హాల్ టికెట్లలో 'ముస్లిం'గా మార్చాలని లెనిన్ బాబు వినతి ఉరవకొండ డిసెంబర్ 4: ఇండియన్ హిందూ దూదేకులగా విద్యార్థుల సర్టిఫికెట్లు, హాల్ టికెట్లలో జరుగుతున్న నమోదుకు బదులుగా ఇండియన్ ముస్లిం దూదేకులగా నమోదు చేయాలని కోరుతూ నూర్ భాషా దూదేకుల సంఘం అధ్యక్షులు లెనిన్ బాబు వినతిపత్రం అందజేశారు. సోమవారం ఈ సందర్భంగా లెనిన్ బాబు మాట్లాడుతూ, నూర్ భాషా దూదేకుల, పింజారి, లద్దాఫ్ అని పిలవబడే తమ కుల పూర్వీకులు ఎన్నో తరాలుగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి పాటిస్తున్నారని తెలిపారు. తమ పుట్టుక నుంచి మరణం వరకు అన్ని కార్యక్రమాలు ఇస్లాం పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయని, తమ కులం ముస్లిం మైనారిటీలలో అంతర్భాగమే అని స్పష్టం చేశారు. అయితే, అవగాహన లోపం కారణంగా స్కూళ్లలో ఉపాధ్యాయులు తమ పిల్లల సర్టిఫికెట్లలో, చదువులలో కొలమానంగా చూపిస్తూ పది (10వ) తరగతి హాల్ టికెట్ల నందు బీసీల నందు హిందూ దూదేకులగా నమోదు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను గుర్తించి, మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న తమ విద్యార్థుల హాల్ టికెట్లు, టీసీలు (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు), ఇతర సర్టిఫికెట్ల నందు ఇండియన్ ...
Local to international