ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 4:
గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యులకు తక్షణమే ప్రభుత్వ గుర్తింపునిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జై భీమ్ రావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు సోమవారం నాడు ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ గురువారం ప్రకటిం చారు. బెలుగుప్ప మండలం లో దీక్షకు సంబంధించిన కరపత్రాన్ని అధికారికంగా విడుదల చేసిన సందర్భంగా రామప్ప నాయక్ మాట్లాడుతూ,
ప్రభుత్వ ఆసుపత్రులకు దూరంగా ఉన్న వారికి ప్రాథమిక వైద్య సాయం అందిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. వారి సేవలను గుర్తించి, వారికి తగిన గౌరవం, వృత్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. "ఆర్ఎంపీలకు
న్యాయం జరిగేలా, వారి వృత్తిని కొనసాగిం చేందుకు వీలుగా ప్రభుత్వం వెంటనే ప్రత్యేక జీవోను విడుదల చేయాలి. ప్రభుత్వం సాను కూలంగా స్పందించే వరకు మా రిలే నిరాహార దీక్ష నిరవధికంగా కొనసాగుతుందన్నారు." ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం సోమవారం (డిసెంబర్ 15) నాడు ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో జరుగుతుందని ఆయన తెలిపారు. ఆర్ఎంపీల సమస్యల పరిష్కారానికై ఈ పోరాటం చేపట్టినట్లు, ప్రభుత్వ స్పందనపై ఆధారపడి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని జై భీమ్ రావు భారత్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment