! పని హక్కు అనేది మనిషి గౌరవానికి, జీవనోపాధికి అవసరమైన ప్రాథమిక హక్కు.న్యాయమైన,సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు ప్రతి మనిషికీ వుంది.గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని పని కోసం ఉపాధి హామీ పథకాల ద్వారా చట్టపరమైన పని హక్కు కల్పించబడుతోంది. అంతేకాదు,నిర్దిష్ట పనిగంటలు అమలు జరుగుతున్నాయి.దేశంలోని ప్రతి వ్యక్తీ సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలే ప్రాథమిక హక్కులు.‘భారత ప్రజాస్వామ్యా నికి పునాదిరాళ్లు ప్రాథమిక హక్కులు’అంటారు నానీ ఫాల్కీవాలా. పనిహక్కు అనేది ప్రజలకు ఉత్పాదక పనిలో పాల్గొనే ప్రాథమిక హక్కును సూచిస్తుంది.దీనిని 1948 ఐరాస మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో పొందుపరిచారు.భారత రాజ్యాంగం, ముఖ్యంగా ఆర్టికల్ 21, 41 ప్రకారం…జీవించే హక్కులో భాగంగా పనిచేసే హక్కుకు హామీ ఇస్తుంది.ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా స్వేచ్ఛ అసంభవం’ అంటారు గాంధీజీ. కానీ,ఆర్థిక స్వాతంత్య్రం…పని లేకుండా సాధ్యం కాదు.పని-కేవలం ఆదాయం సంపాదించే మార్గం మాత్రమే కాదు,అది ఒక వ్యక్తికి గౌరవం,సామాజిక భాగస్వామ్యం,ఆత్మగౌరవాన్ని కల్పించడం. ‘జాతీయ కార్మిక విధానం 2025-2047 ముసాయిదా’ కొద్ది రోజుల్లో అమలులోకి రాన...
Local to international