి - అన్వేష 10th క్లాస్  గ్రామం: ఇల్లూరు  మండలం : గార్లదిన్నె  ఈ దినము అనగా 26/10/2025 వ తేదీ సుమారు సాయంత్రం 6.00 గంటల సమయంలో రాగులపాడు గిరిజన గురుకుల పాఠశాల నుండి తప్పిపోయినాడు. పై తెలిపిన బాలుడి ఆచూకీ తెలిసిన వెంటనే క్రింది ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చెయ్యగలరు.           వజ్రకరూర్ SI no -9440901867   ఉర్వకొండ CI సార్ no -9490108514 గుంతకల్ SDPO sir no -944079 6828.

ఉరవకొండలో 'ఇన్‌ఛార్జి' పాలనపై ప్రజాగ్రహం!

  ఇదేనా సుపరిపాలన? ఉరవకొండ, అక్టోబర్ 26: అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ దేవస్థానాల పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. కీలక స్థానాల్లో అధికారుల కొరత, ఇన్‌ఛార్జి పాలన, మరియు బాధ్యతారహిత ప్రవర్తనతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై 'ఇదేనా సుపరిపాలన?' అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.   పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఇన్‌ఛార్జిల రాజ్యం ఉరవకొండలో పాలనా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. కీలక శాఖలలో పరిస్థితి దారుణంగా ఉంది.   పోలీస్ శాఖ: ఉరవకొండ గ్రామీణ సర్కిల్ అధికారి (సీఐ) పదవి గత మూడు నెలలుగా ఖాళీగా ఉంది. అంతేకాకుండా, గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ సైతం లేరు. కేవలం ఇన్‌ఛార్జి పాలనతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదు.దొంగతనాలు,పేకాట జూదాలు, ఊరూరా బెల్టు దుకాణలతో పోలీస్ నియంత్రణ కష్టతరమైంది.   రెవెన్యూ కార్యాలయం: ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాసిల్దార్ కూడేరుకు ఇన్‌ఛార్జిగా బాధ్యతలు తీసుకుని, క...

రానున్న "లోకల్ ఎన్నికల్లో" వడ్డెరలకు ప్రాధాన్యం : మంత్రి సవిత*

 " వడ్డే ఓబన్న" విగ్రహ ప్రతిష్ట "సూపర్... సక్సెస్" గోరంట్ల పట్టణంలో బస్టాండ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి సవిత స్వహస్తలతో ఆదివారం నాడు వడ్డెరల తో కలసి అంగరంగా వైభవం గా ప్రారంభించారు. ముందుగా మండలంలోని వడ్డెర కులస్తులందరు కలసి హెచ్. పి పెట్రోల్ బాంక్ దగ్గర నుండి కలిశాలతో ఊరేగింపుగా బయలుదేరి బస్టాండ్ దగ్గర వరకు కొనసాగించారు. అనంతరం మంత్రి ఆవిష్కరించారు. మంత్రి సవిత మాట్లాడుతూ పార్టీ, నామినేటెడ్ పదవులతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వడ్డెర కులస్తులకు గతంలో ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని వడ్డెర కులస్తులు కోరారని సొంత నిధులతో విగ్రహాన్ని అంద చేశానని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. బీసీలకు టీడీపీతో, రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం లభిస్తోందన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. బీసీల మనోభావాలకు గౌరవమిస్తూ, విశ్వకర్మ జయంతి, వాల్మీకి జయంతి, కనకదాస జయంతిని అధ...

ఆర్టీసీ ప్రమోషన్లపై రాజకీయ రగడ: 'చంద్రబాబు పుణ్యమా అని' వ్యాఖ్యలపై కార్మిక పరిషత్ ప్రశంస

