Skip to main content

Posts

ఆర్డీటి యఫ్ సీ ఆర్ ఏ కొనసాగించాలని ఆధ్యాత్మిక వేత్త మహారాజ్ ప్రధాని ని డిమాండ్

 కర్ణాటక రాష్ట్రం బంజారా సంఘం నేత ధార్మిక ఆధ్యాత్మిక వేత్త శ్రీ మహారాజ్ ద్వారా భారత దేశ ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోడీ కి దేశస్థాయిలో సేవలు అందిస్తున్న ఆర్ టి టి ని కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు శుక్రవారం కర్ణాటక కు వెళ్లి రూపా నాయక్ నానుసాద్ కుటుంబీకుడు శ్రీ మహారాజును సేవా గడ్ ట్రస్టు ఉపాధ్యక్షులు ఎస్ కేశవ నాయక్ కలిశారు.  ఈ సందర్భంగా స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ సుదీర్ఘకాలం బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను కొనసాగేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు శుక్రవారం శ్రీ మహారాజ్ దేశ ప్రధానికి కలవడానికి వెళుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానికి ఆర్డిటి పై సమగ్రంగా తయారుచేసిన వినతి పత్రం అందజేయాలని కోరారు. ఈ విషయమై ప్రధాని హోం శాఖ మంత్రి తో చర్చించి తప్పకుండా న్యాయం జరిగేలాగా శ్రద్ధ తీసుకుంటానని శ్రీ మహారాజ్ కేశవ నాయక్ కు హామీ ఇచ్చారు శ్రీ మహారాజును కలిసిన వారిలో బంజారా సంఘం నేత లాల్ సింగ్ కర్ణాటక ప్రసిద్ధ గాయకుడు కుబేర్ నాయక్ ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్ కమల్ సింగ్ రాథోడ్ బంగి దుర్గ తదితరులు ఉన్నారు

కోర్టులో ప్రాక్టీస్ చేయని న్యాయవాదులు లైసెన్స్ వదులుకోవాలి.

  ఒడిశా రాష్ట్ర బార్ కౌన్సిల్  కోర్టుల్లో న్యాయవాద వృత్తి చేయకుండా,ఇతర వృత్తుల్లో, వ్యాపారాల్లో లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల్లో నిమగ్నమై ఉన్న న్యాయవాదులు తమ ప్రాక్టీస్ లైసెన్స్‌ను ఒక నెలలోపు సర్పెండర్ చేయాలని ఒడిశా బార్ కౌన్సిల్ ఆదేశించింది. కొంతమంది న్యాయవాదులు ప్రైవేట్ కంపెనీలు,ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారని,అలాగే వ్యాపారాల్లో నేరుగా పాల్గొంటున్నారని, అయినప్పటికీ,తమ దగ్గర న్యాయవాద వృత్తి చేసేందుకు లైసెన్స్ ఉంచుకుంటున్నారని ఒడిశా బార్ కౌన్సిల్ ముందు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందిస్తూ ఇలా చేయడం *Advocates Act,1961* నిబంధనలకు విరుద్ధమని ఒడిశా బార్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈ నిబంధనల ప్రకారం.... 👉అడ్వకేట్ నేరుగా వ్యాపారం చేయరాదు. అయితే,ఒక వ్యాపార సంస్థలో Sleeping Partner (రోజువారీ వ్యవహారాల్లో పాల్గొనని భాగస్వామి)గా ఉండవచ్చు కానీ ఆ వ్యాపారం స్వభావం న్యాయవాద వృత్తి గౌరవానికి విరుద్ధంగా ఉండకూడదు. 👉న్యాయవాది ఒక కంపెనీకి డైరెక్టర్ లేదా ఛైర్మన్‌గా ఉండవచ్చు.అయితే,ఎలాంటి ఎగ్జిక్యూటివ్ విధులు (రోజువారీ పాలన/నిర్వహణ పనులు) చేయరాదు. 👉న్యాయవాది Managing Director లేదా Secr...

ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

కడప: - ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరనున్న శ్రీ రాముడి విగ్రహం.. - ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు.. - ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు..

వృద్ధాప్య తల్లితండ్రులను పట్టించుకోకపోతే.. ఆస్తి అనుభవించే హక్కు లేదు: సుప్రీంకోర్టు

  వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు వారి ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించే సంతానాన్ని బయటకు వెళ్లగొట్టొచ్చని తేల్చిచెప్పింది. బిడ్డల నిరాదరణకు గురయ్యే తల్లిదండ్రులకు 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన *తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం* అండగా నిలుస్తుందని వ్యాఖ్యానించింది. కుమారుడు తమ సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం లేదంటూ మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ తీర్పు వెలువడింది.  తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ చట్టం ప్రకారం.. ఏర్పాటైన ట్రైబ్యునళ్లు..కన్నవారిని పట్టించుకోని బిడ్డల విషయంలో సత్వర విచారణ జరుపుతాయని తెలిపింది. ఇలాంటి వివాదాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై యాజమాన్య హక్కులు తిరిగి బాధితులకే దక్కేలా ఆదేశించే అధికారం ఆ ట్రైబ్యునళ్లకు ఉంటుందని ధర్మాసనం స్పష్టంచేసింది.

