Skip to main content

Posts

Showing posts from October 14, 2025

రాయలసీమ లాయర్ల ఐక్యతకు పిలుపు: కర్నూలులో హైకోర్టు/బెంచ్ సాధనకు కీలక పోరాటం.

  అధికారమనేది నీటి మీద బుగ్గ. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి, న్యాయవాద వృత్తి విస్తరణకు అత్యంత కీలకమైన ఆంధ్ర హైకోర్టు ప్రధాన బెంచ్ (లేదా హైకోర్టు)ను కర్నూలులో సాధించేందుకు స్థానిక న్యాయవాదుల మధ్య ఐక్యత అవసరమని ప్రముఖ న్యాయవాద వర్గాలు గట్టిగా వాదిస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రాపకంలో వ్యక్తిగత లబ్ధి కంటే, ప్రాంతీయ ప్రయోజనాలే ముఖ్యమని, హైకోర్టు స్థాపనతో వేలాది మంది న్యాయవాదులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నియామకాలపై ఆగ్రహం: రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కేవలం కొద్దిమంది లాయర్లకు (సుమారు 10 మందికి) తాత్కాలిక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పోస్టులు ఇవ్వడం మినహా, రాయలసీమకు శాశ్వత ప్రయోజనం చేకూర్చే హైకోర్టు ఏర్పాటుకు చిత్తశుద్ధి చూపడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం అనేది నీటి మీద బుగ్గ లాంటిది" అని పేర్కొంటూ, రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కర్నూలు అభివృద్ధికి హైకోర్టు కీలకం: రాయలసీమ ప్రాంత కేంద్రమైన కర్నూలులో ఆంధ్ర హైకోర్టు లేదా శాశ్వత బెంచ్ ఏర్పాటైతే ప్రాంతం కొంతైనా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా న్యాయ ప్...

ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి – గూగుల్‌తో ఏపీ ఒప్పందం

  వచ్చే ఐదేళ్లలో విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఢిల్లీలో గూగుల్, ఏపీ ప్రభుత్వం మధ్య ఏఐ హబ్ ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. కేంద్ర మంత్రులు అశ్వని వైష్ణవ్, నిర్మలాసీతారామన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గూగుల్ ప్రతినిధులు విశాఖలో పెట్టుబడిపై తమ సంస్థ ఎంతో ఆసక్తిగా ఉందని.. వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్ల మేర ఖర్చుపెడతామని తెలిపారు. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫో టెక్ ద్వారా పది బిలియన్ డాలర్లు, నేరుగా గూగుల్ ద్వారా మరో ఐదు బిలియన్ డాలర్లు ఈ పెట్టుబడుల ప్రతిపాదనల్లో ఉన్నాయి. 2029 నాటికి డేటా సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు. గ్లోబల్ కనెక్టివిటీ హబ్‌గా విశాఖ ఉండబోతుందని … విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ-కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతాయని ప్రకటించారు. అమెరికా వెలుపల గూగుల్ సంస్థ ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారని గుర్తు చేశారు. జెమినీ-ఏఐతో పాటు గూగుల్ అందించే ఇతర సేవలు కూడా ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయని పేర్కొన్నారు. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందు...

సంక్రాంతి నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు!

  హెలీ టూరిజానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ - శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్ లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్సైట్ తీసుకురానుంది...!!

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం – హరీష్ బాబు

 ధర్మవరం పట్టణంలోని లోనికోట ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు స్వయంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు నందు మరియు మధు లా విన్నపం మేరకు, మంగళవారం హరీష్ బాబు లోనికోట వార్డుకు వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డ్ ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. కాల్వలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిలిచిపోవడం, దుర్వాసన వ్యాప్తి వంటి సమస్యలను ప్రజలు వివరించారు. వెంటనే హరీష్ బాబు మున్సిపల్ అధికారులను టెలిఫోన్ ద్వారా సంప్రదించి, కాల్వల శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలనీ, శానిటేషన్ విభాగం పర్యవేక్షణను నిత్యకృత్యంగా నిర్వహించాలనీ కోరారు. అలాగే వీధి దీపాలు పనిచేయకపోవడం పై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను గమనించి, విద్యుత్ విభాగం సిబ్బందికి దీపాల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలనీ, రోడ్ల మరమ్మత్తు పనులపై వివరణాత్మక ప్రణాళిక రూపొందించాలనీ మున్సిపల్ అధికారులకు సూచించారు. పాడైన రోడ్లను తక్షణమే మరమ్మతు చేసి, అవసరమున్న చోట కొత్త రోడ్లు వేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మున్సిపల్ ఇంజినీర్లకు...