 🚌  అనంతపురం/ఉరవకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో ఉద్యోగుల పదోన్నతుల విషయంలో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. పదోన్నతులు కల్పించడంపై ఆర్టీసీ యూనియన్ (EU) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హర్షం వ్యక్తం చేయడం హాస్యాస్పదమని పేర్కొంటూ, కార్మిక పరిషత్ జిల్లా కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. కార్మికులకు ఏ మంచి జరిగినా అది తెలుగుదేశం (TDP) హయాంలోనే అని కార్మికులు గుర్తుంచుకోవాలని కార్మిక పరిషత్ కోరింది.  '40 ఏళ్లుగా చంద్రబాబు బిక్ష మాత్రమే' కార్మిక పరిషత్, అనంతపురం జిల్లా కమిటీ మరియు ఉరవకొండ డిపో కమిటీ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో...  ఆర్టీసీలో పదోన్నతుల కల్పన వంటి మంచి పనులు జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు పుణ్యమేనని పేర్కొన్నారు.  యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు) హర్షం వ్యక్తం చేయడం హాస్యాస్పదం అని విమర్శించారు.   గత 40 సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులకు ఏదైనా మంచి జరిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు 'బిక్ష' మాత్రమే అని కార్మికులు గుర్తుపెట్టుకోవాలని కోరారు.  ఈ సందర్భంగ...

మెడకు ఉరితాళ్లు బిగించుకుని అరకులో గిరిజనుల ఆందోళన: 'ఎకో టూరిజంతో మా పొట్ట కొట్టొద్దు'

   అరకులోయ: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గిరిజనులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఎకో టూరిజం అభివృద్ధి పేరుతో అటవీ శాఖ తమ జీవనోపాధిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు గిరిజనులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలపడం ఉద్రిక్తతకు దారితీసింది.  మాడగడ మేఘారకొండపై ఆందోళన స్థానిక మాడగడ మేఘారకొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి సుమారు 600 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని ఆందోళనకారులు తెలిపారు. అభివృద్ధి, ఎకో టూరిజం పేరుతో అటవీశాఖ ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని, తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నినాదాలు చేస్తూ, తమ బతుకులు నాశనం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  గిరిజనులకే అవకాశం కల్పించాలని డిమాండ్ గిరిజన ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో, ముఖ్యంగా పర్యాటక రంగంలో, గిరిజనులకే పూర్తి అవకాశాలు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. అటవీ శాఖ ఏకపక్ష నిర్ణయాల వల్ల తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతోందని, అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. గిరిజ...

పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్లనే కమిటీల్లో నియమించండి

  అనంతపురం, అక్టోబర్‌ 26 :  వైఎస్‌ఆర్‌సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం నగరంలోని కోర్టు రోడ్డులో ఉన్న క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని రుద్రంపేట, ఏ.నారాయణపురం, రాజీవ్ కాలనీ, అనంతపురం రూరల్ పంచాయితీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీల నియామకం, ప్రైవేట్‌ మెడికల్‌ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో కొత్తగా కమిటీలను నవంబర్‌ 16వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పంచాయితీకు ఒక అధ్యక్షుడు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, నలుగురు కార్యదర్శులు, ఆరుగుగు ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లు ఉంటారని చెప్పారు. అనుబంధ సంఘాలకు సంబంధించి యువజన, మహిళ, విద్యార్థి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలను కూడా పూర్తి చేయాలన్నారు. సోషల్‌ మీడియాకు సంబంధించి పంచాయితీకు ఇద్దరు ముగ్గురిని ఎంపిక చేయాలని సూచించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్ల చిత్తశుద్ధి...

ఆల్మట్టి ఎత్తు.. ఆంధ్రా చిత్తు

  కృష్ణా జలాలపై కత్తి: ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఏపీ, తెలంగాణకు పెను ప్రమాదం! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడి అయిన కృష్ణా నది జలాలపై కర్ణాటక ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును చట్టవిరుద్ధంగా పెంచేందుకు ప్రయత్నిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ చర్య కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీటి లభ్యతను అడ్డుకుని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల హక్కులకు భంగం కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  చట్టవిరుద్ధంగా డ్యామ్ ఎత్తు పెంపు ప్రయత్నం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే 516 అడుగుల నుండి 519 అడుగులకు పెంచారు. దీని సామర్థ్యం 150 టీఎంసీల నుండి 200 టీఎంసీలకు చేరింది. అయితే, ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి, ఎత్తును 519 అడుగుల నుండి 524 అడుగులకు పెంచాలని, సామర్థ్యాన్ని ఏకంగా 330 టీఎంసీలకు (అదనంగా 130 టీఎంసీలు) పెంచాలని చూస్తోంది. ఈ విస్తరణ కోసం 1.33 లక్షల ఎకరాల భూసేకరణకు రూ. 70 వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైంది. కృష్ణా నది నీటిని కింది రాష్ట్రాలకు పారక...

