Skip to main content

Posts

కర్నూలు బస్సు ప్రమాదంపై బిజెపి నేత దగ్గుపాటి శ్రీ రామ్ దిగ్భ్రాంతి

ఉరవకొండ: కర్నూలు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర బీ జే పీ సీనియర్ నేత దగ్గుపాటి శ్రీ రామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని విడుదల ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులను ఆదుకోవాలి ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మంత్రి తమ సానుభూతిని తెలియజేశారు. "బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రమాదం గురించి తెలియగానే వెంటనే ఆయన దేశ ప్రధాని, రాష్ట్ర సియం ద్రుష్టి కి తీసుకెళ్లి నట్లు తెలిపారు.  ఏపీ వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, వారికి అవసరమైన  సహాయాన్ని అందించాలని కోరగా,అధికారులను  ఆదేశించినట్లు బిజెపి నేత దగ్గుపాటి శ్రీ రామ్  వెల్లడించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

ఏపీటీఎఫ్ నూతన మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పట్టు

  ఉరవకొండ (అనంతపురం జిల్లా), అక్టోబరు 24: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (APTF) ఉరవకొండ మండల నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన APTF మండల సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, మండల అధ్యక్షులు పాండురంగ, ప్రధాన కార్యదర్శి బీసీ ఓబన్న పర్యవేక్షణలో జరిగింది. ఎన్నికల అధికారిగా భాస్కర్ వ్యవహరించారు. నూతన కార్యవర్గం వివరాలు: సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన మండల కమిటీ వివరాలు: | పదవి | పేరు | |---|---| | గౌరవ అధ్యక్షులు | రెడ్డి లోకేష్ | | అధ్యక్షులు | వేణుగోపాల్ | | ప్రధాన కార్యదర్శి | ఏళ్ళ భువనేశ్వర్ చౌదరి | | గౌరవ సలహాదారు | ఓకే వెంకటేశ్ ప్రభు | | జిల్లా కౌన్సిలర్‌లు | బీసీ ఓబన్న, బి. చంద్రశేఖర్, ఎం. సలీం భాష, రాముడు, ఎం. లలిత, పాండురంగ, రామకృష్ణ, నరసింహులు, ఆదినారాయణ | కీలక డిమాండ్లు: ప్రభుత్వంపై ఏపీటీఎఫ్ ఒత్తిడి నూతన కమిటీ ఎన్నిక అనంతరం జరిగిన సమావేశంలో, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని APTF నాయకులు కీలక డిమాండ్లు చేశారు: ...

వింజమూరు మండలంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

  నెల్లూరు జిల్లా /ఉదయగిరి -  - చాకలకొండ పంచాయితీ ఏరియాలో చేరిన గొల్లవారిపల్లిలో విషాదం  - కర్నూల్ జిల్లా బస్సు దగ్ధమైన ఘటనలో మృతి చెందిన నలుగురు

ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

  కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20మందికిపైగా సజీవ దహనం కావడంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

  వెస్ట్ జోగీశ్వర్‌లోని JMS బిజినెస్ సెంటర్‌లో పెద్దఎత్తున వ్యాపించిన మంటలు పైఅంతస్తుల్లో కొంత మంది వ్యక్తులు చిక్కుకున్నట్లు సమాచారం  లెవల్-2 అగ్నిప్రమాదంగా ప్రకటించిన ముంబై అగ్నిమాపక దళం కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రమాదానికి గల కారణాలపై రావాల్సిన స్పష్టత.

తిరువూరు వ్యవహారంపై చంద్రబాబు సీరియస్‌

  తిరువూరు: ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. సోషల్‌ మీడియాలో రచ్చపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విమర్శలు, వివాదాలు సృష్టించే వ్యాఖ్యలపై సీరియస్‌ అయ్యారు. దుబాయ్‌ పర్యటనలో ఉన్న సీఎం.. ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఇద్దరినీ పిలిచి మాట్లాడతానని పల్లా చెప్పగా.. అవసరం లేదని యూఏఈ నుంచి వచ్చాక తానే దృష్టి పెడతానని స్పష్టం చేసినట్లు సమాచారం.

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

  బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అధికారులు  సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్న సీఎం ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశం  క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశం మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచన.