రథోత్సవంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి గుమ్మగట్ట, డిసెంబర్ 5 (ట్రూ టైమ్స్ ఇండియా): గుమ్మగట్ట మండలం, తాళ్లకేర గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వీరభద్రేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాయదుర్గం నియోజకవర్గ యువ నాయకుడు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్‌సీపీ) రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఈ రోజు ఉదయం 8:30 గంటలకు తాళ్లకేర గ్రామానికి చేరుకున్నారు. ముందుగా దేవస్థానంలో స్వామి వారి మూలవిరాట్‌కు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, స్థానిక భక్తులు, మండల నాయకులతో కలిసి వీరభద్రేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని లాగి, మొక్కులు తీర్చుకున్నారు. ప్రజలకు శుభాకాంక్షలు ఈ సందర్భంగా మెట్టు విశ్వనాథ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గం ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులందరు పాడి పంటలతో సుభిక్షంగా దినాభివృద్ధి చెందాలని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ రథోత్సవ కార...
Local to international