గంగమ్మ కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ప్రశంస

ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రధాని ధన్ ధాన్య యోజన మరియు సహజ వ్యవసాయ ధ్రువపత్రం కార్యక్రమంలో, శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామానికి చెందిన సహజ వ్యవసాయ రైతు మహిళ సాకే గంగమ్మ, అన్నమయ్య జిల్లాకు చెందిన సురం శ్రీదేవి తో కలిసి దేశ గర్వకారణమైన ఘనతను సాధించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని, భారతీయ సహజ వ్యవసాయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే సామల చిత్రకళ మరియు ఎద్దుల బండి ప్రతిరూపంతో సన్మానించారు. ఈ సత్కారం భారతదేశ సహజ వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, సంప్రదాయాన్ని సంరక్షించే క్రమంలో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆత్మను ప్రతినిధ్యం వహించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గంగమ్మ ని అభినందిస్తూ – ప్రకృతి ముందుకు నడిపితే రైతులు ఎదుగుతారు, భారత్ అభివృద్ధి చెందుతుంది అని పేర్కొని, సహజ వ్యవసాయం పట్ల తన మద్దతును వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, రాఘవంపల్లి గ్రామానికి వెళ్లి గంగమ్మ ని స్వగృహంలో సన్మానించి, ఆమెను, మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ఫోన్ ద్వారా మాట్లాడించారు. మంత్రి సత్య కుమ...

షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్‌ పర్సన్ ను కలిసిన వైకాపా నేతలు .

  సాలూరు: జాతీయ షెడ్యూల్డు తెగల చైర్ పర్సన్ అంతర్ సింగ్ ఆర్యను రాష్ట్రానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అరకు, తిరుపతి ఎంపిలు డాక్టర్ తనూజా రాణి, డాక్టర్ మద్దెల గురుమూర్తిల ఆధ్వర్యంలో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థినులు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడి ఇద్దరు మృతి చెందటం, వంద మందికి పైగా విద్యార్థినిలు ఆసుపత్రిలో చేరటం తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందజేసారు.  కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని, నిరుపేద గిరిజన కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించ లేదని, కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని పిర్యాదు చేశారు. చైర్ పర్సన్ ను కలిసిన వారిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, మాజీ డిప్యూటీ సీఎంలు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణిలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు మాజీ ఎంపీ జి. మాధవి, జిసిసి మాజీ చైర్పర్సన్, ఉమ్మడి విజయనగరం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ స్వాతీ రాణి, పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్...

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ: ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లండి - వాల్మీకి సంఘం పిలుపు

రాయదుర్గం : వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించే (Restoration of ST status) కీలకమైన అంశాన్ని కూటమి ప్రభుత్వంలోని వాల్మీకి ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) తప్పనిసరిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్లాలని రాయదుర్గం నియోజకవర్గం వాల్మీకి సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు నాయకుల బండి క్రిష్టప్ప పిలుపునిచ్చారు. మంగళవారం రాయదుర్గం పట్టణంలోని మహర్షి శ్రీ వాల్మీకి కళ్యాణ మండపం ఆవరణలో సమితి సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి క్రిష్టప్ప మాట్లాడుతూ, ఈ నెల 16న నంద్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరుకానున్న ప్రధాని మోదీని కలిసి ఈ అంశంపై హామీ పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధుల బాధ్యత:   2019లో కర్నూలు సభ సాక్షిగా ప్రస్తుత ప్రధానమంత్రి నాడు వాల్మీకులకు ఇచ్చిన గిరిజన రిజర్వేషన్ల హామీని గుర్తు చేయాల్సిన చారిత్రక బాధ్యత వాల్మీకి ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.   వాల్మీకి ముద్దుబిడ్డలైన ప్రజాప్రతినిధులు అందరూ ఐకమత్యంతో వ్యవహరించి, వాల్మీకి సామాజిక వర్గం స్థితిగతులను మరోసారి ప్రధానికి వివరించి, ఉమ్మడి రాష్ట్రాల్లోని బోయ, వాల్మీకులను ఎస్టీ పునర...

