పాల్గొన్న ఎంపీపీ కరణం పుష్పావతి భీమరెడ్డి,కన్వీనర్ రమేష్,సీనియర్ లీడర్ భీమరెడ్డి._
_రాబోవు రోజులలో కమిటీ సభ్యులే వైయస్సార్సీపీకి తిరుగులేని సైన్యంగా మారతారన్న ఎంపీపీ._
ఉరవకొండ:ట్రూ టైమ్స్ ఇండియా డిసెంబర్ 4:
విడపనకల్ మండలం గడేకల్ గ్రామంలో విడపనకల్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కురుబ రమేష్ ఆధ్వర్యంలో ఎంపీపీ కరణం పుష్పావతి భీమరెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.వివరాలలోకి వెళితే గడేకల్ వైయస్సార్ సిపి అధ్యక్షుడిగా బుడ్డే ప్రసాద్ (గొరువ),బీసీ విభాగం అధ్యక్షుడిగా కోనప్ప గారి జయరాముడు(వాల్మీకి),యూత్ విభాగం అధ్యక్షుడుగా అశోక్ కుమార్ రెడ్డి(లింగాయత్),ఎస్సీ విభాగం అధ్యక్షుడిగా మారెప్ప(హరిజన),సోషల్ మీడియా అధ్యక్షుడుగా పాలెం విశ్వనాథరెడ్డి(లింగాయత్)మహిళా విభాగం అధ్యక్షురాలుగా నేసే వెంకటలక్ష్మి(నేసే),రైతు విభాగం అధ్యక్షుడిగా ప్రతాప్ రెడ్డి(లింగాయత్)లతో పాటు ప్రధానకార్యదర్శులను,కార్యదర్శులను, మెంబర్లను ఎన్నుకోవడం జరిగింది.గ్రామ కమిటీలు ఎన్నికకు ముందు ఎంపీపీ కరణం పుష్పావతి భీమరెడ్డి మాట్లాడుతూ నికార్సైన కార్యకర్తలను మాత్రమే గ్రామ కమిటీలలోకి తీసుకోవాలని,తద్వారా పార్టీ పటిష్టతను మరింత పెంచడంతోపాటు,కార్యకర్తలకు మంచిదని,రాబోవు రోజులలో ఈ కమిటీలు వైయస్సార్సీపీకి తిరుగులేని సైన్యంగా మారబోతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ లీడర్ కరణం భీమరెడ్డి,సర్పంచ్ సుశీల,ఎంపిటిసి ఓబులేష్,నాయకులు హంపయ్య,హేమంత్,ఉమాశంకర్,కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు._

Comments
Post a Comment