ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా
డిసెంబర్ 3రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం నాడు అనంతపురం కలెక్టరేట్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్తో కలిసి ఆయన మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం అమలు తీరుపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారంలో వేగం, నాణ్యతపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో డీఆర్‌ఓ ఏ. మలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, కేఆర్‌సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్, డీఎస్పీ మహబూబ్ భాష, హౌసింగ్ పీడీ శైలజ, డ్వామా పీడీ సలీమ్ భాష, బీసీ వెల్ఫేర్ డీడీ ఖుష్బూ కొఠారి, జడ్పీ సీఈఓ రామసుబ్బయ్య సహా వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Comments
Post a Comment