ముఖ్యఅతిథిగా పాల్గొన్న విడపనకల్ ఎంపిపి కరణం పుష్పావతి భీమరెడ్డి.
-విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇలాంటి సమావేశాలు దోహదం చేస్తాయన్న ఎంపీపీ_
ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 5:
విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో ఉన్న జడ్పీ హైస్కూల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విడపనకల్లు ఎంపీపీ కరణం పుష్పావతి భీమిరెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు విద్యార్థుల పురోగతికి దోహదం చేస్తాయని,అదేవిధంగా గవర్నమెంట్ అందించే ఆర్థిక ప్రోత్సాహం కానీ లేదా ఇతర సదుపాయాలు గాని ప్రభుత్వ పాఠశాలలకే వర్తింపచేయాలని,తద్వారా ప్రభుత్వ పాఠశాలలో నమోదు సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.అంతకుముందు విద్యార్థులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంఘిక,విజ్ఞాన ప్రదర్శనశాలను విద్యార్థుల తల్లిదండ్రులు,ఉపాధ్యాయులతో కలిసి ఎంపీపీ సందర్శించి,మంచి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ మనోహర్,పేరెంట్స్ కమిటీ సభ్యులు,ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు._


Comments
Post a Comment