జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. కేశవరెడ్డి
ఉరవకొండ
డిసెంబర్ 10వ తేదీన అనంతపురంలో లలిత కళాపరిషత్ లో జరుగు సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కేశవరెడ్డి, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ
వేడుకలలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేవర గుడి జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాఫర్ తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన ఆణిముత్యాలు లాంటి కమ్యూనిస్టు యోధుల కుటుంబాలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిపిఐ 100 సంవత్సరాలలో అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. సిపిఐ దేశ స్వాతంత్ర ఉద్యమంలో అగ్ర భాగాన నిలిచిందని, ప్రజాస్వామ్య, లౌకిక, సామాజిక న్యాయం కోసం, ఉద్యమిస్తూనే మత ఉన్మధ విధానాలను ఎండగట్టింది అన్నారు. జిల్లాలో లక్షలాది ఎకరాల శివ యజమా భూమి పేదలకు పంచింది అన్నారు. భూస్వాములకు ఎదురొడ్డి పేద ప్రజలకు దాదాపు లక్ష ఎకరాల భూమిని పంచిన ఘనత సిపిఐది అన్నారు. ఉరవకొండ మండలంలో కౌకుంట్ల భూ పోరాటం మరువలేనిది అన్నారు. అంతేకాకుండా సాగునీరు, తాగునీరు సాగునీటి ప్రాజెక్టుల కోసం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికై, కృష్ణ జలాలు కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందన్నారు. 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ పార్టీని అనంతపురం జిల్లాలో తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖర్ రెడ్డి బలోపేతం చేశారన్నారు. అనంతర కాలంలో ఐదు కళ్ళు సదాశివన్ వీకే ఆదినారాయణ రెడ్డి జిల్లాలో పేదల కోసం అలుపెరుగని ఎన్నో పోరాటాలను నిర్వహించాలన్నారు. 1948 సంవత్సరంలో సిపిఐ పార్టీ మొదటి జిల్లా మహాసభ ఉరవకొండలో నిర్వహించడం జరిగిందన్నారు. ఉరవకొండ ప్రాంతంలో కూడా రాకెట్ల నారాయణరెడ్డి, చాయపురం రంగన్న, కోటిరెడ్డి లాంటి ఎంతోమంది యోధులు కమ్యూనిస్టు పార్టీ లో చురకైన నాయకులుగా పనిచేసే పేదల పక్షాన నిలబడ్డారన్నారు. ఉరవకొండ నియోజకవర్గం లో దాదాపు 49 మంది కమ్యూనిస్టు ఉద్యమంలో పని చేసిన ఆణిముత్యాల కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ కుటుంబాల అందరికీ కూడా డిసెంబర్ 10న జరిగే శతాబ్ది ఉత్సవాల్లో సత్కరించడం జరుగుతుందన్నారు. అనంతపురంలో జరిగే ఈ ఉత్సవాలకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు చెన్నారాయుడు, సుల్తాన్, గన్నే మల్లేష్, పురిడి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment