Skip to main content

Posts

దర్గా వన్నూరు, గోవిందవాడ, పాల్తూరు, ఉండబండ మీదుగా విద్యార్థులకు ఉరవకొండ కు బడి బసు ఏర్పాటు చేయాలి:(ఏ. ఐ. ఎస్. ఏ)

  దర్గా వన్నూరు, గోవిందవాడ, పాల్తూరు, ఉండబండ మీదుగా విద్యార్థులకు ఉరవకొండ కు బడి బసు ఏర్పాటు చేయాలి:(ఏ. ఐ. ఎస్. ఏ)ఉరవకొండ ఆర్. టీ. సి డిపో మేనేజర్ గారికి మంగళవారం అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ. ఐ. ఎస్. ఏ) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఉరవకొండ మండల అధ్యక్షులు మంజునాధ్ నాయక్ మాట్లాడుతూ.... దర్గా వన్నూరు,గోవిందా వాడ, పాల్తూరు, ఉండబండ గ్రామల నుండి విద్యార్థులు ఉరవకొండ పట్టణం కు వచ్చి విద్యను అభసిస్తున్నారు. కావున వారికీ సరైన బసు సౌకర్యం లేదు బడి బసు కూడా లేదు విద్యార్థులు రోజు ప్యాసింజర్ బాసులో చాలా ఇబంధులకు గురి అవుతూ వారు రోజు ప్రయాణం చేస్తున్నారు అంతే కాకా వారికీ సరైన సమయం లో బస్సు లేక ఉన్న అది ఫుల్ అవ్వడం డోర్ లో వరకు నిలబడడం కొంత మంది విద్యార్థులకు బస్సు లో సీట్లు దొరకక వారు కళాశాలలకు, పాఠశాలలకు వారు సరైన సమయం వెళ్లలేక విద్యార్థులు ఇబంధులు పడుతున్నారు.కావున వీరి పై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు దర్గా వన్నూరు,గోవిందా వాడ, పాల్తూరు, ఉండబండ గ్రామల నుండి ప్రత్యేక బడి బస్సు ఏర్పాటు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో ఏ. ఐ. ఎస్. ఏ నాయకులు సుధాకర్, ల...

అనంతపురంలో కౌలు రైతుల మహా ధర్నా: నూతన చట్టం, రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌

అనంతపురం: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం (ఏపీ కౌలు రైతు సంఘం) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ కౌలు రైతులకు వెంటనే నెరవేర్చాలని, వారికి పూర్తి స్థాయి గుర్తింపు కల్పించాలని సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన డిమాండ్లు ఇవే కౌలు రైతులు ప్రధానంగా ఆరు అంశాలను ప్రభుత్వం ముందు ఉంచారు. వీటిని తక్షణమే అమలు చేయాలని సంఘం నేతలు స్పష్టం చేశారు.  CCRC కార్డులు: క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డులు (CCRC) మంజూరు చేసే ప్రక్రియలో భూ యజమాని సంతకం నిబంధనను తొలగించాలి. భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు కార్డులు జారీ చేయాలి.   E-క్రాఫ్ట్ నమోదు: సాగు చేస్తున్న కౌలు రైతులందరినీ ఈ-క్రాఫ్ట్ కింద నమోదు చేసి, ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించాలి.   నూతన చట్టం: కౌలు రైతుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా నూతన కౌలు చట్టాన్ని రూపొందించాలి.   ఎక్స్‌గ్రేషియా: అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ప్రభుత్వమే రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్ల...

భూ వివాదంపై హైడ్రామా: సింగరాయకొండ ఎమ్మార్వోపై సీఎంకు సంచలన ఫిర్యాదు!

' పాసు పుస్తకాలు దొంగతనం', 'తప్పుడు కేసుల'తో వేధింపులు: అడ్వకేట్ స్వాతి ఆరోపణ ఒంగోలు/సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని కనుమళ్ళ గ్రామంలో తరతరాలుగా నడుస్తున్న భూ వివాదం పతాక స్థాయికి చేరింది. తమ కుటుంబ వ్యవసాయ భూములకు సంబంధించిన రికార్డుల గందరగోళం, పాసు పుస్తకాల దొంగతనం, మరియు తప్పుడు కేసులతో స్థానిక రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ కోమటిరెడ్డి కోటీశ్వరి @ స్వాతి భర్త రాఘవేంద్ర రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా రాష్ట్ర ఉన్నతాధికారులకు సంచలన ఫిర్యాదు దాఖలు చేశారు. 85 ఏళ్ల వృద్ధుడి రికార్డుల దొంగతనంపై ఫిర్యాదు రాఘవేంద్ర రెడ్డి తన ఫిర్యాదులో ప్రధానంగా తన 85 ఏళ్ల తండ్రి మన్నం కోటేశు @ కోటేశ్వర్ రావు మరియు తాత మన్నం కామయ్య వారసత్వ భూములను ప్రస్తావించారు.   దొంగతనం ఆరోపణ: 451, 452 ఖాతా నంబర్లకు సంబంధించిన పాసు పుస్తకాలు, బైటిల్ పుస్తకాలు, పాత అడంగల్/పహణి వంటి కీలక పత్రాలను తన బాబాయి మన్నం రంగారావు, 2006లో నానమ్మ మరణించిన రోజున దొంగతనంగా తీసుకెళ్లాడని ఆరోపించారు.   తప్పుడు చేర్పులు: తమ నాన్నగారి పేరున్న 338/3 సర్వే నెంబర్ (0.14 సెంట్లు) భూమిని అక్రమంగా చొప...