మహాకవి శ్రీ శ్రీ రచన

 కుదిరితే పరిగెత్తు.. ,  లేకపోతే నడువు...  అదీ చేతకాకపోతే...  పాకుతూ పో.... ,  అంతేకానీ ఒకే చోట అలా  కదలకుండా ఉండిపోకు...  ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతినిందని,  'స్నేహితుడొకడు మోసం  చేశాడని,' ప్రేమించినవాళ్ళు వదిలి  వెళ్ళి పోయారని... అలాగే ఉండిపోతే ఎలా?  దేహానికి తప్ప, దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే  ఎగిసి ఎగిసి పడుతుంటే...     తలుచుకుంటే...  నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు  కూడా...  నీ ముందు తలదించుకునేలా  చేయగల సత్తా నీది,  అలాంటిది ఇప్పుడొచ్చిన  ఆ కాస్త కష్టానికే తలొంచేస్తే  ఎలా? సృష్టిలో చలనం ఉన్నది  ఏదీ ఆగిపోకూడదు..., పారే నది.., వీచే గాలి..., ఊగే చెట్టు..., ఉదయించే సూర్యుడు.... అనుకున్నది సాధించాలని నీలో కసికసిగా ప్రవహిస్తుందే ఆ నెత్తురుతో సహా....,,  ఏదీ ఏది ఆగిపోడానికి వీల్లేదు.., లే...  బయలుదేరు...   నిన్ను కదలనివ్వకుండా చేసిన  ఆ మానసిక భాదల  సంకెళ్ళను తెంచేసుకో... ,   పడ్డ చోటు నుండే పరుగు  మొదలుపెట్టు...  నువ్వు పడుకునే ...

న్యాయమూర్తులకు శిక్ష విధించే కొత్త చట్టాలు ఏమిటి?

 ఢిల్లీ: సాధారణంగా, న్యాయమూర్తులు న్యాయ స్వాతంత్ర్యం (judicial independence) సూత్రం కారణంగా ఇతర పౌరుల మాదిరిగా సాధారణ క్రిమినల్ చట్టాల కింద శిక్షించబడరు. న్యాయ పాలనకు ఇది చాలా ముఖ్యం. అయితే, దీని అర్థం వారు చట్టానికి అతీతులు అని కాదు. న్యాయమూర్తుల దుష్ప్రవర్తనను మరియు తీవ్రమైన కేసులలో, నేరపూరిత ప్రవర్తనను పరిష్కరించడానికి యంత్రాంగాలు ఉన్నాయి. కొత్త చట్టాలు మరియు న్యాయమూర్తుల జవాబుదారీతనం న్యాయమూర్తులకు శిక్ష విధించడం మరియు క్రమశిక్షణకు సంబంధించిన చట్టాలు సాధారణంగా ఒక దేశం యొక్క న్యాయ లేదా రాజ్యాంగ చట్రంలో భాగం. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఆమోదించబడిన ప్రతి కొత్త చట్టం యొక్క పూర్తి జాబితాను నేను అందించలేను, కానీ నేను కొన్ని ముఖ్యమైన పరిణామాలు మరియు సాధారణ సూత్రాలపై సమాచారాన్ని ఇవ్వగలను. ఉదాహరణకు, భారతదేశంలో, కొత్త క్రిమినల్ చట్టాలలో భారతీయ న్యాయ సంహిత, 2023 ఒక ముఖ్యమైన అభివృద్ధి. ఇది భారతీయ శిక్షా స్మృతిని (Indian Penal Code) భర్తీ చేస్తుంది. ఈ చట్టం నేరాలకు సంబంధించిన నిబంధనలు మరియు వాటి శిక్షలకు ప్రసిద్ధి చెందింది. ఇది "న్యాయమూర్తి"ని అధికారికంగా న్యాయమూర్తిగా నియమించబడిన వ్యక్తి...

సోషల్ మీడియాలో దుర్వినియోగం పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున.

ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున తన పేరును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న అనుచిత కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ తేజస్ కారియాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం ముందు నాగార్జున తరఫున న్యాయవాది ప్రవీణ్ణానంద్ వాదనలు వినిపించారు. న్యాయవాది వాదిస్తూ—“నాగార్జున ఇప్పటివరకు 95 సినిమాల్లో నటించారు. రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడైన ఆయనను ఉగ్రవాదిగా పేర్కొంటూ కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జూదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రొమాంటిక్ సంబంధాల పేర్లు అంటగడుతున్నారు. అంతేకాకుండా, ఏఐతో తయారు చేసిన వీడియోలను యూట్యూబ్ షార్ట్స్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో నాగార్జున పేరుతో హ్యాష్‌ట్యాగ్‌లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ సమాచారాన్ని తొలగించేలా సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలి” అని విన్నవించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, అనుచిత కంటెంట్ ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్ల...