సామాజిక కార్యకర్త బి ఎం నాదల్
విద్యతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని స్టీల్ ప్లాంట్ సాధన కమిటీ అధ్యక్షులు సామాజిక కార్యకర్త బి ఎం నాదల్ అన్నారు. శుక్రవారం డి హీరో హాల్ మండలంలోని మురిడి గ్రామంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎంపీటీసీ గంగాధర్ మరియు బి ఎం నాదల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో విద్యాశాఖలో సంస్కరణలు జరుగుతున్నాయని ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అందిస్తున్నారని అన్నారు. కొత్తగా పాల్ ల్యాబ్, బ్యూటిషన్ , సేల్స్ వంట్టి నైపుణ్య శిక్షణ విద్యార్థులకు నేర్పిస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యా సాధన తో చదవాలని పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడకూడదు అని అన్నారు. బి ఎం నాదల్ తమ సొంత నిధులతో డయాస్ షెడ్డు నిర్మాణం చేసి పాఠశాలల విద్యార్థులకు కానుకగా ఇస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments
Post a Comment