ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రగతి ద్వారాలు తెరుచుకుని వేగంగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్ కు సరికొత్త శక్తిగా ఏపీ తయారవుతోంది. కృష్ణా జిల్లా నిమ్మకూరులో రక్షణ రంగానికి చెందిన నైట్ విజన్ గాగుల్స్, క్షిపణుల సెన్సార్లు, డ్రోన్ గార్డులను తయారు చేయగలదు. రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతులను కూడా చేసేందుకు ఆస్కారం ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ లో దేశంలో తయారైన ఉత్పత్తుల బలం ఏమిటో చూశాం. కర్నూలులో భారత్ డ్రోన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ నిర్ణయించటం సంతోషదాయకం. ఆపరేషన్ సింధూర్ లో డ్రోన్ల పనితీరు ఏమిటో తెలియచెప్పింది. డ్రోన్ల తయారీ ద్వారా కర్నూలు భారత్ కు ఓ గర్వకారణంగా నిలుస్తుంది. పౌరులకు అనుగుణంగా అభివృద్ది చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వ నినాదం. ఈజ్ ఆఫ్ లివింగ్ అనే అధ్యాయం ప్రారంభమైంది. ప్రజల జీవితాలను సులభతరం చేయటమే సంకల్పం. 12 లక్షల ఆదాయం ఉన్న ప్రతీ ఒక్కరికీ పన్ను లేకుండా చేశాం. వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నాం. సరిగ్గా నవరాత్రి ముందు జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి తీసుకువచ్చాం. ప్రజలపై పన్నుల భారం తొలగించాం. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ...
Local to international