కూటమి హామీ ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: కణేకల్‌లో ఏఐకేఎంఎస్ డిమాండ్

   కణేకల్, నవంబర్ 17  ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం (AIKMS) నేతలు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో సోమవారం నాడు కణేకల్ మండల డిప్యూటీ ఎమ్మార్వోకు AIKMS ఆధ్వర్యంలో భారీ వినతి పత్రాన్ని సమర్పించారు. 18 నెలలైనా అమలు కాని హామీ కణేకల్ మండలంలోని కె. కొత్తపల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వందలాది నిరుపేదలు కేవలం కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారని, వారికి సొంత ఇళ్ల స్థలాలు లేవని AIKMS జిల్లా కార్యదర్శి సి. నాగరాజు తెలిపారు. నిరుపేదలైన ప్రజలకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు కావస్తున్నా, ఈ ముఖ్యమైన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అర్జీలు, పత్రాల సమర్పణ హామీల అమలులో జరుగుతున్న జాప్యం దృష్ట్యా, ఇళ్ల స్థలాల కోసం అర్హులైన నిరుపేదలందరి నుంచి దరఖాస్తులను సేకరించినట్లు నాయకు...

ఫోర్డ్ కంపెనీలో కోటి జీతంతో 5,000 మెకానిక్ పోస్టులు ఖాళీ

అమెరికాలో లక్షల సంఖ్యలో ఖాళీగా ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఏఐ యుగంలో నిజమైన విజేతలు నైపుణ్యం ఉన్న కార్మికులేనని వ్యాఖ్య కృత్రిమ మేధ (ఏఐ) రాకతో వైట్ కాలర్ ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే, దీనికంటే పెద్ద సంక్షోభం మన ముందు ఉందని, దాన్ని మనం గుర్తించడం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతే అసలైన సమస్య అని ఆయన తన ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు. అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం 'ఫోర్డ్' సీఈవో జిమ్ ఫార్లే ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయాన్ని ఆయన ఉటంకించారు. ఫోర్డ్‌లో ప్రస్తుతం 5,000 మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిలో చాలా వాటికి వార్షిక వేతనం రూ. కోటి (1,20,000 డాలర్లు)కి పైగా ఉన్నప్పటికీ భర్తీ కావడం లేదని మహీంద్రా పేర్కొన్నారు. ఇది కేవలం ఫోర్డ్ కంపెనీకే పరిమితం కాదని, అమెరికా వ్యాప్తంగా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ వంటి రంగాల్లో పది లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. దశాబ్దాలుగా మన సమాజం డిగ్రీలు, డెస్క్ ఉద్యోగాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, నైపుణ్యం ఆధారిత శ్రామిక శక్తిని విస్మరి...

అయ్ బాబోయ్, ఇది చాలా ఖరీదండీ

  వడ్డీకాసుల వాడికి వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవేతం సమర్పించారు హైదరాబాద్ భక్తుడు బాబూరావు.  4 కిలోల బంగారం, కోటి రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన ఈ యజ్ఞోపవేతాన్ని టీటీడీకి అందజేశారు. జదేవదేవుడి దర్శనానికి వెళ్లిన సమయంలో యజ్ఞోపవేతం ఇస్తావా? అని దేవుడు అడిగినట్టు అనిపించిందని.... వెంటనే దాన్ని తయారు చేయించి నెల రోజులు తిరగకుండానే అందజేశానని చెప్పారు బాబూరావు. దీని విలువ నాలున్నర కోట్ల రూపాయలని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవం: సమస్యలపై చర్చ

  ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శ్రీ భోజ్జి రెడ్డి అలాగే అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వెంకటప్ప ఎస్టీ కమిషన్ సభ్యుడిగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.  గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘంతో భేటీ ప్రమాణ స్వీకారం అనంతరం, గిరిజన వర్గాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్‌ను, సభ్యులను కలిశారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాకే పురుషోత్తం పాల్గొన్నారు. ఆయన ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చించిన ప్రధాన అంశాలు:   ఎస్టీ గురుకులాల సమస్యలు: గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, విద్యా నాణ్యత మెరుగుదలపై చర్చించారు.   ఎస్టీ హాస్టళ్లలో మౌలిక వసతులు: ఎస్టీ హాస్టళ్లలో కనీస సౌకర్యాల లేమిని ప్రస్తావించి, తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని కోరారు.   గిరిజనులకు లోన్ల మంజూరు: గిరిజనులకు రావాల్సిన వివిధ రకాల ప్రభుత్వ రుణాలు (లోన్లు) మంజూరు ...