శాంతినగర్‌లో నీటి కష్టాలు తీర్చిన టీడీపీ శ్రేణులు: వర్షపు నీరు తొలగింపు

   ధర్మవరం/, అక్టోబర్ 26  గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ధర్మవరం పట్టణంలోని 01వ వార్డు శాంతినగర్‌లో నిలిచిపోయిన నీటి సమస్యను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు పరిష్కరించారు. టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.   మట్టి తొలగింపు, దారి ఏర్పాటు వర్షపు నీరు ఇళ్ల ముందు నిలిచిపోయి, రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు టీడీపీ నాయకులు వెంటనే స్పందించారు.  కొంతమంది తమ ఇళ్ల ముందు రా ఎత్తుగా మట్టి తోలించుకోవడం వల్ల నీరు నిలిచిపోతున్నట్లు గుర్తించారు.  తాజాగా నిలిచిపోయిన ఆ మట్టిని పూర్తిగా తొలగించారు.  నిలిచిన నీరంతా పోయే విధంగా దారిని ఏర్పాటు చేయడం జరిగింది.  అంతేకాకుండా, దారికి అడ్డంగా ఉన్న కంపచెట్లను కూడా తొలగించి రోడ్డును శుభ్రం చేయించారు.   కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఈ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.   తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్    క్లస్టర్ ...

బంగారు పతకం సాధించిన ఎం. సౌమ్య

  తైక్వాండో పోటీలలో సత్తా చాటిన అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినీలు ఉరవకొండ,మన  అక్టోబర్26, అనంతపురంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో ఉరవకొండ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినీలు పోటీలు నందు పాల్గొని తమ సత్తా చాటి 5 మంది విద్యార్థినీలు గోల్డ్ మెడల్,5 మంది విద్యార్థినీలు సిల్వర్ మెడల్,3 మంది విద్యార్థినీలు బ్రాంజ్ మెడల్స్ సాధించి బహుమతులను గెలుచుకున్నారు.మెడల్స్ సాధించిన విద్యార్థినీలును,పిఈటి మీనా ను ప్రిన్సిపాల్ జ్ఞాన ప్రసూన,వైస్ ప్రిన్సిపాల్ సుమలత ,లైబ్రేరియన్ కుళ్ళాయమ్మ,ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

మీ సేవా తపన సమాజానికి ఆదర్శం”

  మీ వంటి యువతే దేశం భవిష్యత్తు” ––మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం,మనజన ప్రగతి అక్టోబర్ 26:— కర్నూలు జిల్లాలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఘోర బస్ ప్రమాదంలో, తక్షణ స్పందనతో పది మందికి పైగా ప్రయాణికులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ధర్మవరం యువకులు హరీష్ కుమార్, జ్ఞానేంద్ర, వంశీ ల వీరోచిత చర్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఆదివారం మంత్రి సత్యకుమార్ యాదవ్, ధర్మవరం పట్టణంలోని ఈ యువకుల నివాసాలకు వెళ్లి, వారిని కలుసుకుని వారి ధైర్యసాహసాన్ని ప్రశంసిస్తూ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న వేళ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు లాగి రక్షించిన ఈ యువకుల చర్య మానవత్వానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి ధైర్యవంతులైన యువకులు ఉండటం గర్వకారణం. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ, వారు చూపిన సేవా మనోభావం ప్రతి యువతకు ఆదర్శం. మానవత్వం ముందు భయాన్ని జయించడం, సేవా తపనతో ముందుకు రావడం అనేది నిజమైన వీరోచిత చర్య అని అన్నారు. ప్రజల కోసం నిర్భయంగా మ...

పోలీసులపై తీవ్ర ఆరోపణలు: దాడి వెనుక 'ఈనాడు' విలేఖరి పాత్ర? హత్యాయత్నం కేసు నమోదు చేయలేదని బాధితుల ఆగ్రహం!