కర్నూలు హైకోర్టు సాధన కోసం ప్రధాని మోదీకి వినతి ప్రయత్నం

  కర్నూలు, అక్టోబర్ 14, 2025: ఈ నెల 16న కర్నూలుకు రానున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసి, శ్రీ బాగ్ ఒప్పందం (16-11-1937) ప్రకారం రాయలసీమలోని కర్నూలులోనే ప్రధాన హైకోర్టును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వినతిపత్రాలు సమర్పించేందుకు కర్నూలు హైకోర్టు సాధన సమితి సభ్యులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు, హైకోర్టు సాధన సమితి సభ్యులైన జి.వి.కృష్ణమూర్తి, కె.నాగరాజు, ఆర్.నరసింహులు, బి.చంద్రుడు, ఎం.సుబ్బయ్య, ఎం.ఆర్.కృష్ణా, ఖాదర్ బాషా, మక్బూల్, కటారు కొండ ఓంకార్, కె.సి.రాముడు, మహబూబ్ బిగ్ మరియు సోమశంకర్ యాదవ్ తదితరుల పేర్లను జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారికి సమర్పించడం జరిగింది. సమితి సభ్యులు ఈ రోజు ప్రధాని సమావేశ వేదిక ప్రాంతానికి చేరుకుని, ఏర్పాట్ల తీరును పరిశీలించారు. అనంతరం, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను కలిసి, పై సభ్యుల వివరాలను అందించారు. జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలు ఈ వివరాలను ప్రధానమంత్రి సెక్యూరిటీ వింగ్ (SPG Wing) – Z+ కేటగిరీ భద్రతకు సంబంధించిన విభాగానికి పరిశీలన నిమిత్తం పంపినట్లు తెలిసింది. సెక్యూరిటీ వింగ్ పరిశీలన మరియు ఆమోదం అందిన వెంటనే, ఈ సభ్యులకు ప్రధానిని కలిసే...

శ్రీశైలంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష

ఉరవకొండ అక్టోబర్ 14: ఈ నెల 16వ తేదీన కర్నూలు పర్యటనలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాని పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక,మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్షించారు. మంత్రి పయ్యావుల కేశవ్ సహచర మంత్రివర్గ సభ్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి, ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను వారు ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రోటోకాల్ నిబంధనలను తప్పక పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని రాక సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు, ముఖ్యంగా బాలికలు మరియు మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

     మావోయిస్టు అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయారు   మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు ఆయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా మరియు అగ్ర నాయకుడిగా ఉన్నారు. మహారాష్ట్రలో 60 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. ఆయన నేపథ్యం గురించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి: మల్లోజుల వేణుగోపాలరావు నేపథ్యం    జననం, స్వస్థలం: వేణుగోపాలరావు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా) లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు మల్లోజుల వేణుగోపాలరావు, అయితే ఆయన మాదరి అనే పేరుతో కూడా సుపరిచితులు.   విద్య: ఆయన వరంగల్‌లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రస్తుత NIT-వరంగల్)లో ఇంజినీరింగ్ చదివారు.   పార్టీలో పాత్ర: ఆయన 1980లలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, భారతదేశంలో అతిపెద్ద మావోయిస్టు పార్టీ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.   ఆయన CPI కేంద్ర కమిటీ సభ్యుడిగా మరియు దండకారణ్యం స్పెషల్ జోన్ కార్యదర్శిగా పనిచేశారు.  పార్టీలో ఆయన భూపతి మరియు శ్రీనివాస్ వంటి పేర్లతో కూడా పిలవబడేవారు.  అగ్రనేత సోదరుడు:...

