ఉరవకొండలో అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతోత్సవ వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాల్గొని,సంబరంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన పాడిన పాటలను వారు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఘంటసాల వీరాభిమాని, సామాజిక సేవా కార్యకర్త, సీనియర్ ఎలక్ట్రీషియన్ ఉక్కీ సుల గోపాల్ మాట్లాడుతూ అమర గాయకుడు ఘంటసాల పేరు వినని వారు ఉండరన్నారన్నారు.
తెలుగు పాట జీవించినట్లు కాలం తెలుగు నేలపై చిరస్థాయిగా నిలిచి ఉంటుంది అని కొనియాడారు ఘంటసాల అసమాన ప్రతిభను ప్రతిభనుగోపాల్ కొనియాడారు. ఆయన మధుర గీతాలు యుగళ గీతాలు విషాద గీతాలు దేశభక్తి గీతాలు పాఠకుల స్మృతి పదంలో నిలిచాయన్నారు. ఘంటసాల అనగానే మనకు స్పురించేది ఆయన భగవద్గీత శ్లోకాలు వల్లివించినవి గుర్తొస్తాయని చెప్పారు ఘంటసాల సప్త స్వరాలు పలికించటంలో దిట్ట అని అభివర్ణించారు ఎన్నో కోట్ల మంది హృదయాలలో చెరగని ముద్ర వేసిన ఘనత కేవలం అమర గాయకుడు ఘంటసాల కు మాత్రమే దక్కుతుందని గోపాల్ ఉద్ఘటించారు.
ఘంటసాల కేవలం గాయకుడే కాక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవించి స్వాతంత్ర సమరయోధుడని చాటి చెప్పారు. బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయినా ఘంటసాల తన గాణామృతాన్ని ఎంతోమంది కి పంచారు. స్వాతంత్రం నా జన్మ హక్కుని చాటండి అని వాడి బ్రిటిష్ గుండెల్లో నిద్రించన ఘనుడు అమర గాయకుడు ఘంటసాల జయంతోత్సవ వేడుకల్లో వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు.
అనంతరం ఆయన ఆలపించిన చిత్ర గీతికలను అలాగే పద్యాలను గోపాల్ వల్లించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నిర్వాహకులు, ఘంటసాల అభిమానులు పాల్గొన్నారువార్డు సభ్యులు నిరంజన్ గౌడ్, లెనిన్ బాబు, మాస్టర్ తాటికొండ వెంకట్, టైలర్ బాబు తదితరులు పాల్గొన్నారు..

Comments
Post a Comment