  ఉరవకొండ అక్టోబర్ 26: అనంతపురం జిల్లాలోని గాజుల మల్లాపురం భూ వివాదం దాడి కేసులో పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా స్థానిక 'ఈనాడు విలేఖరి' ఉన్నప్పటికీ, పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడం, విచారణలో పక్షపాతంగా వ్యవహరించడం న్యాయానికి అన్యాయం చేయడమేనని బాధితులు ఆరోపిస్తున్నారు. రామదుర్గం గోవర్ధన్, అనసూయమ్మ, రామాంజినేయులు, శీనా, దినేష్ ఐదుగురిని నిందితులు చేస్తూ కేసు నమోదు చేశారు. నంబర్ వన్ నిందితుడు  ఈనాడువిలేఖరి పై కేసు నమోదు చేయలేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. నేరం చేసిన వారికంటే నేరం చేయించిన వారే పెద్ద నేరస్తులు అవుతారన్న ప్రాథమిక సూత్రం పోలీసులకు తెలియదా?   విలేఖరి నుంచి ప్రాణహాని: వాంగ్మూలం అరణ్య రోదనేనా? దాడికి గురైన రామదుర్గం ఆది నారాయణ తన వాంగ్మూలంలో దాడికి ప్రధాన కారణమైన విలేఖరి నుంచి తమకు ప్రాణహాని ఉందని స్పష్టంగా పేర్కొన్నారు.   కుట్ర కోణం: ఆ విలేఖరి తమ పొలంలో విద్యుత్ తీగలను నేలపై పరిచి, పొలం పనులకు వచ్చిన వారిని హత్య చేసేందుకు కుట్ర పన్నాడని కూడా ఫిర్యాది తెలిపారు.   గత నేర చరిత్ర: గతంలో ...

60 ఏళ్లుగా మోసం.. ఇక ఉపేక్షించం.

  - వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరించి తీరాలి: - ఉద్యమం ఉద్ధృతం చేస్తాం – చంద్రచర్ల హరి డిమాండ్ ఉరవకొండ  అక్టోబర్ 26: వాల్మీకి సామాజిక వర్గానికి ఎస్టీ (Scheduled Tribe) రిజర్వేషన్‌ను తక్షణమే పునరుద్ధరించాలని బహుజన యువసేన ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు చంద్రచర్ల హరి వాల్మీకి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉరవకొండలోని వాల్మీకి భవన్‌లో గురువారం నిర్వహించిన వాల్మీకుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్టీ రిజర్వేషన్‌ సాధన దిశగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉద్యమాన్ని మహోద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు.  60 ఏళ్లుగా మోసం, ఇక ఉపేక్షించం! ఈ సందర్భంగా చంద్రచర్ల హరి మాట్లాడుతూ.. గత 60 సంవత్సరాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాల్మీకులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఎస్టీ పునరుద్ధరణ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెడుతున్నాయని మండిపడ్డారు.  * సరైన సమయం: రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమి, కేంద్రంలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్నందున ఇదే సరియైన సమయంగా భావించి, రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. ఐక్యతే...

కర్నూల్ ఎస్ పీ బస్సు ప్రమాదమృత దేహాల తరలింపు

  కర్నూలు : స్వస్థలాలకు కర్నూలు బస్సు ప్రమాద మృతదేహాల తరలింపు. తొలుత తెలంగాణకు చెందిన మృతదేహాలు తరలింపు. మృతదేహాల తరలింపునకు తెలంగాణ నుంచి 2 రోజుల క్రితమే జీజీహెచ్ కు చేరుకున్న మహాప్రస్థానం ఉచిత సర్వీసు వాహనాలు. మృతదేహాలను కుటుంబీకులకు అప్పగిస్తున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్.

