Skip to main content

Posts

నేవీ చిల్డ్రన్ స్కూల్ పోస్టులకు దరఖాస్తులు

నేవీ చిల్డ్రన్ స్కూల్ 8 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, బీఈడీ, డిప్లొమాతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. వయసు 21 నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డెమాన్స్ట్రషన్ క్లాస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. 

ప్రతి ఒక్క జూనియర్ కళాశాలలో పి డి , పి ఈ టి పోస్టులను భర్తీ చేయాలి.

  ప్రభుత్వ జూనియర్ కళాశాల ను పాత సమయ పద్ధతిలోనే నిర్వహించాలి ఎందుకనగా చాలామంది విద్యార్థులు బస్సుకు వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉంటారు ఇందులో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే ఉంటారు వారికి సరైన బస్సు సౌకర్యం లేక సతమతమవుతున్నారు కావున జూనియర్ కళాశాల సమయం ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు నిర్వహించాలి అలాగే ప్రతి ఒక్క జూనియర్ కళాశాలలో పి డి లేదా పి ఈ టి పోస్టులను భర్తీ చేయాలి జూనియర్ కళాశాల విద్యార్థులకు పిఈటిలు లేక వారికి ఆసక్తికరమైనటువంటి క్రీడలలో వెనుకబడే పరిస్థితి కనిపిస్తుంది కావున ప్రతి ఒక్క విద్యార్థిలో ఉండే కళను బయటకు తీసుకువచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కావున తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పి ఈ టి పోస్టులను భర్తీ చేయాలని ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి S.M. హరూన్ రషీద్ కోరారు.

సమాచారం ఇవ్వని గుత్తి తహసీల్దార్హ, గుంతకల్ల్ ఆర్ డీ ఓ లపై చర్యలు తీసుకోండి, guntak

   ఉరవకొండ మన జన ప్రగతి అక్టోబర్ 21 : గుత్తి మండలం: పుల్లేటి ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ భూ సమాచారం, అక్రమ మ్యూటేషన్ గురించి అడిగిన సమాచారాన్ని గుత్తి తాసిల్దార్ ఇవ్వలేదు. దీంతో అప్పీలు అధికారి అయిన గుంతకల్ ఆర్డీవోను ఆశ్రయించగా ఆయన సమాచారం అందించలేదు. నిర్ణీత గడువు 30 రోజుల్లోగా సమాచారాన్ని సెక్షన్ 7(1 )కింద ఇవ్వకపోతే ఉల్లంఘనే. ఉల్లంఘనా చర్యల్లో భాగంగా సెక్షన్ 20(1) ప్రకారం ఆలస్యానికి గాను బాధ్యత వహించి రోజుకు ₹250 చొప్పున జరిమానా చెల్లించాలని ఆర్ టి ఐ యాక్ట్ లోని సెక్షన్ 20 (2) చెబుతోంది. ఇదే క్రమంలో  అప్పీలు అధికారి ఆర్డీవో సమాచారం ఇప్పించడంలో వైఫల్యం చెందారు. సేవా నిబంధనల ప్రకారం ఆయన కూడా శాఖాపరమైన చర్యలకు బాధ్యులే. అధికారులు ఇద్దరు ఇద్దరే. సమాచారం ఇవ్వని, ఇప్పించని అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారుడు/ ఆప్పీలు దారుడు మాలపాటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సమాచారం ఇవ్వని అధికారులు: రెండవ అప్పీల్‌కు దరఖాస్తు గుంటూరు జిల్లా, మంగళగిరి: సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ, పౌర సమాచార అధికారి (P...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం

  ఆమె ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్ కేరళ రాష్ట్రం కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో ద్రౌపది ముర్ము ల్యాండ్ అయిన హెలిప్యాడ్ కుంగడంతో, ఒక పక్కకు ఒరిగిన హెలికాప్టర్ వెంటనే హెలికాప్టర్‌ను నెట్టి పక్కకు పెట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది..

ఫోటో లో పాప పత్తికొండ పోలీస్ స్టేషన్ లో ఉంది

   పై ఫోటో లో వున్న చిన్న పాప పత్తికొండ పోలీసు స్టేషన్ లో వున్నది. ఈ పాప పత్తికొండ టౌన్ నందు గల SBI బ్యాంక్ వద్ద వారి తల్లి తండ్రుల నుంచి తప్పి పోయి ఒంటరిగా ఉండదాన్ని గమనించి అక్కడి వారు పోలీసు స్టేషన్ నందు అప్పగించడమయినది. కావున పాపను ఎవరయినా గుర్తించి వారి తల్లి తండ్రులకు విషయము తెలిపి ఈ పాపను తల్లి తండ్రుల చెంతకు చేర్చుటకు తమ వంతు సహకారము తెలుప గలరని  ఇట్లు  ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు  పత్తికొండ UPS

ఒక్క ఛాన్స్ ప్లీజ్.-కరెంట్ గోపాల్

  పోలీస్ అమరవీరుల త్యాగాలను కొనియాడే ఒక్క అవకాశం కల్పించాలని కరెంట్ గోపాల్,,గుంతకల్ డివిజనల్ పోలీసు అధికారిని కోరారు. ఆయన పేరు గోపాల్. ఇంటిపేరు ఉక్కీసుల. ఉక్కీసుల గోపాల్ అంటే ప్రజలు గుర్తుపట్టరు కానీ ఆయనను కరెంట్ గోపాల్ అని పిలిస్తే ప్రజలు ఇట్టే గుర్తుపడతారు. ఉక్కీసుల గోపాల్ అలియాస్ కరెంటు గోపాల్ అంటే కరెక్ట్ గోపాల్ అనే పేరు అయన సంపాదించుకున్నారు.  వృత్తి రీత్యా ఆయన గ్రామపంచాయతీలో సీనియర్ ఎలక్ట్రీషియన్ గా ఎలాంటి అరమరికలు లేకుండా అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ అందరి మెప్పు పొందారు.  ప్రవృత్తి రీత్యా ఆయనలో దేశభక్తి భావనలు అణువు అణువులో నిండిపోయాయి.  దేశం కోసం స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన దేశ నాయకుల, రాష్ట్ర నాయకుల చరిత్రలు ఆయనకు కొట్టిన పిండి. వారి జయంతోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ప్రజలకు వివరించి వారిలో దేశభక్తి భావనలు పెంపొందిస్తున్నారు.  ఈ క్రమంలో ఆయన పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు సేవలను కొనియాడే అవకాశం కోసం తహతహలాడిపోయారు. దీంతో గుంతకల్ పోలీస్ డివిజన్ అధికారి శ్రీనివాసులను సోమవారం కలిసి పోలీసు సేవలను కొనియాడే ఒక్క ఛాన్స్ తనకు ఇ...

భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటాను: నటి రేణూ దేశాయ్

  తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే ఇష్టమని, భవిష్యత్తులో సన్యాసం తీసుకుంటానని నటి రేణూ దేశాయ్ తెలిపారు. “ఆద్య, అకీరా చిన్నవాళ్లే కాబట్టి కొన్నేళ్లు ఇక్కడ ఉంటాను. తర్వాత సన్యాసినిగా జీవిస్తాను,” అని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనకు ఇప్పుడు మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో ఛాన్స్లు వస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం అత్తగారి పాత్రకు ఓకే చేశానని, త్వరలో ఆ సినిమా ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు.