రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధి,నీళ్లు రెండు కళ్ళు. అయితే కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం కృష్ణా నదిపై 146.79 టీఎంసీలు,పెన్నా నదిపై 75.62 టీఎంసీలు మొత్తంగా 222.41 టీఎంసీల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు పెండింగ్ లో ఉండిపోయాయి.
కృష్ణా నదిపై నిర్మించిన జలాశయాలలో 1789 టీఎంసీలు,పెన్నా నదిపై నిర్మించిన జలాశయాలలో 103.78 టీఎంసీలు,మొత్తంగా 1892.78 టీఎంసీలు మాత్రమే నిలుపుకోగలుగుతున్నాము. వీటిలో సగం తెలంగాణా వాటా,శ్రీశైలం నీరు విద్యుత్ ఉత్పత్తి పేరుగా మీదుగా నాగార్జునసాగర్ కు.అయితే ప్రతి సంవత్సరం కృష్ణ,పెన్నా నదుల ద్వారా సముద్రంలో కలుస్తున్న నీరు సుమారు 3000 టీఎంసీలు, అంటే సగం నీటిని సముద్రం పాలు చేస్తున్నాము.ఈ నీరంతా అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోనే ప్రవహిస్తున్నది.దీనిని బట్టి పాలకవర్గాలకు రాయలసీమపై కనికరం,లేదనిఅర్థమవుతుంది
1956నుండి శ్రీ బాగ్ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ రాయలసీమ నాయకులే ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తూ, పరాయి ప్రాంతంలో నిర్భంధ అభివృద్ధి కేంద్రీకరణ చేస్తున్నారు.
మూడు పంటలు పండించే ప్రాంతంలోనే ప్రాజెక్టులు,జాతీయ ప్రాజెక్టులు,ఎత్తిపోతల పథకాలు నిర్మాణం చేస్తున్నారు.ఎప్పుడైనా తక్కువ వర్షాలు వచ్చినప్పుడు నీటిని స్టోరేజ్ చేసుకునేందుకు అక్కడ వ్యవస్థలన్నింటినీ అందులకు సిద్దం చేసి, రాయలసీమ ప్రాంతంలో మాత్రం తుంగభద్ర,కృష్ణా, పెన్నా నదులపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేయకుండా,తుంగభద్ర,శ్రీశైలం ప్రాజెక్టులను పూడికతో నింపుతూ వృధాగా నీటిని సముద్రం పాలు చేస్తున్నారు.
తుంగభద్ర,కృష్ణ ప్రాజెక్టుల పూడికతో నష్టపోతున్న నీటిలో సుమారు 60 టీఎంసీల నీటిని నిలుపుకోవడానికి
ఎటువంటి భూసేకరణ ఖర్చు లేకుండా,సిద్దేశ్వరం దగ్గర తీగల వంతెనకు బదులు బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేయవచ్చు.ఆ పని మాత్రం చేయకుండా కృష్ణానదికి తోరణంలా తీగల వంతెన నిర్మించి,వరద నీటికి స్వాగతం పలికి,మద్యకోస్తాకు నీరంతా సాగనంపడానికి సిద్ధమై, మరోసారి రాయలసీమ ద్రోహానికి తెర లేపింది నేడు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న డబల్ ఇంజన్ సర్కార్.
ఈ అన్యాయాలను చూస్తున్న రాయలసీమ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.

Comments
Post a Comment