- అనంతపురం జిల్లా కార్యాలయంలో నియామక పత్రం అందజేత ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 5: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనంతపురం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా దగ్గుపాటి సౌభాగ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేసి, పదవీ బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధ్యక్షులు కొనకొండ్ల రాజేష్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల (State Committee Members) ఆధ్వర్యంలో దగ్గుపాటి సౌభాగ్య ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. మహిళా సాధికారతకు కృషి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సౌభాగ్య శ్రీరామ్ (దగ్గుపాటి సౌభాగ్య) ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తనకు అప్పగించిన ఈ పదవీ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తానని, భారతీయ జనతా పార్టీ ఆదేశాలను, ఆశయాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి, మహిళాభ్యుదయ దిశగా చురుకుగా పని చేస్తానని దగ్గుపాటి సౌభాగ్య మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మహిళా మోర్చా కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Local to international