చెరుకు రసం అమ్మే మహిళ జీవనాధారాన్ని కూల్చిన టౌన్ ప్లానింగ్ విభాగం!

గుంటూరు కార్పొరేషన్...   గుంటూరు నగరంలో చెరుకు రసం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఒక మహిళపై టౌన్ ప్లానింగ్ విభాగం అకస్మాత్తుగా ‘రోడ్డు అక్రమణ’ పేరిట చర్యలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. గత ఏడాది నుంచి కార్పొరేషన్ కార్యాలయాన్ని చుట్టూ తిరుగుతూ తన సమస్యను చెప్పుకున్నా, న్యాయం దక్కలేదని ఆ మహిళ వేదన వ్యక్తం చేసింది. రోజుకు ₹300–₹500 వరకు చెరుకు రసం అమ్మి తన కుటుంబాన్ని పోషిస్తున్న ఆ మహిళ జీవనాధారం ఒక్కసారిగా నశించింది. కమీషనర్ గారిని మూడు సార్లు కలిసినా ఉపయోగం లేకపోయిందని ఆమె చెబుతోంది. "కొత్తగా తెచ్చుకున్న చెరుకు మిషన్‌ని కూడా ఎత్తుకెళ్లి, పనికిరాని పాత మిషన్‌ను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించారు," అని ఆవేదనతో వివరించింది. పౌరుల జీవనోపాధిని కాపాడాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగమే ఇలా వ్యవహరించడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల పేరుతో చిన్న వ్యాపారులను ఇబ్బంది పెట్టే విధానం పునరాలోచించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: జైభీమ్ రావ్ భారత్ పార్టీ డిమాండ్

ఉరవకొండ, అక్టోబర్ 14, 2025: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు-పబ్లిక్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీఆర్‌బీపీ) ఉరవకొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పోస్టర్లను విడుదల చేశారు. ఉరవకొండలోని ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ ముఖ్య అతిథిగా హాజరై పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈ సందర్భంగా రామప్ప నాయక్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరియు ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. "ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం అయితే, విద్యార్థులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు మరియు సామాజిక న్యాయం అమలుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు," అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక, ఈ కాలేజీలకు అను...

సేవ్ ది గర్ల్ చైల్డ్" నినాదంతో చాబాలలో అంతర్జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు

  " అనంతపురం జిల్లాలో అక్టోబర్ 12 నుండి 18 వరకు "సేవ్ ది గర్ల్ చైల్డ్" (బాలికలను రక్షించండి) నియమావళిపై PC&PNDT చట్టం కింద అవగాహన కార్యక్రమాల ప్రచారాన్ని నిర్వహించాలని సూచనలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా, అక్టోబర్ 14, 2025 (అంతర్జాతీయ బాలిక దినోత్సవం) నాడు, వజ్రకరూరు మండలం, చాబాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ హెల్త్ ఎడ్యేకేషన్ ఆఫీసర్ (Deputy Health Education Officer) శ్రీ వేణుగోపాల్ గమరియు గ్రామ సర్పంచ్ శ్రీ జగదీష్ గారు హాజరయ్యారు. బాలికలకు సాధికారత (Empowerment), రక్షణ, విద్య, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ మరియు ఆరోగ్యం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ సర్పంచ్ శ్రీ మల్లెలు జగదీష్  మాట్లాడుతూ, "సేవ్ ది గర్ల్ చైల్డ్" యొక్క ప్రాముఖ్యత గురించి సమాజంలో అవగాహన పెంచడం చాలా ముఖ్యమన్నారు. బాలికలను రక్షించడం, వారికి సాధికారత కల్పించడం అనే లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు. ఆరోగ్య విస్తరణాధికారి శ్రీ విజయ్ కుమార్ గ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ల...