ఉరవకొండ మన జన ప్రగతి డిసెంబర్ 5:
భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) అనంతపురం జిల్లా 33వ మహాసభలు గుంతకల్‌లో (డిసెంబర్ 3, 4) జరిగాయి.
'డ్రగ్స్ & గంజాయి వ్యతిరేకిద్దాం' అనే నినాదంతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ మహాసభల్లో S.M. హరూన్ రషీద్ రెండవసారి SFI జిల్లా సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పెండింగ్‌లో ఉన్న రూ. 6,400 కోట్ల ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలి.
* SKU/JNTU వంటి యూనివర్సిటీలలో ఖాళీ అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి.
సంక్షేమ హాస్టల్స్‌లో మెస్ & కాస్మోటిక్ చార్జీలను రూ. 3,000 వరకు పెంచాలి.
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలి.
విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హరూన్ రషీద్ హెచ్చరించారు.

Comments
Post a Comment