తుఫాన్ ప్రభావంతో ప్రత్యేక అధికారుల నియామకం

 అమరావతి.. : - జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. - 19 జిల్లాలకు ప్రత్యేక అధికారులు - శ్రీకాకుళం- చక్రధర్ బాబు  - విజయనగరం - రవి సుభాష్. - మన్యం - నారాయణ భరత్ గుప్తా - విశాఖపట్నం - అజయ్ జైన్  - అనకాపల్లి, ఏఎస్సార్ జిల్లా - వాడ్రేవు వినయ్ చంద్ - తూర్పుగోదావరి - కన్నబాబు - కాకినాడ - కృష్ణ తేజ - కోనసీమ - విజయరామరాజు - శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు ఉన్న జిల్లాలకు జోనల్ ఇంచార్జిగా అజయ్ జైన్ - పశ్చిమగోదావరి - ప్రసన్న వెంకటేష్ - ఏలూరు - కాంతి లాల్ దండే - కృష్ణా జిల్లా - ఆమ్రపాలి - ఎన్టీఆర్ జిల్లా - శశి భూషణ్ కుమార్  - గుంటూరు - ఆర్పీ సిసోడియా - బాపట్ల - వేణు గోపాల్ రెడ్డి - ప్రకాశం - కోన శశిధర్ - నెల్లూరు - యువరాజ్. - తిరుపతి - అరుణ్ బాబు - చిత్తూరు - గిరీషా - పశ్చిమగోదావరి నుంచి చిత్తూరు వరకూ జోనల్ ఇంఛార్జిగా ఆర్పీ సిసోడియా.

నవంబర్ 2న మహోత్సవం

 అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం అనంతపురం/ధర్మవరం: అఖిల భారత కాకతీయ ఉద్యోగుల సేవా సంఘం (ABKUSS) ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంఘం సభ్యులు మరియు అభిమానుల కోసం ఈ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ఏర్పాటు చేశారు. గత సంవత్సరం నిర్వహించిన వనభోజన కార్యక్రమం విజయవంతం కావడంతో, ఈ సంవత్సరం కూడా మరింత ఘనంగా నిర్వహించాలని ABKUSS నిర్ణయించింది.   తేదీ: 02-11-2025 (ఆదివారం)  సమయం: ఉదయం 6:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు   వేదిక: NH-44 ప్రక్కన, హంపాపురం గ్రామం సమీపంలో ఉన్న గౌ|| గోపాల నాగేష్ అండ్ బ్రదర్స్ వారి వ్యవసాయ క్షేత్రం (వెజ్జీ దాబా రాకముందు), అనంతపురం జిల్లా.  కాకతీయ ఉద్యోగులకు ఆహ్వానం ABKUSS తమ మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్తీక వనభోజనాలను నిర్వహిస్తున్నట్టు పత్రికలో పేర్కొంది. కాకతీయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులందరూ సకుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. 📞 వివరాలకు సంప్రదించండి కార్యక...

కర్నూలు బస్సు దుర్ఘటన: డ్రైవర్, యజమానిపై హత్యేతర నిర్లక్ష్యం కేసు - దర్యాప్తులో సంచలన విషయాలు

  కర్నూలు: కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన వీ. కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఈ దుర్ఘటనలో 19 మందికి పైగా సజీవ దహనం కావడంతో, పోలీసులు బస్సు డ్రైవర్, ట్రావెల్స్ యజమానిపై హత్యేతర నిర్లక్ష్యం (Section 106(1) BNS) కింద కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.   కేసు నమోదు, నిందితుల అదుపు   నిర్లక్ష్యంపై కేసు: ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు ఉలిందికొండ పోలీస్ స్టేషన్‌లో బస్సు డ్రైవర్‌తో పాటు వీ. కావేరి ట్రావెల్స్ యజమానిపై సెక్షన్ 106(1) BNS (నిర్లక్ష్యం వల్ల మరణం), సెక్షన్ 125(ఎ) BNS (ప్రమాదకరమైన డ్రైవింగ్) కింద కేసులు నమోదయ్యాయి.   డ్రైవర్ల విచారణ: ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలం నుంచి పారిపోయిన బస్సు డ్రైవర్, సహ-డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు.   ప్రమాదానికి దారితీసిన కారణాలు ప్రాథమిక దర్యాప్తులో ప్రమాదానికి కారణాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. డ్రైవర్ల అధిక వేగం, తీవ్ర నిర్లక్ష్యం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణంగా తేలింది.  బైక్‌ను ఈడ్చుకెళ్లడం: అతివేగంతో వస్తున్న బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక...