మొంథా తుఫాను నష్టం రూ.6,352 కోట్లు: కేంద్రానికి లోకేష్ నివేదిక, తక్షణ సహాయం కోరుతూ విజ్ఞప్తి ఉరవకొండ మన జన ప్రగతి డిసెంబర్ 2:
న్యూఢిల్లీ:డిసెంబర్ 2
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన భారీ నష్టానికి సంబంధించిన సమగ్ర నివేదికను ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంమంత్రికి సమర్పించారు.
రూ.6,352 కోట్ల మేర నష్టం
సమర్పించిన నివేదికలో మొంథా తుపాను వల్ల రాష్ట్రంలో అన్ని రంగాలకు కలిపి రూ.6,352 కోట్ల మేర భారీ నష్టం వాటిల్లినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో, తక్షణ సహాయం అందించాలని, పునరుద్ధరణ చర్యలకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ అత్యవసర భేటీలో లోకసభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు, రాష్ట్ర హోంమంత్రి అనిత మరియు పలువురు సహచర ఎంపీలు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం.

Comments
Post a Comment