ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం 1933లో ఆమోదించిన సెలవు నిబంధనలే కొన్ని సవరణతో "ఆంధ్రప్రదేశ్ సెలవు" నిబంధనలు - 1933" అను పేరుతో ఈనాటికీ అమలులో ఉన్నవి. ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్పు యొక్క అనెగ్జర్- III నందు ఆంధ్రప్రదేశ్ సెలవు నిబంధనలు- 1933 చేర్చబడియున్నవి. ఈ సెలవు నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు అన్ని యాజమాన్యములలోని ఉపాధ్యాయులకు వర్తించును. ఇందులో సంపాదిత సెలవు, అర్థజీతపు సెలవు, జీతనష్టపు సెలవు అను మూడు రకములున్నవి. యఫ్.ఆర్. అనెగ్జర్-VII నందు క్యాజువల్ సెలవులకు సంబంధించిన నిబంధనలు చేర్చబడియున్నవి. ఉద్యోగి అర్హత కలిగి వున్నప్పుడు అతడు కోరిన సెలవును మాత్రమే మంజూరు చేయాలి. 1.ఆకస్మిక(సాధారణ) సెలవు Casual Leave : *(ఎ)* ప్రతి ఉద్యోగి సం॥మునకు 15 రోజుల చొప్పున సాధారణ సెలవును జనవరి నుండి డిసెంబరు వరకు క్యాలెండర్ సం॥లో వాడుకోవాలి. (G.O.Ms. No. 52, dt: 4-2-1981) ఆదివారములు, నెలవు దీనములతో కలిపి కూడా వాడుకోవచ్చు. అయితే వరుసగా మొత్తం 10 రోజులకు మించరాదు. మంజూరి అధికారి పూర్వానుమతి పొందాలి (G.O.Ms.No. 112 Fin Dt. 3-6-1966).తాత్కాలిక ఉద్యోగులకు వారి సర్వీసును బట్టి దామాషా పద్ధతిల...
Local to international