హైదరాబాద్:డిసెంబర్ 02
ప్రభుత్వ రంగ బ్యాంక్ ల మలి విడత విలీన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది, ఐదేళ్ల క్రితం 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 కు తగ్గించింది ఇప్పుడు ఆ సంఖ్యను నాలుగు తగ్గించాలని చూస్తుంది.. కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో త్వరలోనే మరో భారీ మార్పుకు శ్రీకారం చుట్టనుంది, బ్యాంక్ ల మలి విడత విలీన ప్రక్రియను చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది...
అయితే ఈ 12 బ్యాంకుల విలీన ప్రక్రియ చేపట్టి నాలుగు బ్యాంకులుగా చేయాలని కేంద్ర ఆర్ధికశాఖ సమాలోచనలు చేస్తోంది. 2026-27 ఆర్ధిక సంవత్స రం కల్లా ఈ నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. బ్యాం కింగ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తు న్న కేంద్రం.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అను గుణంగా తీర్చిదిద్దాలని చూ స్తోంది. అందుకనుణంగా అడుగులు వేస్తోంది.
విలీనం తర్వాత కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బ రోడా, కెనరా-యూనియన్ బ్యాంక్ విలీనం తర్వాత ఏర్పడే మరో బ్యాంక్ మాత్రమే ఉండనున్నాయి. అంటే ఇండియాలో ఇక నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులను మాత్రమే మనం చూడనున్నామ న్నమాట.
తొలుత చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో విలీనం చేయనున్నారు. ఆనంతరం వాటిని నాలుగు బ్యాంకుల ను ఏర్పాటు చేయనున్నా రు. ఎస్‌బీఐలో ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్ విలీనం చేయనుండగా.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను కలిపి ఒకే బ్యాంక్‌గా మార్చనున్నారు.
ఇక ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీల్లో విలీనం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థికశాఖ విలీన ప్రక్రియ ఎలా చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తుండగా.. అనంతరం కేబినెట్ ఆమోదానికి పంపనున్నారు.కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ప్రధానమంత్రి కార్యాల యానికి ఫైల్ వెళ్లనుంది.
అంతేకాకుండా బ్యాంకుల విలీనంపై సెబీ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు తయారుచేస్తున్నారు. భారత్‌కు ప్రపంచస్థాయి బ్యాంకులు అవసరమంటూ ఇటీవల ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలతో బ్యాంకుల విలీనంపై మళ్లీ చర్చ మొద లైంది. బ్యాంకుల మలి విడత విలీనం మళ్లీ ఉంటుందని నిర్మలా సీతా రామన్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.

Comments
Post a Comment