కర్నూలు: రాయలసీమకు హైకోర్టు బెంచ్ సాధన లక్ష్యంగా పనిచేస్తున్న కర్నూలు హైకోర్టు సాధన సమితి, 18-10-2025, శనివారం సాయంత్రం 5 గంటలకు కర్నూలులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవనం, రాజవిహార్ కేంద్రం వద్ద అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించారు. ముఖ్యమంత్రి, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు సమావేశంలో మొదటి అజెండాగా, ఇటీవల 16-10-2025న భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లు రాయలసీమ ప్రాంతం కర్నూలుకు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు బెంచ్‌ను ఇస్తామని చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చినందుకు గాను ఇరువురికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సమితి తీర్మానం చేసి, రిజిస్టర్‌లో నమోదు చేసుకుంది. రూ. 600 కోట్లు కేటాయించాలని డిమాండ్ తదుపరి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ బాబులు హైకోర్టు బెంచ్ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే రాయలసీమ-కర్నూలుకు ఆంధ్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం శాశ్వత భవనం నిర్మాణం కొరకు నిధులు కేటాయించాలని సమ...
Local to international